టి20 వరల్డ్ కప్ కి డిజైన్ చేసిన ఇండియా టీమ్ కొత్త జెర్సీ లో ఇది గమనించారా?

టి20 వరల్డ్ కప్ కి డిజైన్ చేసిన ఇండియా టీమ్ కొత్త జెర్సీ లో ఇది గమనించారా?

by Anudeep

Ads

ఐపీఎల్ హడావిడి ముగిసింది అనుకునేలోపు వరల్డ్ కప్ సందడి మొదలైంది. నిన్న బంగ్లాదేశ్, స్కాట్లాండ్ ల మధ్య తొలి టి20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. కొన్ని రోజుల క్రితం ఐసీసీ క్రీడోత్సవం సందర్భంగా బీసీసీఐ టీమ్ ఇండియా ఆటగాళ్లు వరల్డ్ కప్ మ్యాచ్ కి ధరించే కొత్త జెర్సీలను విడుదల చేసింది. విడుదల అయిన కొద్దీ సేపటికే ఈ ఫోటోలు సోషల్ మీడియా లో హల్ చల్ చేసాయి. బుమ్రా, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్ లు ఈ ఫోటోలలో కొత్త జెర్సీలు ధరించి కనిపించారు.

Video Advertisement

india jersey

భారత జట్టు ఆటగాళ్లు ఈ కొత్త జెర్సీలు ధరించి ఉన్న ఫోటోలు విడుదల అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. గతంలో ఉండే జెర్సీలు బాగా డార్క్ బ్లూ కలర్ లో ఉండేవి. కొత్తగా డిజైన్ చేసిన ఈ జెర్సీలు థిక్ బ్లూ కలర్ లో ఉన్నాయి. జరగబోయే వరల్డ్ కప్ మ్యాచ్ లలో టీమ్ ఇండియా ఈ కొత్త జెర్సీలనే ధరించనుంది. ఈ జెర్సీల గురించి గతంలో కూడా చాలానే వార్తలు వచ్చాయి. అభిమానుల బిలియన్ చీర్స్ ప్రేరణతో.. అందుకు అనుగుణంగా ఈ జెర్సీ ని డిజైన్ చేసినట్లు బీసీసీఐ పేర్కొంది.

india jersey 2

ఈ జెర్సీలపై ఉన్న సౌండ్ వేవ్ డిజైన్ గమనించారా? నిజానికి అది డిజైన్ మాత్రమే కాదట. ఆ సౌండ్ వేవ్ అనేది చీర్స్ ప్యాట్రన్. అభిమానులు మ్యాచ్ జరుగుతున్న సమయం లో “ఇండియా… ఇండియా…” అంటూ ఉత్సాహంతో అరుస్తూ ఉంటారు. ఈ సౌండ్ వేవ్ ను రికార్డు చేస్తే వచ్చిన ప్యాట్రన్ ను జెర్సీ పై ముద్రించారు. ఈ విషయం బయటకు వెల్లడయ్యాక క్రికెట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఇది ఓ వినూత్నమైన ఆలోచన అంటూ క్రికెట్ అభిమానులు బీసీసీఐకి కితాబిస్తున్నారు.

 


End of Article

You may also like