జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత కోట్ల వర్షం.. ఆడకుండానే 2 సార్లు ‘విజేత’ గా నిలిచిన ప్లేయర్..!

జైలుకి వెళ్లి వచ్చిన తర్వాత కోట్ల వర్షం.. ఆడకుండానే 2 సార్లు ‘విజేత’ గా నిలిచిన ప్లేయర్..!

by kavitha

Ads

బెన్ స్టోక్స్, ఇంగ్లండ్‌ ఆల్ రౌండర్.  ఆయన పేరు వింటే బౌలర్లకు భయం కలుగుతుంది. బెన్ స్టోక్స్ ఆడుతున్నాడు అంటే అభిమానులు ఎలాంటి పరిస్థితుల్లో అయినా మ్యాచ్  గెలుస్తామనే నమ్మకంతో ఉంటారు. దానికి ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి.

Video Advertisement

వరల్డ్ కప్ 2019 ఫైనల్ కానీ,  టీ20 వరల్డ్ కప్ 2022 ఫైనల్ లేదా 2019 లో యాషెస్ సిరీస్‌ మూడవ టెస్టు మ్యాచ్.  ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నోసార్లు బెన్ స్టోక్స్ ఒంటిచేత్తో ఇంగ్లండ్‌ను గెలిపించాడు. ఇక 2019 ప్రపంచకప్ ఫైనల్‌లో బెన్ స్టోక్స్ 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని బౌండరీల వల్లే ఇంగ్లండ్‌ మొదటి టైటిల్‌ను సాధించింది.
గత సంవత్సరంలోనూ టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్లో బెన్ స్టోక్స్ 52 పరుగులు చేసి, ఇంగ్లండ్‌ను విజేతగా నిలిపాడు.  32 ఏళ్ల ఈ ప్లేయర్ విలువ గత సంవత్సరాల నుండి బారీగా పెరిగింది. 2017లో నైట్‌క్లబ్ కి వెళ్ళిన స్టోక్స్ గోడవ పడినందుకు అరెస్ట్ అయ్యాడు.  జైలుకు కూడా వెళ్ళాడు. అయినప్పటికీ బెన్ స్టోక్స్ కి ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు.
ఇదిలా ఉంటే బెన్ స్టోక్స్ ఐపీఎల్‌లో మంచి డిమాండ్ ఉంది. 2018 లో జరిగిన ఐపీఎల్‌ లో అత్యంత కాస్ట్లీ ప్లేయర్ గా నిలిచాడు. రాజస్థాన్ రాయల్స్ రూ.12.50 కోట్లకు బెన్ స్టోక్స్ ను కొనుగోలు చేసింది. తాజాగా ముగిసిన 2023 ఐపీఎల్ లో  చెన్నై జట్టు రూ. 16.25 కోట్లకు బెన్ స్టోక్స్ కొనుగోలు చేసింది. అయితే స్టోక్స్ చెన్నై జట్టు తరుపున రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. లీగ్ స్టేజ్ తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఫైనల్స్ లో చెన్నై విజేతగా నిలిచింది.
అంతే కాకుండా జూన్ 3న బెన్ స్టోక్స్ టెస్ట్ క్రికెట్ హిస్టరీలో బ్యాటింగ్, వికెట్ కీపింగ్,  బౌలింగ్ చేయకుండా మ్యాచ్ గెలిచిన తొలి కెప్టెన్‌గా రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐర్లాండ్‌ పై బెన్ స్టోక్స్ ఈ ఘనతను రెండుసార్లు  సాధించాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఒకేఒక టెస్టులో పది వికెట్ల తేడాతో గెలుపును సాధించింది.

Also Read: WTC: డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ ని పక్కన పెట్టి మరీ ఇతన్ని తీసుకున్నారు… కానీ చివరికి ఏమైంది.?


End of Article

You may also like