Ads
గ్లెన్ మాక్స్ వెల్ నిన్నటి నుండి ఈ పేరు సోషల్ మీడియాలో మారు మోగిపోతుంది. 2023 ప్రపంచ కప్ లో భాగంగా ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో డబుల్ సెంచరీ చేసి ప్రపంచ కప్ లోనే ఒక రికార్డు సృష్టించాడు. ఎవరు ఊహించిన విధంగా ఓటమి అంచునున్న ఆస్ట్రేలియా టీం ని గెలుపు తీరాలకు చేర్చాడు. ఇప్పుడు మాక్స్ వెల్ ఒక హీరో….
Video Advertisement
అయితే 2019 తర్వాత క్రికెట్ కి మాక్స్ వెల్ షార్ట్ గ్యాప్ ఇచ్చాడు… ఆ గ్యాప్ వెనకాల అసలు కారణం ఏంటంటే మాక్స్ వెల్ మెంటల్ హెల్త్ బాగోక పోవడమే తెలుస్తుంది. ఒక సివియర్ హెల్త్ ఇష్యూ తో మ్యాక్స్ వెల్ బాధపడుతూ ఉండేవాడట. అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. మాక్స్ వెల్ బయటికి వచ్చి చెప్పేంతవరకు కూడా దీని గురించి బయటికి రాలేదు.
గ్రౌండ్ లో బాగానే ఆడుతున్న కూడా తన మానసిక పరిస్థితి బాగోకపోవడంతో దాని నుండి బయటకు రావడానికి చాలా ఇబ్బందులు పడేవాడు. ఈ విషయం తెలుసుకుని మాక్స్ వెల్ కి బాగా సన్నిహితుడు అయిన అయిన క్రిస్ లెనిన్ షాక్ కి గురయ్యాడు. ఒక ఆటగాడిగా తను ఎంత యాక్టివ్ ఫిట్ గా ఉన్నప్పటికీ మెంటల్ హెల్త్ అనేది చాలా ముఖ్యం. దాని నుండి ఎవరూ తప్పించుకోలేరు అని ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన త్వరలోనే బయటకు వస్తాడని అతని స్నేహితుడు ఆకాంక్షించాడు.
అయితే నిన్న మాక్స్ వెల్ పెర్ఫార్మెన్స్ చూసిన ఎవరైనా సరే ఆశ్చర్యానికి లోనవ్వకుండా ఉండలేరు. తన మానసిక పరిస్థితి బాగోకపోయినా దాని నుండి కోలుకుని మళ్ళీ పూర్వస్థితికి మ్యాక్స్ వెల్ చేరుకోవడంతో ఆయన అభిమానులు అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ లో మ్యాక్స్ వెల్ గురించి వర్ణించాలి అంటే అన్ కన్వెన్షనల్, సర్కిమెస్టిక్, ఎగ్జిలరేటింగ్ అంటూ చాలామంది కామెంట్లు చేస్తున్నారు. కేవలం మ్యాక్స్ వెల్ పెర్ఫార్మెన్స్ కారణంగానే ఆస్ట్రేలియా టీం ప్రపంచ కప్ లో సెమీఫైనల్స్ కి చేరింది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
End of Article