వీడియో: 50 వేల రూపాయల ఫోన్ ఆర్డర్ చేస్తే ఏమోచ్చాయో చూడండి.!

వీడియో: 50 వేల రూపాయల ఫోన్ ఆర్డర్ చేస్తే ఏమోచ్చాయో చూడండి.!

by Mohana Priya

Ads

చాలా మందికి బయటికి వెళ్లి వస్తువులు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అయితే ఇలా బయటికి వెళ్లి మనకు కావాల్సింది కొని తెచ్చుకోవడం ఎంతో కష్టమవుతోంది. దాంతో అందరం ఆన్లైన్ షాపింగ్ పద్ధతినే పాటిస్తున్నాం. దాంతో ఎంతో సమయం కూడా ఆదా అవుతుంది. అందుకే ఇటీవలి కొద్ది సంవత్సరాల నుండి ఆన్లైన్ షాపింగ్ క్రేజ్ బాగా పెరిగిపోయింది.

Video Advertisement

Customer recieved soap instead of iPhone on Flipkart

చిన్న చిన్న వస్తువుల నుండి, పెద్ద పెద్ద వస్తువుల వరకు అన్నీ ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తున్నాం. ఒకవేళ వస్తువులో ఏదైనా సమస్య వచ్చినా, లేదా అది మనకి నచ్చకపోయినా రిటర్న్ ఇవ్వడం వంటివి చేయొచ్చు. అయితే ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు మనం ఆర్డర్ చేసిన ఐటమ్ ఒక్కొక్కసారి సరిగ్గా రాదు. అంటే, దాని ప్లేస్ లో వేరే ఐటమ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలా ఇటీవల ఒక వ్యక్తికి ఇలాంటి సంఘటన ఎదురయ్యింది. కానీ అసలు ఆ వ్యక్తి ఆర్డర్ చేసిన వస్తువుకి, వచ్చిన వస్తువుకి సంబంధమే లేదు.

Customer recieved soap instead of iPhone on Flipkart

వివరాల్లోకి వెళితే, సిమ్రాన్ పాల్ అనే ఒక వ్యక్తి ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ నడుస్తుండటంతో, ఐఫోన్ ఆర్డర్ పెట్టారు. 50 వేల ఫోన్ ఆర్డర్ పెడితే, ఆ వ్యక్తికి వచ్చిన ఆర్డర్ లో రెండు బట్టల సబ్బులు ఉన్నాయి. ఆ వ్యక్తి ఆ వీడియో తీసి యుట్యూబ్ లో అప్‌లోడ్ చేశారు. సిమ్రాన్ పాల్  అలా చాలా సేపు కష్ట పడిన తర్వాత కస్టమర్ సర్వీస్ వారు వారి తప్పును ఒప్పుకున్నారు. తర్వాత డబ్బులు తిరిగి చేస్తామని చెప్పారు. ముందు ప్రొడక్ట్ డెలివరీ అయిపోయింది అని, వారి సిస్టమ్స్ లో ప్రొడక్ట్ డెలివరీ అయింది అని వచ్చింది అని చెప్పారు. తర్వాత రీఫండ్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు.

watch video :


End of Article

You may also like