సౌత్ ఆఫ్రికా టీం లో “డేవిడ్ మిల్లర్” వెనక ఇంత కుట్ర జరిగిందా.? 2010 తర్వాత 2015 వరల్డ్ కప్ లో.?

సౌత్ ఆఫ్రికా టీం లో “డేవిడ్ మిల్లర్” వెనక ఇంత కుట్ర జరిగిందా.? 2010 తర్వాత 2015 వరల్డ్ కప్ లో.?

by Anudeep

Ads

డేవిడ్ మిల్లర్.. ఈ పేరు గురించి క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అసాధారణ ప్రతిభ గల ఆటగాడు. ‘కిల్లర్‌ మిల్లర్‌’గా గుర్తింపు పొందిన ఈ విధ్వంసకర బ్యాటర్‌.. తనదైన రోజున ఎంతటి విధ్వంసం సృష్టించగలడో అందరకి తెలుసు. ఐపీఎల్ లో అలాంటి మరుపురాని ఇన్నింగ్స్ లు ఎన్నో ఉన్నాయి.

Video Advertisement

ఒక్కసారి క్రీజులో కుదురుకున్నాడంటే.. ఆరోజు రాత్రి ప్రత్యర్థి జట్టు బౌలర్లకు కలలోకి వచ్చినట్లే. ఇటీవల గువహటి వేదికగా భారత్ తో జరిగిన మ్యాచ్.. అందుకు చక్కటి ఉదాహరణ. కళ్ల ముందు కొండంత లక్ష్యమున్నా.. ఏమాత్రం అదురు.. బెదురు లేకుండా బౌండరీల వర్షం కురిపించాడు. ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ ఐపీయల్ కప్పు కొట్టడం లో మిల్లర్ పాత్ర ప్రత్యేకమైనది.

david miller didn't get chance to play..??
మూడో స్థానం నుంచి ఏదో స్థానం వరకు ఎప్పుడైనా బాటింగ్ చేయగల సిద్ధహస్తుడు. మ్యాచ్ తీరునే తలకిందులు చేయగల ఆటగాడు మిల్లర్. అంతే కాకుండా బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయడం లో, క్యాచ్ లు పట్టడం లో మిల్లర్ ఎక్సపర్ట్.

david miller didn't get chance to play..??
ఐపీయల్ తో పాటు ప్రపంచం లో జరిగే అన్ని ప్రైవేట్ లీగ్స్ కి మిల్లర్ ఆడుతూ ఉంటాడు. అందుకే ఒత్తిడి లో అతడు సంయమనం గా ఉండగలడు. ఇంతలా రాణిస్తున్నా.. అతడు సౌతాఫ్రికా జట్టులో నిత్యం అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నాడు అని స్వయంగా దక్షిణాఫ్రికా కు చెందిన అతని అభిమానులు వాపోతున్నారు.

david miller didn't get chance to play..??
మిల్లర్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో చాలాకాలం క్రితమే(2010లో) ఎంట్రీ ఇచ్చినప్పటికి మొదట్లో అవకాశాలు ఎక్కువగా రాలేదు.పరిమిత ఓవర్ల స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందిన అతను వెలుగులోకి రావడానికి ఐదేళ్లు పట్టింది. 2015 వన్డే వరల్డ్‌ కప్‌. ఆ వరల్డ్‌కప్‌లో సౌతాఫ్రికా సెమీఫైనల్‌కు చేరింది అంటే.. అది మిల్లర్‌ ఇన్నింగ్స్ ల వల్లే. ఆ టోర్నీలో మిల్లర్‌ 324 పరుగులు సాధించాడు. ఆ తర్వాత రెగ్యులర్‌ సభ్యుడిగా ప్రమోషన్‌ పొందినప్పటికీ జట్టులో అతని స్థానం మాత్రం సుస్థిరం కావట్లేదు.

david miller didn't get chance to play..??
మిల్లర్ ఎన్ని పరుగులు చేసినా.. ఎన్ని గొప్ప ఇన్నింగ్స్ లు ఆడినా సెలెక్టర్లు లెక్కలోకి తీసుకోవట్లేదు. ఎప్పుడు జట్టులో ఉంటాడో.. ఎప్పుడు పీకేస్తారో.. ఎవరు ఊహించలేకపొతున్నారు. అందుకు ఆ దేశ క్రికెట్ బోర్డులో జరిగే రాజకీయాలే.. ఒక కారణమట. కుళ్లు, కుతంత్రాలతో నిండిపోయిందట. ‘జాతి వివక్ష’ కారణంగా ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న సౌతాఫ్రికా బోర్డులో ఇలాంటివి నిత్యం జరుగుతుంటాయట.


End of Article

You may also like