Ads
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే క్రికెటర్ల తలరాతను మార్చే టోర్నమెంట్ అని చెప్పవచ్చు. ఈ లీగ్ వల్ల చాలా మంది యువ ఆటగాళ్లు తమ టాలెంట్ ను చాటుకున్నారు.
Video Advertisement
ఇక్కడ బాగా ఆడినవారు జాతీయ జట్లలో చోటు సంపాదించుకున్నారు. ఐపీఎల్ ద్వారా ఆటగాళ్లు అవకాశాలు, డబ్బులు,పేరు తెచ్చుకుంటున్నారు. వారు తక్కువ కాలంలో కోట్లు సంపాదిస్తున్నారు. టీమ్ ఇండియా పటిష్టంగా కనపడడానికి కారణం ఐపీఎల్ అని చెప్పవచ్చు.
క్రికెట్ లీగ్స్ లో ప్రపంచంలోనే అత్యంత ధనిక లీగ్ అంటే ఐపీఎల్. అయితే పైకి కనిపిస్తుందంతా కూడా నాణేనికి ఒకవైపే అని చెప్పవచ్చు. మరోవైపు డిని వెనుకళా అనేక చీకటి కోణాలు కూడా ఉన్నాయి. అవే బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్, మద్యం, డ్రగ్స్ వంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చాలా కనపడతాయి. కానీ ఐపీఎల్ మెరుపుల మధ్య ఇలాంటివి బయటకు కనిపించవు. అయితే ఆ చీకటి కోణాల గురించి ఇప్పుడు చూద్దాం..
ఫిక్సింగ్:
ఐపీఎల్ 2013 కు సంబంధించిన ఒక సెన్సేషనల్ విషయం బయటకు వచ్చింది.రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ముగ్గురు క్రికెటర్లు డబ్బులు తీసుకుని మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు ఢిల్లీ పోలీసులు గుర్తించారు. ఈ విషయం అంతర్జాతీయంగా సంచలనంగా మారింది. ఆ క్రికెటర్లు శ్రీశాంత్, అంకిత్ చౌహాన్, అజయ్ చండీలా బుకీల దగ్గర డబ్బు తీసుకుని ఫిక్సింగ్‌కు పాల్పడిన విషయం నిరూపణ అయింది. ఒక ఓవర్‌లో 14 కన్నా ఎక్కువ రన్స్ ఇవ్వడానికి శ్రీశాంత్ బాల్ తుడిచే టవల్‌ను ముందు పెట్టుకుని, సిగ్నల్ ఇవ్వడం ద్వారా మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడు.
శ్రీశాంత్ అప్పటికి భారత జట్టులో కీలక ఆటగాడుగా ఉన్నాడు. అంతేకాక ఇండియా గెలిచిన టీ20 మరియు వన్డే ప్రపంచ కప్ జట్లలో శ్రీశాంత్ మెంబర్ గా ఉన్నాడు.అటువంటి ఆటగాడు ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడంటే యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇక ఈ వివాదంలో ఏం ఎస్ ధోని పేరు వినిపించింది. దాంతో రాజస్థాన్, చెన్నై జట్ల పై 2 సంవత్సరాల పాటు నిషేధం విధించారు. ఆ ముగ్గురు క్రికెటర్ల పై జీవితకాల నిషేధం వేశారు.ఆ తర్వాత నిషేధం తొలగించారు.
ఇలాంటిదే ఇంకోసారి కేకేఆర్, పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టాస్ వేసేప్పుడు గందరగోళం జరిగింది. కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ టాస్ వేయడం కోసం కాయిన్ గాల్లోకి ఎగరేసాడు. అప్పుడు పంజాబ్ కెప్టెన్ మురళీ విజయ్ హెడ్స్ అని అన్నట్లు కామెంటేటర్‌గా రవిశాస్త్రి అన్నారు.అయితే మ్యాచ్ రిఫరీ మాత్రం టేయిల్స్ పడిందని, పంజాబ్ కెప్టెన్ టాస్ గెలిచినట్లుగా చెప్పాడు.ఈ సంఘటన కూడా అప్పట్లో సంచలనం అయ్యింది. దీంతో ఐపీఎల్ అంటే ఫిక్సింగ్ అని క్రికెట్ ఫ్యాన్స్ ఆరోపించారు.
పార్టీలు:
ఐపీఎల్‌లో ఆటతో పాటుగా ప్లేయర్స్ ఎంజాయ్ చేయడానికి, ఖాళీ సమయంలో సరదాగా గడపడం కోసం ఫ్రాంచైజీలు పార్టీలు ఏర్పాట్లు చేస్తుంటాయి.మ్యాచ్ గెలిచిన అనంతరం రెస్టారెంట్స్‌లో, హోటల్స్‌లో పార్టీల్లో ఆటగాళ్లు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ విధంగా రేవ్ పార్టీల కల్చర్ కూడా ప్లేయర్స్ కి అలవాటైంది.
