సౌరవ్ గంగూలీ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఈ 14 స్టార్ క్రికెటర్లు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా..? ఓ లుక్ వేయండి..

సౌరవ్ గంగూలీ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఈ 14 స్టార్ క్రికెటర్లు ఎంత వరకు చదువుకున్నారో తెలుసా..? ఓ లుక్ వేయండి..

by Anudeep

Ads

ప్రపంచం మొత్తంలో ఎక్కువ క్రేజ్ ఉండేది రెండింటికి మాత్రమే. ఒకటి సినిమాలు అయితే ఇంకొకటి క్రికెట్. రెండిట్లో దేనికి ఎక్కువ మంది అభిమానులు ఉన్నారో చెప్పడం కష్టం. ఎంటర్టైన్మెంట్ లో రెండిటికీ అంత పోటీ ఉంటుంది.

Video Advertisement

ఇంకా క్రికెట్ గురించి వేరే చెప్పాల్సిన అవసరం లేదు.ఒకరోజు ఏదైనా మ్యాచ్ ఉంది ఉంటే క్రికెట్ అభిమానులు మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు నుండే ఎవరు గెలుస్తారు అనే టెన్షన్ లో ఉంటారు.

cricketers

వారి చదువు, ఉద్యోగ రీత్యా ఉండే పనులు అన్నిటినీ మర్చిపోయి క్రికెట్ పైనే ఫోకస్ చేస్తారు. మరి.. స్టార్ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న వీరు ఎంత వరకు చదువుకున్నారు ? అనే విషయాన్నీ మీరెప్పుడైనా ఆలోచించారా..? ఇప్పుడు మన ఇండియా తరపున ఆడే స్టార్ క్రికెటర్ల ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటో తెల్సుకుందాం.

# 1. సౌరవ్ గంగూలీ:


ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా కొనసాగుతున్న గంగూలీ డిగ్రీని పూర్తి చేసారు. ఆయన సెయింట్ జేవియర్స్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ అందుకున్నారు.

# 2. సచిన్:


మనం గాడ్ ఆఫ్ క్రికెట్ గా పిలుచుకునే సచిన్ టెన్త్ ఫెయిల్ అయ్యారు తెలుసా..? అంటూ మనం డైలాగ్స్ కొడతాం. కానీ, సచిన్ ఇంటర్ వరకు చదువుకున్నారు.

# 3. ధోని:


కెప్టెన్ కూల్ గా పిలుచుకునే ధోని కూడా డిగ్రీ చదువుని పూర్తి చేసారు.

# 4. విరాట్ కోహ్లీ:


టీం ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా 12 th గ్రేడ్ వరకు చదువుకున్నారు.

# 5. రోహిత్ శర్మ:


రోహిత్ శర్మ కూడా 12 th గ్రేడ్ వరకు చదువుకున్నారు.

# 6. అనిల్ కుంబ్లే:


అనిల్ కుంబ్లే చాలా డిఫరెంట్ ఫీల్డ్ నుంచి క్రికెట్ వైపు వచ్చారు. ఈయన మెకానికల్ ఇంజనీరింగ్ ను పూర్తి చేసారు.

# 7. యువరాజ్ సింగ్:


భారత మాజీ బౌలర్, పంజాబీ సినీ నటుడు అయిన యోగ్‌రాజ్ సింగ్ కుమారుడు యువరాజ్ సింగ్ 12 th గ్రేడ్ వరకు చదువుకున్నారు.

# 8. వీరేందర్ సెహ్వాగ్:


వీరేందర్ సెహ్వాగ్ న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టాని అందుకున్నారు.

# 9. రిషబ్ పంత్:


రిషబ్ పంత్ డిగ్రీ వరకు చదువుకున్నారు. ఆయన బీకామ్ పూర్తి చేసారు.

# 10. రాహుల్ ద్రావిడ్:


రాహుల్ ద్రావిడ్ కామర్స్ లో డిగ్రీ పట్టాని అందుకున్నారు.

# 11. కె ఎల్ రాహుల్:


కె ఎల్ రాహుల్ కూడా కామర్స్ లోనే బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు.

# 12. రవి చంద్రన్ అశ్విన్:


ఆటగాడు అశ్విన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ అందుకున్నారు.

# 13. రహానే:


అజింక్య రహానే కామర్స్ లోనే బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు.

# 14. హార్దిక్ పాండ్య:


హార్దిక్ పాండ్య తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నారు.

 

 


End of Article

You may also like