ఓ గొప్ప క్రికెటర్ పెద్ద చదువులు చదవాలని లేదు. అలాగని గొప్ప గొప్ప చదువులు చదివిన వారు క్రికెటర్ కాకూడదనీ లేదు. ఇండియన్ క్రికెట్‌లో టాప్ ప్లేయర్స్‌గా ఉన్న కొందరిని చూస్తే మనకు అనిపించేది ఇదే. మరి టీమిండియా టెస్ట్ విరాట్ కోహ్లి నుంచి క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వరకూ ఏ క్రికెటర్ ఎడ్యుకేషన్ క్వాలిఫకేషన్ ఏంటి? ఎవరు స్కూలు చదువుతోనే ఆపేశారు? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
Video Advertisement
#1 సచిన్ టెండూల్కర్
16 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన మాస్టర్ బ్లాస్టర్.. చిన్నప్పటి నుంచీ తన దృష్టినంతా క్రికెట్‌పైనే పెట్టాడు. దీంతో కనీసం హైస్కూల్ పూర్తి చేసే చాన్స్ కూడా దక్కలేదు. ముంబైలోని శారదాశ్రమ్ విద్యామందిర్‌లో పది వరకూ చదివాడు.
#2 విరాట్ కోహ్లి – ఇంటర్
ఓ బ్యాట్స్‌మన్‌గా సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ స్థాయి క్రేజ్ ఉన్నది టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లికే. కెప్టెన్‌గా కూడా టీమిండియాకు ఎన్నో విజయాలు సాధించిపెట్టాడు. అలాంటి కోహ్లి చదివింది మాత్రం 12వ తరగతే.
#3 ధోనీ – బీకామ్
టీమిండియా మోస్ట్ సక్సెస్‌ఫుల్ కెప్టెన్లలో ఒకడు ఎమ్మెస్ ధోనీ. రాంచీలోని క్రైస్ట్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ చేస్తున్నప్పుడే క్రికెట్ కోసం చదువును మధ్యలో వదిలేశాడు. ఆ తర్వాత డిస్టెన్స్‌లో డిగ్రీ పూర్తి చేసాడు ధోని.
#4 రోహిత్ శర్మ – ఇంటర్
టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ కూడా చదువును పెద్దగా పట్టించుకోలేదు. స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ స్కూల్‌లో 12వ తరగతి వరకూ చదివాడు.
#5 హార్దిక్ పాండ్యా – 8 వ తరగతి
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా అందరికన్నా తక్కువ చదువుకున్న ప్లేయర్. అతడు కేవలం 8వ తరగతి వరకే చదువుకోడం విశేషం. 9లో ఫెయిలైన హార్దిక్.. ఇక పూర్తిగా క్రికెట్ వైపు మళ్లాడు.
#6 కపిల్ దేవ్ – ఇంటర్
టీమిండియాను తొలిసారి విశ్వవిజేతగా నిలిపిన గ్రేట్ ఆల్‌రౌండర్ కపిల్ దేవ్ 12 వ తరగతి వరకే చదివారు. డీఏవీ స్కూల్లో తన చదువు పూర్తి చేసిన తర్వాత 1978లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
#7 వీవీఎస్ లక్ష్మణ్ – ఎంబీబీస్
హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్.. క్రికెట్‌ను పూర్తిస్థాయి కెరీర్‌గా ఎంచుకునే ముందు ఎంబీబీఎస్‌లో చేరాడు. అయితే క్రికెట్ కోసం దానిని మధ్యలోనే వదిలేశాడు. 2015లో లక్ష్మణ్‌ను న్యూఢిల్లీలోని తెరి యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది.
#8 రాహుల్ ద్రవిడ్ – ఎంబీఏ
ప్రస్తుత టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎంబీఏ చేసారు. అంతకుముందు బెంగళూరులోని సెయింట్ జోసెఫ్స్ కాలేజీ నుంచి బీకామ్ చదివాడు.
#9 అనిల్ కుంబ్లే – ఇంజనీరింగ్
టీమిండియా స్పిన్నర్లలో టాప్ ప్లేస్‌లో నిలిచే అనిల్ కుంబ్లే ఇండియన్ క్రికెట్ టీమ్‌లోకి రాకముందు రాష్ట్రీయ విద్యాలయ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
#10 మురళీ విజయ్ – పీజీ
టీమిండియాలో మంచి ఓపెనర్‌గా పేరుగాంచిన మురళీ విజయ్ ఎకనమిక్స్‌లో పీజీ చేశాడు. నిజానికి 17 ఏళ్ల వయసులో బోర్డు పరీక్షల్లో ఫెయిలైన తర్వాత ఇంటి నుంచి పారిపోయిన విజయ్.. తర్వాత క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. ఆ తర్వాత కూడా చదువుపై శ్రద్ధ పెట్టిన విజయ్.. పీజీ డిగ్రీ అందుకున్నాడు.
#11 అశ్విన్ – బీటెక్
భారత్‌లో అత్యంత విజయవంతమైన స్పిన్నర్లలో ఒకరైన అశ్విన్ ఉన్నత చదువులు చదివాడు. చెన్నైలోని ఎస్ఎస్ఎన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నుండి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బిటెక్ డిగ్రీ పొందారు.
#12 కేఎల్ రాహుల్ – డిగ్రీ
స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ డిగ్రీ పూర్తిచేశారు.
#13 అజింక్య రహానే – డిగ్రీ
సీనియర్ బ్యాటర్ అజింక్య రహానే కు డిగ్రీ పట్టా ఉంది. రిజ్వి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో డిగ్రీ పూర్తిచేశారు.
#14 ఛతేశ్వర్ పుజారా – బీబీఏ
ఛతేశ్వర్ పుజారా కరస్పాండెన్స్ ద్వారా బీబీఏ పూర్తి చేశారు.
#15 జస్ప్రీత్ బుమ్రా – ఇంటర్
ఈ ఇండియా టీం ఫాస్ట్ బౌలర్ అహ్మదాబాద్ లోని నిర్మల హై స్కూల్ లో 12 వ తరగతి పూర్తి చేసాడు.
#16 సూర్య కుమార్ యాదవ్ – బీకామ్
ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్న సూర్య కుమార్ యాదవ్ పిళ్ళై కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుంచి బీకామ్ పూర్తి చేసాడు.
#17 రిషబ్ పంత్ – బీకామ్
ఈ వికెట్ కీపర్ బ్యాటర్ డెహ్రాడూన్ లోని ఇండియన్ పబ్లిక్ స్కూల్ లో స్కూలింగ్ పూర్తి చేసాడు. ఆ తర్వాత బీకామ్ చదివారు.
#18 ఇషాన్ కిషన్ – బీకామ్
ఇషాన్ కిషన్ పాట్నా కాలేజీ ఆఫ్ కామర్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసాడు.
#19 శార్దూల్ ఠాకూర్ – డిగ్రీ
ఈ టీం ఇండియన్ అల్ రౌండర్ ముంబై యూనివర్సిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసారు.
#20 యుజ్వేంద్ర చాహల్
చాహల్ హర్యానా లోని మహాత్మా గాంధీ కాలేజీ ఆఫ్ హెల్త్ సైన్స్ నుంచి డిగ్రీ పూర్తి చేసాడు. అలాగే చాహల్ ఇండియా నుంచి వరల్డ్ యూత్ చెస్ ఛాంపియన్ షిప్ లో పాల్గొన్నాడు.