2008 లో జీ తెలుగులో ‘మై నేమ్ ఈజ్ మంగతాయారు’ అనే డైలీ సీరియల్‌ ప్రసారమయ్యేది. దీని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ సీరియల్ అప్పట్లో బుల్లితెరపై పెద్ద హిట్ అని చెప్పొచ్చు. దీని కి ఉన్న ఆదరణ దృష్ట్యా జీ తెలుగులో ఈ సీరియల్ ని రెండు సార్లు ప్రసారం చేసారు. సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే తెలుగు కామెడీ సీరియల్ ఇది.

Video Advertisement

ఈ సీరియల్ లో శ్రీదేవి కజిన్ సిస్టర్ , తెలుగులో ఒక నాటి స్టార్ హీరోయిన్ అయిన మహేశ్వరి ప్రధాన పాత్రలో నటించగా.. ఆమెకు జంటగా బుల్లితెర నటుడు శ్రీధర్ వర్మ నటించారు. ఈ సీరియల్ సూర్ హిట్ కావడం తో దీన్ని తమిళం లో కూడా రీమేక్ చేసారు. మహేశ్వరి తెలుగు మరియు తమిళం రెండింటిలోనూ మంగతాయారు పాత్రను పోషించింది. అక్కడ కూడా ఈ సీరియల్ హిట్ అయ్యింది. మంగతాయారు తమిళ వెర్షన్‌కి ఎస్‌ఎన్‌.శక్తివేల్‌ దర్శకత్వం వహించారు.

Did you remember this actor from My name is mangatayaru serial..!!

అయితే ఈ సీరియల్ లో నటించిన శ్రీధర్ వర్మ చాలా సీరియల్స్ లో నటించారు. తమిళనాడు లో పుట్టిన ఈయన కళాశాల రోజుల నుంచి నాటకాల్లో నటించేవారు. ఆ తర్వాత తెలుగు, తమిళ సీరియల్స్ లో పాటు పలు సినిమాల్లో నటించారు శ్రీధర్. అయితే ఈయన తెరపై కనిపించి చాలా కాలం అయ్యింది.

Did you remember this actor from My name is mangatayaru serial..!!

ప్రస్తుతం శ్రీధర్ నటనకు దూరం అయ్యారు కానీ పలు చిన్న చిత్రాలకు మేకర్ గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే శ్రీధర్ నిత్యం తన పర్సనల్ ఫొటోలతో పాటు, వర్క్ కి సంబంధించిన చిత్రాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు.

Did you remember this actor from My name is mangatayaru serial..!!

ఈయన ప్రస్తుతం ఛాంగురే బంగారు రాజా, రవికుల రఘు రామ, తస్మదీయులు వంటి చిత్రాలకు ప్రొడక్షన్ చేస్తున్నారు. అంతే కాకుండా పలు డబ్బింగ్ చిత్రాలకు కూడా ఈయన మేకర్ గా పని చేస్తున్నారు.