తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ పై ఆ “Z” అనే అక్షరం ఎందుకుంటుందో తెలుసా?

తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సుల నెంబర్ ప్లేట్ పై ఆ “Z” అనే అక్షరం ఎందుకుంటుందో తెలుసా?

by Mohana Priya

Ads

మీరు ఆర్టీసీ బస్ నంబర్లను ఎప్పుడైనా గమనించారా ? ఒక వేళ బస్సు ఆంధ్రప్రదేశ్ కి చెందినది అయితే ఏపీ అని ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి చెందినది అయితే టీఎస్ అని ఉంటుంది. కానీ ఈ అక్షరాలు కాకుండా రెండు రాష్ట్రాల బస్ నంబర్లకి కామన్ గా ఇంకొక అక్షరం కూడా ఉంటుంది అదే Z. ఇలా రెండు రాష్ట్రాల బస్సు నంబర్లకి ఈ అక్షరం పెట్టడం వెనక ఒక కథ ఉంది. అదేంటంటే.

Video Advertisement

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 1932 సమయంలో హైదరాబాద్ నిజాం గా ఉండే వాళ్ళు. ఆయన తల్లి పేరు జహ్రా బేగం. ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు బస్సు రవాణా ప్రారంభించారు. ప్రారంభించిన కొత్తలో ఉన్న బస్సుల సంఖ్య 22 మాత్రమే. అప్పుడు బస్సు నంబర్లు HYZ అని మొదలయ్యేవి.

మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన తల్లి మీద ఉన్న ప్రేమతో ముందు తన తల్లి పేరు తోనే బస్సు సేవలను ప్రారంభిద్దామని అనుకున్నారు కానీ అలా ఒక వ్యక్తి పేరుతో పబ్లిక్ వాహనాలు నడవకూడదు అని ప్రభుత్వం చెప్పడంతో తన తల్లి పేరు లోని మొదటి అక్షరాన్ని బస్సు నంబర్ ప్లేట్ లపై రాయించారు. తర్వాత సంవత్సరాలు గడిచినా అదే పరంపర కొనసాగుతూ వస్తోంది.

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అని రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఆ అక్షరాన్ని పెట్టడానికి గల కారణాన్ని గౌరవిస్తూ అది అలాగే ఉంచేశారు.అలా రెండు రాష్ట్రాల్లో బస్సు సేవలు మొదలైనప్పటి నుండి ఆర్టీసీ బస్సులన్నీ Z సిరీస్ తోనే రిజిస్టర్ అవుతున్నాయి.

ముందు నుంచి బస్సు నంబర్లలో Z అక్షరం ఉన్నాకూడా రిజిస్ట్రేషన్ శాఖ వాళ్లకి ఆ అక్షరం ఎందుకు ఉందో తెలియదు. 1989లో వారికి ఈ కారణం తెలిసింది అని చెప్పారు. కానీ ఇలా Z అక్షరం పెట్టడం మాత్రం కేవలం ప్రభుత్వ వాహనాల కే పరిమితం అవుతాయి.

అద్దెకి తీసుకున్న వాహనాలకి లేదా ప్రైవేటు బస్సులకు ఈ అక్షరం ఉండదు. ప్రభుత్వం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తో ఎటువంటి ఒప్పందం చేసుకోకపోయినా తల్లి మీద ఉన్న గౌరవంతో Z అక్షరం పెట్టడం కొనసాగిస్తున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వ బస్సుల నెంబర్లలో Z అక్షరం ఉండడం వెనుక కారణం.

 


End of Article

You may also like