క్రికెట్ ఆటకు ఉండే క్రేజ్ అందరికి తెలిసింది. పిల్లల దగ్గరిని నుండి పెద్దవారి వరకు ఎంతో ఆసక్తి గా చూసే ఆట అంటే క్రికెట్ అని చెప్పవచ్చు. ఎన్నో తరాల నుండి ఆడుతున్న క్రికెట్ లో ఇప్పటివరకు ఎంతో మంది ఆటగాళ్లు ఆడారు. అయితే వారిలో చాలా మంది తండ్రీ కొడుకులు కూడా ఉన్నారు. మరి ఆ తండ్రి కొడుకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
1. సచిన్ మరియు అర్జున్ టెండూల్కర్:
క్రికెట్ దేవుడిగా పేరు గాంచిన సంచిన టెండూల్కర్ ఆట గురించి ఆయన పేరుతో ఉన్న రికార్డుల గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. క్రికెట్ అంటే సచిన్, సచిన్ అంటే క్రికెట్ అనేంతగా తన కెరీర్ ను కొనసాగించారు. సచిన్ ని ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది క్రికెటర్లుగా ఎదిగారు. ఆయన్ కుమారుడు అర్జున్ కూడా క్రికెట్ ను కెరీర్ ర్ గా ఎంచుకున్నారు. తండ్రిలాగే తొలి రంజీ మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఈసీజన్ లో ఐపిఎల్ ముంబై జట్టు తరుపున అడుతున్నాడు.
2.విజయ్ మంజ్రేకర్ మరియు సంజయ్ మంజ్రేకర్:
స్వాతంత్య్రానంతరం టెస్ట్ లో ఇండియాకి బ్యాటింగ్ చేసిన మొదటి క్రికెటర్ గా విజయ్ మంజ్రేకర్‌గా నిలిచాడు. అతను ఆడే సమయంలో అత్యుత్తమ క్రికెటర్స్ లో ఒకరిగా ఉన్నారు. 1952లో భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన విజయ్, దేశం కోసం 55 టెస్టులు ఆడాడు. ఆయన కుమారుడు సంజయ్ మంజ్రేకర్ 80లో కెరీర్ మొదలు పెట్టారు.సంజయ్ 37 టెస్టులు మరియు 74 ODIలలో ఇండియాకి ప్రాతినిధ్యం వహించాడు.
3.లాలా మరియు మొహిందర్ అమర్‌నాథ్:
లాలా అమర్‌నాథ్ తన కాలంలో అత్యుత్తమ ఆల్ రౌండర్. ఆయన టెస్టుల్లో సెంచరీ చేసిన మొదటి క్రికెటర్. ఆయన ఇద్దరు కుమారులు క్రికెటర్లే. సురీందర్ మరియు మొహిందర్ అమర్‌నాథ్. ఈ తండ్రీకొడుకులు తమ మొదటి మ్యాచ్‌లలో సెంచరీ చేసిన ఏకైక ద్వయం. ఆయన చిన్న కుమారుడు మొహిందర్ అమర్‌నాథ్ అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరు. మొహిందర్ 1983 ప్రపంచ కప్‌లో ముఖ్యమైన పాత్రను పోషించాడు.
4.సునీల్ మరియు రోహన్ గవాస్కర్:
సునీల్ గవాస్కర్ భారత దిగ్గజ క్రికెటర్లలో ఒకరు.టెస్ట్ క్రికెట్‌లో 10000 పరుగుల మార్క్‌ను దాటిన తొలి బ్యాట్స్‌మన్.ఆయన కుమారుడు రోహన్ గవాస్కర్ ఇండియా జట్టుకి ఆడాడు. అయితే తన తండ్రికి అంత పేరును సాధించలేకపోయాడు.
