స్టార్ మా లో ప్రసారమయ్యే కార్తీక దీపం సీరియల్ గురించి కొత్తగా చెప్పేదేమీ లేదు. సీరియల్స్ లో సూపర్ హిట్ అది. దాని రికార్డులు ఇప్పటి వరకు వేరే ఏ సీరియల్ కి లేవు. క్రికెట్ మ్యాచ్ ల నుంచి స్టార్ హీరోల సినిమాల వరకు అన్ని ఈ సీరియల్ ముందు తేలిపోయాయి. ఈ సీరియల్స్ లో నటులకి ఉన్నంత క్రేజ్ సినిమా హీరోలకి కూడా లేదు.

Video Advertisement

 

ఈ సీరియల్ లో వంటలక్క అయిన ప్రేమీ విశ్వనాధ్, డాక్టర్ బాబు అయిన నిరుపమ్, సౌందర్య అయిన అర్చన అనంత్ ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాగే ఈ సీరియల్ లో నెగటివ్ పాత్రలో నటించిన మోనిత కి కూడా ఫాన్స్ ఎక్కువ మందే ఉన్నారు. ఈ సీరియల్ లో గతం లో ఒకసారి డాక్టర్ బాబు, వంటలక్క, మోనిత పాత్రలను తప్పించి సీరియల్ ను నడిపించారు.

did monitha charecter end in karthika deepam..

అయితే ఈ సీరియల్ లో గతం లో శౌర్య, హిమ పాత్రలను పెద్దవారిగా చూపించి కొన్నాళ్ళు సీరియల్ ను నడిపించారు. కానీ ప్రేక్షకులకు సీరియల్ నచ్చకపోవడం, టీఆర్పీ రేటింగ్స్ చతికిల పడటం తో మళ్ళీ అందర్నీ బతికించి చూపించారు. కానీ ఇప్పుడు కూడా మళ్ళీ మేకర్స్ అదే తప్పు చేయబోతున్నట్లు తెలుస్తోంది. మోనిత (శోభా శెట్టి) తన యూట్యూబ్ ఛానెల్ లో తాజాగా ఒక వీడియో ని పెట్టింది. అందులో ఇక కార్తీక దీపం తన పాత్ర ముగిసిందంటూ చెప్పుకొచ్చింది.

did monitha charecter end in karthika deepam..

” కార్తీక దీపం సీరియల్ లో నా పాత్ర ను జైలుకి పంపారు. ఇక శాశ్వతం గా ఆ పాత్రను ముగించారు. ఒకరోజు డైరెక్షన్ టీం ఫోన్ చేసి ఇక మోనిత పాత్ర ఉండదని చెప్పారు. నేను మొదట నమ్మలేదు కానీ ఛానల్ వాళ్లు కూడా ఫోన్ చేసరికి ఎంతో బాధపడ్డాను. ఇక ఈ సీరియల్ లో కార్తిక్, దీప పాత్రలు ఉంటాయి కానీ నా పాత్ర ఉండదు.” అని చెబుతూ ఎమోషనల్ అయింది శోభా శెట్టి.

did monitha charecter end in karthika deepam..

ఈ వీడియో తో కార్తీక దీపం సీరియల్ కు వెన్నుముక లాంటి మోనిత ఇక ఆ సీరియల్ ఉందని తెలుసుకున్న అభిమానులు ఎంతో బాధపడుతున్నారు. అసలు మోనిత లేకపోతే ఈ సీరియల్ లేదని, ఇంత హిట్ కూడా అయ్యేది కాదని మోనిత అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.