చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్ర లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీం. ఐపీఎల్ లో ఎప్పటికప్పుడు తనదైన ముద్ర వేస్తూ.. దుమ్ము రేపుతోంది చెన్నై సూపర్ కింగ్స్ జట్టు. ఐపీఎల్ చరిత్రలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ జట్టుగా పేరు గాంచిన చెన్నై ఎప్పుడు తమ జట్టు బలంగా ఉండేలానే చూసుకుంటుంది.
Video Advertisement
చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లే గాక వారి భార్యామణులు కూడా సామాజిక మాధ్యమాల్లో అదరగొడుతున్నారు. భర్తలతో పాటుగా వీరికి కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్ల ఫామిలీ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి..
#1 ఎం యస్ ధోని
జార్ఖండ్ డైనమైట్ ధోని భార్య సాక్షి.. పరిచయం అక్కర్లేని పేరు. ధోని ఎక్కడికెళ్లినా ఆమె వెంటే ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సాక్షి.. స్టైల్ గా కనిపించడంలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. 2010లో పెండ్లి చేసుకున్న ధోని-సాక్షి 2015లో జీవాకు జన్మనిచ్చారు.
#2 సురేష్ రైనా
సురేష్ రైనా భార్య ప్రియాంక. ధోని నీడనే ఎదిగిన రైనా సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన ప్రియాంకను 2015లో వివాహం చేసుకున్నాడు. వారికి గ్రేసియా, రియో ఇద్దరు సంతానం.
#3 మొయిన్ అలీ
చెన్నై సూపర్ కింగ్స్ కి చెందిన ఆల్ రౌండర్ మొయిన్ అలీ భార్య ఫిరోజా. వీరికి అబూబకర్, హాదియా ఇద్దరు పిల్లలు.
#4 రవీంద్ర జడేజా
ప్రపంచంలోని అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన రవీంద్ర జడేజా.. రివా సోలంకిని వివాహం చేసుకున్నాడు. జడేజా క్రికెటర్ కాగా రివా బీజేపీ నాయకురాలు. 2016లో పెళ్లి చేసుకున్న వీరిద్దరికీ ఒక కూతురు.
#5 అంబటి రాయుడు
అంబటి రాయుడు తన కాలేజీ ప్రియురాలు చెన్నుపల్లి విద్యను 2009లో వివాహం చేసుకున్నాడు. ఆమె మీడియాకు దూరంగా ఉన్నా సీఎస్కే మ్యాచ్ లు ఉంటే మాత్రం టీవీకి అతుక్కుపోతుంటుంది. వీరికి ఒక కుమార్తె.
#6 రాబిన్ ఊతప్ప
రాబిన్ ఊతప్ప భార్య శీతల్. వీరికి నోలన్ ఊతప్ప, ట్రినిటి థియా ఊతప్ప ఇద్దరు పిల్లలు.
#7 ఇమ్రాన్ తాహిర్
చెన్నై సూపర్ కింగ్స్ లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ భార్య సమయ్యా తాహిర్. వీరికి గిబ్రాన్ అనే కుమారుడు ఉన్నాడు.