కింగ్ కోహ్లీ ఫామ్ పై కామెంట్స్ చేసిన దినేష్ కార్తీక్.. ఏమన్నాడంటే..!?

కింగ్ కోహ్లీ ఫామ్ పై కామెంట్స్ చేసిన దినేష్ కార్తీక్.. ఏమన్నాడంటే..!?

by Anudeep

Ads

టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత కొంత కాలంగా ఫామ్ కోల్పోయి పరుగులు చేయడానికి నానా తంటాలు పడుతున్నారు. మొన్న ఐపీఎల్, తాజాగా ఇంగ్లాండ్ టూర్ లోనూ కింగ్ కోహ్లీ ఘోరంగా విఫలమయ్యాడు. ఒకప్పుడు మిచెల్ జాన్సన్, జేమ్స్ అండర్సన్, బ్రెట్ లీ, స్టెయిన్, బౌల్ట్, స్టార్క్ లాంటి ప్రపంచ మేటి బౌలర్లను ఉతికారేసిన కోహ్లీ.. ఇప్పుడు అనామక బౌలర్లకు కూడా ఈజీ గా దొరికిపోతున్నాడు.

Video Advertisement

దీంతో కోహ్లీపై వేటు వేయాల్సిందే అంటూ కపిల్ దేవ్ నుంచి ఇతర మాజీ ప్లేయర్లు కూడా గగ్గోలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా టీమిండియా ప్లేయర్ దినేశ్ కార్తీక్ కోహ్లీ ఫామ్ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ ఫామ్ గురించి కార్తీక్ మాట్లాడాడు. కోహ్లీ టీమిండియాకు అద్భుత విజయాలను అందించాడు.

వెస్టిండీస్ టూర్ నుంచి అతడికి విశ్రాంతి కల్పించడం వల్ల కోహ్లీకి విరామం దొరికింది. మళ్లీ ఫుల్ గా రీచార్జ్ అయ్యి వస్తాడు అని కార్తీక్ పేర్కొన్నాడు. కోహ్లీ లాంటి చాంపియన్ ప్లేయర్ ను తొలగించాలని ఏ జట్టు కూడా అనుకోదు. అతడు ఫామ్ లోకి రావడానికి ఎన్నో రోజులు పట్టదు. టీమిండియా తరఫున మళ్లీ అతడు అద్భుతంగా ఆడే రోజులు వస్తాయని కార్తీక్ విశ్వాసం వ్యక్తం చేశాడు. కార్తీక్ తో పాటు పాకిస్థాన్ ప్లేయర్స్ కూడా కోహ్లీకి అనుకూలంగా మాట్లాడిన విషయం తెలిసిందే.

కెరీర్ ముగిసిపోయిందన్న తరుణంలో కార్తీక్ టీమిండియాలోకి పునరాగనం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో అద్భుతంగా ఆడిన కార్తీక్.. అనంతరం భారత జట్టులోకి ఎంపికయ్యాడు. త్వరలో విండీస్ ఆరంభమయ్యే టీ20 సిరీస్ లో కూడా ఆడనున్నాడు. టీం ఇండియాకు ఎంపికవ్వడం అంత సులభమైన విషయం కాదని కార్తీక్ పేర్కొన్నాడు. అందుకోసం చాలా కష్టపడ్డట్లు తెలిపాడు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మల మార్గ నిర్దేశంలో తాము టీ20 ప్రపంచకప్ కోసం సన్నద్ధమవుతున్నట్లు కార్తీక్ పేర్కొన్నాడు.


End of Article

You may also like