Ads
క్రికెటర్లు తమ ఆట గురించే కాకుండా వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన అంశాలతో కూడా హెడ్ లైన్స్ లో నిలుస్తారు. అభిమానులు కూడా సోషల్ మీడియాలో క్రికెటర్ల గర్ల్ ఫ్రెండ్స్ లేదా భార్యలను ఫాలో అవుతారు. వారి వ్యక్తిగత జీవితాలపై ఆసక్తి చూపుతారు. ఏ క్రికెటర్ పెళ్లి చేసుకున్నాడు, ఎవరితో ఏ క్రికెటర్ ఎఫైర్ నడుస్తోంది.. ఏ క్రికెటర్ బ్రేకప్ అయ్యాడు.. ఏ క్రికెటర్ విడాకులు తీసుకున్నాడు.. ఈ వార్తలపైనే అభిమానులు ఎక్కువ ఫోకస్ చేస్తారు.
Video Advertisement
క్రికెటర్ల పెళ్లి, విడాకుల విషయానికి వస్తే.. అంతా తెలుసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు భార్యల ద్వారా మోసపోయిన ముగ్గురు క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.
#1 దినేష్ కార్తిక్
ఈ లిస్ట్ లో అందరికి మొదట గుర్తుకు వచ్చేది దినేష్ కార్తీక్ పేరు. దినేష్ కార్తీక్ తన చిన్ననాటి స్నేహితురాలు నికితా వంజారాను 2007లో వివాహం చేసుకున్నాడు. పెళ్లయిన కొన్నేళ్ల తర్వాత దినేష్ కార్తీక్ మొదటి భార్య నికితా వంజారా అతడిని మోసం చేసి 2012లో టీమిండియా బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్‌ని పెళ్లి చేసుకుంది.
డీకే, మురళి విజయ్ తమిళనాడు జట్టుకు కలిసి ఆడేవారు. అయితే ఈ పరిచయం తో తరచూ అతడి ఇంటికి వెళ్ళేవాడు మురళి విజయ్. అలా డీకే భార్య తో కలిసి అతడిని మోసం చేసాడు మురళి విజయ్. ఆ తర్వాత నేష్ కార్తీక్ 2015లో భారత స్క్వాష్ క్రీడాకారిణి దీపికా పల్లికల్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి కావాలా పిల్లలున్నారు.
#2 బ్రెట్ లీ
ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ కూడా అతని భార్య చేతిలో మోసపోయాడు. బ్రెట్ లీని మోసం చేసి క్రికెటర్‌ని కాకుండా రగ్బీ ప్లేయర్‌ని వివాహం చేసుకుంది. బ్రెట్ లీ గేమ్ వల్ల తనకు సమయం ఇవ్వకపోవడం తో అతడి నుంచి విడాకులు తీసుకుంది అతడి భార్య.
వృత్తిరీత్యా డాక్టర్ అయిన ఎలిజబెత్ క్యాంప్ ని 2006 లో వివాహం చేసుకున్నాడు బ్రెట్ లీ. బ్రెట్ లీ 2009లో ఎలిజబెత్‌కు విడాకులు ఇచ్చాడు. ఎలిజబెత్ నుండి విడిపోయిన తర్వాత.. బ్రెట్ లీ 2014లో లానా ఆండర్సన్‌ను వివాహం చేసుకున్నాడు.
#3 తిలకరత్నే దిల్షాన్
శ్రీలంక వెటరన్ బ్యాట్స్‌మెన్ తిలకరత్నే దిల్షాన్ కథ కూడా దినేష్ కార్తీక్‌ను పోలి ఉంటుంది. దిల్షాన్ భార్య నీలంక వితేజ్ కూడా అతడిని వదిలి మరో క్రికెటర్‌ని పెళ్లి చేసుకుంది.
దిల్షాన్ దీర్ఘకాల ఓపెనింగ్ భాగస్వామి అయిన ఉపుల్ తరంగను వివాహం చేసుకుంది నీలంక. వీరిద్దరూ ప్రాణ స్నేహితులు. నీలంక వితేంగేతో విడాకులు తీసుకున్న తర్వాత తిలకరత్నే దిల్షాన్ తన స్నేహితురాలు మంజులను 2008లో మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ ఇప్పుడు ఇద్దరు పిల్లలు.
End of Article