టీకాలు లేనప్పుడు.. కాలర్ ట్యూన్లు మాత్రం ఎందుకు అంటూ ఇచ్చిపడేసిన హై కోర్ట్..!

టీకాలు లేనప్పుడు.. కాలర్ ట్యూన్లు మాత్రం ఎందుకు అంటూ ఇచ్చిపడేసిన హై కోర్ట్..!

by Anudeep

Ads

ప్రస్తుతం ప్రజలలో కరోనా వాక్సిన్ వేయించుకోవాలన్న అవేర్ నెస్ పెరిగింది. అయితే.. వాక్సిన్ వేయించుకోవాలనుకుంటున్న వారు కూడా ఎక్కువయ్యారు. కానీ, వాక్సిన్ లే అందుబాటులో లేవు. కానీ.. కాలర్ ట్యూన్ లో మాత్రం కరోనా వాక్సిన్ వేయించుకోండి అని వినిపిస్తూనే ఉంది. ఈ క్రమం లో ప్రభుత్వం పై ఢిల్లీ హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీకాలు లేనప్పుడు.. ఈ కాలర్ ట్యూన్ మాత్రం ఎందుకు అంటూ హై కోర్ట్ ప్రశ్నించింది.

Video Advertisement

delhi high court

ఎవరికైనా ఫోన్ చేసినప్పుడల్లా.. ఈ కాలర్ ట్యూన్ వస్తుందని.. ఇది జనాల సహనానికి పరీక్షేనని పేర్కొంది. అయినా.. అవేర్ నెస్ పెంచే విషయం లో ప్రభుత్వం కొంత సృజనాత్మకతకు పని చెప్పాలని పేర్కొంది. వాక్సిన్ అందరికి అందాలని.. కనీసం డబ్బు తీసుకుని అయినా వాక్సిన్ ను అందించే ప్రయత్నాలు చేయాలనీ పేర్కొంది. అలాగే.. కాలర్ ట్యూన్ విషయం లో కూడా.. కేవలం ఒకటే ట్యూన్ కాకుండా మార్చి మార్చి కొత్త సందేశాలను అందివ్వాలని హితవు చెప్పింది. ఈ విషయం లో ఏ నిర్ణయం తీసుకున్నారో.. మే 18 లోపు నివేదిక ఇవ్వాలని కోరింది.


End of Article

You may also like