ధోనికి ఏమైంది? పెద్ద హాస్పిటల్స్ వదిలేసి మారుమూల గ్రామంలో రూ. 40 ఫీజు ట్రీట్మెంట్?

ధోనికి ఏమైంది? పెద్ద హాస్పిటల్స్ వదిలేసి మారుమూల గ్రామంలో రూ. 40 ఫీజు ట్రీట్మెంట్?

by Anudeep

Ads

జార్ఖండ్ డైమండ్ ధోనీ టీం ఇండియాకు ఎన్నో చిరకాల విజయాలు అందించాడు. ఈ కూల్ కెప్టెన్ సారధ్యంలో ఐసీసీ ర్యాంకింగ్ లో ఇండియా వన్డే, టెస్ట్ లలో నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది. అటు ఐపీఎల్ లోను తన జైత్రయాత్రను కొనసాగించాడు. ఇటీవల ఐపీఎల్ 2022 ముగియడంతో ధోని తన నగరం రాంచీలో సందడి చేస్తున్నాడు.

Video Advertisement

తన పాత మిత్రులను కలుస్తూ, వారితో పార్టీలకు కూడా అటెండ్ అవుతున్నాడు. ఇటీవల ధోని ఓ ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి వెళ్లడంతో ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రస్తుతం ఎం ఎస్ ధోని మోకాలి నొప్పితో గత కొంతకాలంగా బాధ పడుతున్నాడు. అయితే చికిత్స కోసం ఎలాంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో జాయిన్ అవ్వకుండా కేవలం ఓ నాటు వైద్యుడి వద్ద చికిత్స తీసుకుంటున్నాడు ధోని.

చికిత్స నిమిత్తం వైద్యుడిని నాలుగు రోజులకు ఒకసారి కలుస్తున్నాడంటా.. ఇందుకు ఆ వైద్యుడికి ధోని చెల్లిస్తున్న మొత్తం కేవలం 40 రూపాయలేనట. ఇది ధోనీ సింప్లీసిటీకి నిదర్శనం.  రాంచీకి 70 కిలోమీటర్ల దూరంలోని లాంపుంగ్ కటింగ్ కెలా బాబా గల్గాలీ ధామ్ లో వందన్ సింగ్ ఖేర్వాద్ వద్ద ధోని చికిత్స పొందుతున్నాడు. గత నెల రోజులుగా నాలుగు రోజులకు ఒకసారి తన వద్దకు వస్తున్నాడని, హెర్బల్ మెడిసిన్ తో చికిత్స పొందుతున్నాడని వందన్ చెప్పుకొచ్చారు.

ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ కి వీడ్కోలు పలికినప్పటికి ఐపీఎల్ లో తనదైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తూనే ఉన్నాడు. కేవలం ధోని కోసమే అనేకమంది క్రికెట్ చూస్తారు. అలాంటిది ధోని ఇంకొన్నాళ్ళు ఐపీఎల్ లో ఆడాలి అభిమానులు కోరుకుంటున్నారు.


End of Article

You may also like