ఈ 5 పనులను ఎక్కువ సేపు చేస్తున్నారా..? అయితే అవి మరణానికి దారి తీస్తాయి.. వెంటనే జాగ్రత్త పడండి..!

ఈ 5 పనులను ఎక్కువ సేపు చేస్తున్నారా..? అయితే అవి మరణానికి దారి తీస్తాయి.. వెంటనే జాగ్రత్త పడండి..!

by Anudeep

Ads

భారతీయ సనాతన ధర్మం భారతీయులకు ఎన్నో మంచి గ్రంధాలను అందించింది. పురాణాలే కావచ్చు, ఇతిహాసాలే కావచ్చు.. మనిషి జీవన విధానాలు ఎలా ఉండాలి..? అన్న విషయమై ఈ గ్రంధాలు ఎంతో గొప్పగా మార్గదర్శకం చేసాయి. అటువంటి పురాణాలలో విష్ణు పురాణం కూడా ఒకటి. శ్రీ మహా విష్ణువు అవతారాలు, శక్తీ మహాత్యాల గురించి వివరించే విష్ణు పురాణంలో మనిషి జీవన విధానం గురించి ఓ విషయం స్పష్టంగా వివరించబడింది. “అతి సర్వత్ర వ్యర్జయేత్” అని మన పెద్దలు ఎప్పటినుంచో చెప్తూనే ఉన్నారు.

Video Advertisement

ఎంత పని అయినా.. ఎలాంటి చోట అయినా.. అతిగా ప్రవర్తించడం మంచిది కాదు. ప్రతి పని లోనూ అతిని తగ్గించుకోవాలి. అయితే.. విష్ణు పురాణం ప్రకారం ముఖ్యంగా ఈ ఆరు పనులను ఎక్కువగా చేస్తుంటే.. అవి కచ్చితంగా అనారోగ్య సమస్యలను తీసుకొస్తాయట. దాని వలన కొన్నిసార్లు మరణం వరకు వెళ్లే ప్రమాదం ఉంటుందట. అవేంటో తెలుసుకుని.. అటువంటి పనుల్లో అతిని తగ్గించుకోండి.

vishnupuranam 1

#1 స్నానం: మానవ జీవితంలో స్నానం ముఖ్య పాత్ర పోషిస్తుంది. ప్రతి మనిషికి స్నానం చేయడం అవసరమే. కానీ.. ఇది పరిమితిని మించకూడదు. అవసరమైన సమయం కంటే.. ఎక్కువ సేపు స్నానం చేయడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొంత సమయం వరకే స్నానం కోసం కేటాయించుకోవాలి.

vishnupuranam 2

#2 నిద్ర: ఇక రెండవది నిద్ర. నిద్ర మనిషికి ఎంత అవసరమో చెప్పక్కర్లేదు. నిద్ర ఎక్కువైనా, తక్కువైనా ఇబ్బందులు తప్పవు. అందుకే అతి నిద్రను మానుకోవాలి.. అలా అని అసలు నిద్ర పోకుండా పనులు చేసుకోవడం కూడా మంచిది కాదు. కనీసం 6 నుంచి 7 గంటలు హాయిగా నిద్రపోవాలి.

vishnupuranam 3

#3 రాత్రి వేళల్లో రహదారుల్లో తిరగడం: రోడ్లు ఖాళీగానే ఉంటాయి కదా అన్న ఉద్దేశ్యంతో చాలా మంది రాత్రి వేళల్లో రహదారుల్లో తిరుగుతూ ఉంటారు. ఇది కూడా అంత మంచిది కాదు. ఎటువైపు నుంచి ఏ పరిస్థితి వస్తుందో ఎవ్వరికీ తెలియదు. చీకటిలో పరిస్థితిని మనం గమనించే లోపే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావచ్చు. అందుకే రాత్రి వేళల్లో రహదారుల్లో సంచారం చేయడం మంచిది కాదు.

vishnupuranam 4

#4 స్మశానం లో తిరగడం: స్మశానం లో కూడా ఎక్కువ సేపు ఉండడం మంచిది కాదు. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఎక్కువగా నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. అక్కడ ఉండే గాలి కూడా స్వచ్ఛమైనది కాదు. అక్కడ ఎక్కువ సేపు ఉండడం వలన శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. అక్కడి గాలి ఎక్కువసేపు పీల్చడం వలన ఊపిరితిత్తులలో ఇబ్బంది కూడా ఎదురవుతుంది.

vishnupuranam 5

#5 నెగటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండడం: మనం మన చుట్టూ ఉండే వ్యక్తుల వలన ప్రభావితం అవుతూ ఉంటాము. మన చుట్టూ ఉండే వ్యక్తులు నెగటివ్ ఎనర్జీ ఉన్న వారు అయితే వారి వలన మనం కూడా నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటాము. అందుకే.. నెగటివ్ గా ఉండే వ్యక్తుల వద్ద ఎక్కువ సేపు ఉండకూడదు. వారికి దూరంగా ఉండడమే మంచిది.


End of Article

You may also like