5.యోగరాజ్ మరియు యువరాజ్ సింగ్:
యోగరాజ్ సింగ్ ఇండియా తరపున ఒక టెస్టు మరియు వన్డే మాత్రమే ఆడాడు.ఆయన కుమారుడు యువరాజ్ సింగ్ భారత జట్టులో ప్రముఖ క్రికెటర్.అతని T20 మరియు వన్డే ప్రపంచ కప్ లలో మ్యాన్ ఆఫ్ టోర్నమెంట్ సాధించాడు.
6.రోజర్ మరియు స్టువర్ట్ బిన్నీ:
ఇండియా క్రికెట్ జట్టులోని అత్యుత్తమ ఆల్ రౌండర్లలో రోజర్ బిన్నీ ఒకరు. 1983 ప్రపంచకప్‌లో ఎక్కువ వికెట్లు తీశాడు. ఆయన కుమారుడు స్టువర్ట్ బిన్నీ కూడా ఆల్ రౌండర్.
7.నవాబ్ ఇఫ్తీకర్ అలీ ఖాన్ పటౌడీ మరియు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ:
సీనియర్ నవాబ్ 6 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు మరియు ఇండియా తరపున ఆడిన తొలి మ్యాచ్ లో సెంచరీ సాధించాడు. ఆయన భారత్, ఇంగ్లండ్ తరఫున ఆడిన ఒకేఒక ఆటగాడు. ఆయన కుమారుడు మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ కూడా భారత క్రికెట్ జట్టులో కీలక పాత్ర పోషించాడు. అతి చిన్న వయస్కుడైన టెస్టు కెప్టెన్‌గా నిలిచాడు.
8.లెబ్రూన్ మరియు లియరీ కాన్స్టాంటైన్:
వెస్ట్ ఇండీస్ క్రికెటర్లు అయిన ఈ తండ్రీకొడుకులు లెబ్రూన్ మరియు లియారీ కాన్‌స్టాంటైన్ చరిత్ర సృష్టించారు. కరేబియన్ క్రికెట్ లో గొప్ప ఆటగాళ్ళుగా పేరు తెచ్చుకున్నారు.9.కోలిన్ మరియు క్రిస్ కౌడ్రీ:
ఈ తండ్రీకొడుకులు ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం వహించారు. కోలిన్ 100కు పైగా టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా నిలిచాడు. ఆయన కుమారుడు క్రిస్ కౌడ్రీ తన తొలి మ్యాచ్‌లో తొలి ఓవర్‌లో కపిల్ దేవ్‌ను అవుట్ చేశాడు.
10.జియోఫ్ మరియు షాన్ మరియు మిచ్ మార్ష్:
ఆస్ట్రేలియన్ మాజీ క్రికెటర్ మరియు కోచ్ అయిన జియోఫ్ మార్ష్ ప్రపంచకప్ సాధించడంలో ముఖ్య పాత్రను పోషించాడు. ఆయన ఇద్దరు కుమారులు కూడా క్రికెటర్లుగా రాణించారు. పెద్ద కుమారుడు షాన్ ఓపెనర్, చిన్న కుమారుడు మిచ్ ఆల్ రౌండర్.
11.పీటర్ మరియు షాన్ పొల్లాక్:
పీటర్ పొలాక్ దక్షిణాఫ్రికా జట్టుకు ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్. దక్షిణాఫ్రికా జట్టులోని అత్యంత ప్రతిభావంతులైన ఆల్ రౌండర్లలో షాన్ పొలాక్ ఒకరు. ఆయన 100 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు.
12.క్రిస్ మరియు స్టువర్ట్ బ్రాడ్:
క్రిస్ ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్‌గా ఉండేవారు.ఆయన కుమారుడు స్టువర్ట్ బ్రాడ్ ప్రసిద్ధుడైన ఫాస్ట్ బౌలర్. ఒక టెస్టు మ్యాచ్‌లో తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి, అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.Also Read: “2016 మళ్లీ రిపీట్ అవుతుంది..!” అంటూ… KKR VS SRH మ్యాచ్ లో “హైదరాబాద్” గెలవడంపై 15 మీమ్స్..!