ఈ 4 వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు దానం గా ఇవ్వకూడదట.. ఎందుకంటే?

ఈ 4 వస్తువులను పొరపాటున కూడా ఇతరులకు దానం గా ఇవ్వకూడదట.. ఎందుకంటే?

by Anudeep

Ads

దానం అనేది మానవత్వానికి ప్రతీక. అవసరం లో ఉన్నవారిని ఆదుకోవడం మనిషి కనీస ధర్మం. అయితే.. కొన్ని దానాలకు దోషాలను పోగొట్టే శక్తీ ఉంటుంది. శాస్త్రోక్తం గా పురోహితుల మంత్రోచ్ఛారణ సమక్షం లో దానాలను చేసి తమ దోషాలను పోగొట్టుకోవడానికి కొందరు రకరకాల దానాలు చేస్తుంటారు. అయితే.. ఓ నాలుగు వస్తువులను మాత్రం శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా దానం ఇవ్వకూడదట. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

1. ఉప్పు:

salt
ఉప్పు గురించి హిందూ ధర్మం లో చాలా వివరణే ఉంది. నేరు గా చేతి కి కూడా ఇవ్వకూడదని, రాత్రి వేళలలో ఉప్పు అని పలకకూడదని అంటుంటారు. ఇదంతా ఎందుకంటే.. ఉప్పు లక్ష్మి దేవి స్వరూపం కాబట్టి. అందుకే నేలపై పడితే తొక్కకూడదంటారు. కింద పారపోయకుండా మొక్కల్లో వేయడమో.. లేక నీటిలో కరిగించి పారబోయమనో చెబుతుంటారు. ఉప్పుని పొరపాటున కూడా ఉచితం గా తీసుకోకూడదని.. తీసుకుంటే అప్పులపాలు అవుతారని చెబుతుంటారు.

2. నువ్వులు:

black cumin

ఇక నల్ల నువ్వులను కూడా ఉచితం గా తీసుకోకూడదట. నల్ల నువ్వులను ఉచితం గా తీసుకోవడం వలన శని ప్రభావం మనపై పడుతుందని.. చాలా మంది తీసుకోవడానికి విముఖత చూపిస్తారు.

3. ఇనుము:

iron
ఇక ఇనుము లేదా ఇనుము తో తయారు వస్తువులను కూడా దానం గా తీసుకోకూడదు. ఒకవేళ ఏమైనా తీసుకోవాల్సి వచ్చినా.. దానికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలి. ఇనుము కూడా శని కి చిహ్నమట. అందుకే.. శనివారం పూట ఇనుమును తెచ్చుకోకూడదని అంటారు. అలాగే.. సూదిని, చేతిరుమాలుని కూడా ఇతరులకు ఉచితం గా ఇవ్వకూడదని.. ఇస్తే అనారోగ్యం తప్పదని చెబుతుంటారు.

4. నూనె:

oil
నూనెను కూడా చేతికి ఇవ్వకూడదని చెబుతారు. వంటకు వాడే నూనెను ఎవరి వద్ద నుంచి అయినా ఉచితం గా తీసుకోకూడదట. ఒకవేళ తీసుకోవాల్సిన అవసరం వచ్చినా.. వారికి ఎంతో కొంత డబ్బు చెల్లించి తీసుకోవాలట.


End of Article

You may also like