భారతదేశ “క్రికెట్” చరిత్రలో… టీంలో 5 దురదృష్టకర ప్లేయర్స్..!

భారతదేశ “క్రికెట్” చరిత్రలో… టీంలో 5 దురదృష్టకర ప్లేయర్స్..!

by kavitha

Ads

ఇండియాలో అత్యంత ఇష్టపడే క్రీడలలో క్రికెట్ అగ్ర స్థానంలో ఉంటుంది. క్రికెట్ కెరీర్‌ గా ఎంచుకోవడానికి కూడా  చాలా పోటీ ఉంది. భారత జట్టులో స్థానం సంపాదించాలని ఎంతోమంది కల కంటూ ఉంటారు. ఎంతో టాలెంట్ ఉంటే తప్ప భారత జట్టులో చోటు సంపాదించలేరు.

Video Advertisement

అయితే కొంతమంది క్రికెటర్లకు ఎంతో ప్రతిభ ఉన్నప్పటికి, వారికి నిరూపించుకోవడానికి తగిన అవకాశాలు రావడం లేదు. అలా ఛాన్స్ లు లేక టన్నుల కొద్దీ ప్రతిభ, క్రికెట్ పట్ల ఎంతో ఆసక్తి ఉన్నా, కొందరు దురదృష్టం కొద్ది లెజెండరీ క్రికెటర్లుగా ఎదగలేకపోయారు. అలాంటి 5 గురు ఇండియన్ క్రికెటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
5-famous-unlucky-cricketers-of-india1. అంబటి రాయుడు:

అంబటి రాయుడు 2019 ప్రపంచకప్‌కు ముందు, జరిగిన మ్యాచ్ లలో అద్భుతంగా రాణించాడు. కానీ సెలక్టర్లు త్రీడీ ఆటగాడికి ప్రాధాన్యత ఇస్తూ, రాయుడును జట్టు నుంచి సడెన్ గా తొలగించారు. అయితే ప్రపంచకప్‌లో ఆటగాళ్లకు గాయపడ్డారు. అయినా , స్టాండ్‌బై ప్లేయర్‌గా ఉన్న రాయుడుని సెలెక్టర్లు జట్టులోకి తీసుకోలేదు. దీంతో అంబటి రాయుడు విచారంగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అలా అతని కల చెదిరిపోయింది.
2. కరుణ్ నాయర్:

వీరేంద్ర సెహ్వాగ్ తరువాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌ జట్టు పై ట్రిపుల్ సెంచరీ చేసి, ఇండియన్ క్రికెట్ చరిత్రలో రెండో బ్యాట్స్ మెన్ గా నిలిచాడు. కానీ దురదృష్టం నాయర్ ను వెంటాడింది. ట్రిపుల్ సెంచరీని చేసిన తర్వాత, జట్టులోకి తీసుకోలేదు. సాధారణంగా సెంచరీ చేసిన ఆటగాడు తరువాతి ఆటలో అయినా జట్టులో స్థానం దొరికే అవకాశం ఉంటుంది. కానీ ట్రిపుల్ సెంచరీ బాదిన నాయర్‌కు చోటు దక్కలేదు. క్రికెట్ చరిత్రలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదు.
3. వసీం జాఫర్:

వసీం జాఫర్ ‘ది లెజెండ్ ఆఫ్ డొమెస్టిక్ క్రికెట్’ గా పేరు గాంచాడు. జాఫర్ దేశవాళీ క్రికెట్‌లో ఇప్పటి వరకు ఎక్కువ పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. అతను 186 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో ముంబైకి ఆడుతున్న సమయంలో 14609 పరుగులు చేశాడు. అంతే కాకుండా ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 46 సెంచరీలు చేశాడు.

2000లో అరంగేట్రం చేసిన జాఫర్ 31 టెస్టు మ్యాచ్‌ల్లో 34.11 రన్స్ సగటుతో 1944 రన్స్ చేశాడు. అప్పట్లో ఇది గౌరవప్రదమైన రికార్డు. అయితే, భారత జట్టుకు కఠిన సమయం రావడంతో, ప్లేయర్స్ రొటేషన్స్ లో మారుతుండడంతో అద్భుతమైన బ్యాటింగ్ టెక్నిక్ ఉన్నప్పటికీ, దురదృష్టం కొద్ది అతను జట్టులో స్థానం
కోల్పోయాడు.
4. ఇర్ఫాన్ పఠాన్:

ఇర్ఫాన్ పఠాన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి ఓవర్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి రికార్డును సృష్టించాడు. 23 ఏళ్ల వయసులో పఠాన్‌ మూడు ఫార్మాట్లలో అద్భుతంగా రాణిస్తుండడంతో అతనికి జూనియర్ కపిల్ దేవ్ గా పేరు వచ్చింది. అయితే అతనిని  దురదృష్టం అనేది గ్రెగ్ చాపెల్ రూపంలో వెంటాడింది.

చాపెల్ టీమ్ ఇండియా కోచ్ గా మారిన తరువాత అతను పఠాన్‌ను బలవంతంగా ఆల్ రౌండర్‌గా మార్చే ప్రయత్నం చేశాడు. చాపెల్ పఠాన్ ను బౌలింగ్ కన్నా బ్యాటింగ్‌ పై ఎక్కువ దృష్టి ఉంచేలా  చేశాడు. దాంతో రెండింటిని సమానంగా కొనసాగించడంలో పఠాన్ తడబడ్డాడు. దాంతో జట్టులో స్థానం కోల్పోయాడు. 173 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నప్పటికి అతని కెరీర్ 27 సంవత్సరాల వయస్సులో ముగిసింది.
5 . దినేష్ కార్తీక్:

దినేష్ కార్తీక్ పేరు వినగానే  నిదాహాస్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో అతని బ్యాటింగ్‌ అందరికి గుర్తుకు వస్తుంది. కార్తీక్ దేశవాళీ క్రికెట్ లో అద్భుతంగా రాణించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అతను భారత క్రికెట్ జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఓపెనర్ గా మొదటి మ్యాచ్ ఆడటమే అతనికి శాపంగా మారింది.
అప్పటికే జట్టులో సౌరవ్ గంగూలీ, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ లాంటి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఉన్నారు. దాంతో కార్తీక్ ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇక ధోనీ ఉండడం వల్ల అతను వికెట్ కీపర్‌గాను రెండవ స్థానంలో ఉండేవాడు. ఎంతో ప్రతిభ ఉన్నా దినేష్ కార్తీక్ భారత అత్యంత దురదృష్టకర క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు.

Also Read: “ఫాఫ్ డూప్లెసిస్”… సౌత్ ఆఫ్రికా వాడు అయ్యుండి “అరబిక్” టాటూ ఎందుకు వేయించుకున్నాడో తెలుసా? వెనుక ఉన్న కథ ఇదే.!


End of Article

You may also like