ఈ పార్టీలలో విచ్చల విడిగా మద్యం, డ్రగ్స్ అందుబాటులో ఉంటాయని తెలుస్తోంది. ఒక రేవ్ పార్టీలో క్రికెటర్ రాహుల్ శర్మ, సౌతాఫ్రికా ప్లేయర్ వాన్ పార్నెల్ పోలీసులకు దొరికారు.ఆ పార్టీలో ఇద్దరు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు విచారణలో తెలిసింది. దీంతో ఇద్దరిని బీసీసీఐ కొన్ని సంవత్సరాల పాటు బ్యాన్ చేసింది.ప్రస్తుతం ఆర్సీబీ జట్టుకి పార్నెల్ ఆడుతున్నాడు.
బ్లాక్‌మనీ:
అత్యంత ధనిక లీగ్ అయిన ఐపీఎల్‌లో నల్లడబ్బు కూడా రాజ్యమేలుతోందని వాదన కూడా ఉండి.దీనిని ప్రజలు ఎంతగానో నమ్ముతున్నారు.ఈ వాదనకు బలం చేకూర్చే విషయాలు కూడా ఉన్నాయి. పూణె వారియర్స్ జట్టు ప్లేయర్ మోహినిష్ మిశ్రా స్టింగ్ ఆపరేషన్‌లో ఇలా చెప్పుకోచ్చాడు.
ఐపీఎల్‌లో పూణె జట్టు తనని ముప్పై లక్షలకు కొనుగోలు చేసిందని, కానీ ఆ తర్వాత అవి కాకుండా మరో డెబ్బై లక్షలు ఇచ్చినట్లుగా తెలిపాడు. అయితే ఆ డెబ్బై లక్షలకు ఎటువంటి లెక్కలు పూణే ఫ్రాంచైజి తెలపలేదు.ఈ విషయంతో దాదాపు ప్లేయర్స్ అందరికి కూడా ఈ విధంగా బ్లాక్ మనీ ఇస్తారని క్రికెట్ ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.
ఛీర్ లీడర్స్ లైఫ్:
ఐపీఎల్ లో పాపులర్ అయిన విషయాలలో ఒకటి ఛీర్ లీడర్స్. వీరు తమ జట్టుకి మద్దతుగా ఆడిపాడుతూ ఆడియెన్స్ కి వినోదం కలిగిస్తుంటారు. ఛీర్ లీడర్స్ ను ఫ్రాంచైజీలే ఏర్పాటు చేస్తారు. వీరిలో విదేశీ ఛీర్ లీడర్స్ ఎక్కువగా కనిపించే వారు. వారి లైఫ్ ఎంత దారుణంగా ఉంటుందో ఛీర్ గల్స్‌గా పని చేసినవారు చాలా సందర్భాల్లో తెలిపారు.
వారిని కనీసం మనుషుల్లాగా కూడా చూడరని, ఆడియెన్స్ కూడా తమతో చాలా అసభ్యంగా మాట్లాతూ, సైగలు చేస్తూ ఇబ్బంది పెడతారని తమ బాధను వ్యక్తం చేశారు. బతుకుతెరువు కోసం మాత్రమే ఈ పని చేస్తున్నామని ఎంతోమంది మమ్మల్ని నీచంగా చూసే వారని వెల్లడించారు.
వాస్తవానికి ఐపీఎల్‌ను మొదలు పెడుతున్నది ఇండియాలోని యువ ఆటగాళ్లను ప్రొత్సహించడానికి, మట్టిలో ఉన్న మాణిక్యాలను బయటకు తీయడానికి అని బీసీసీఐ తెలిపింది. కానీ ఇది డబ్బుతో ముడిపడిన లీగ్ అని కొన్ని రోజుల్లోనే అందరికీ అర్ధం అయ్యింది. ఒకరిద్దరూ ప్లేయర్స్ ఐపీఎల్ ద్వారా బయటకు వచ్చినప్పటికి, ఈ లీగ్ ప్రధాన ఉద్దేశం అయితే డబ్బే అని సగటు క్రికెట్ ఫ్యాన్స్ తో పాటు క్రికెట్ నిపుణులు కూడా భావిస్తున్నారు.
Also Read:భారతదేశ “క్రికెట్” చరిత్రలో… టీంలో 5 దురదృష్టకర ప్లేయర్స్..!
End of Article