సెల్ఫీలు తీసుకుని కోటీశ్వరుడు అయిపోయాడు.. ఇలాంటి ఐడియాలు మనకి ఎందుకు రావు..?

సెల్ఫీలు తీసుకుని కోటీశ్వరుడు అయిపోయాడు.. ఇలాంటి ఐడియాలు మనకి ఎందుకు రావు..?

by Megha Varna

Ads

ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటోంది. పైగా ప్రతి ఒక్క మూమెంట్ ని కూడా అందరూ క్లిక్ చేసి ఫోటో తీసుకుంటున్నారు. ఫ్రంట్ కెమెరా తో సెల్ఫీ లు గురించి అయితే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతా కూడా సెల్ఫీలని ఎక్కువగా క్లిక్ చేస్తూ ఆ ఫొటోస్ ని దాచుకుంటారు. అయితే మామూలుగా ఉండే సరదా వేరు. కానీ ఈ విద్యార్థికి ఉన్న సరదాగా మామూలు సరదా కాదు. సెల్ఫీ సరదా ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చింది. పైగా కోట్లు సంపాదిస్తున్నాడు.

Video Advertisement

మరి ఇక దీనికోసం పూర్తి వివరాల్లోకి వెళితే… ఇండోనేషియాలోని సెమరాంగ్‌ యూనివర్సిటీకి చెందిన కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థి సుల్తాన్‌ గుస్తాఫ్‌ అల్‌ ఘొజాలి కి సెల్ఫీలు అంటే చాలా ఇష్టం. ప్రతి రోజు కూడా సెల్ఫీ తీసుకునే వాడు. కంప్యూటర్ ముందు కూర్చుని ప్రతి రోజు కూడా ఒక సెల్ఫీ తీసుకోవడం తనకి అలవాటు. ఈ విద్యార్థి గత ఐదేళ్ల నుంచి కూడా ఇలానే సెల్ఫీలు తీసుకుంటున్నాడు.

ఆ తరవాత ఈ విద్యార్థి తనలో వచ్చిన మార్పులు అంటూ ఆ సెల్ఫీలతో వీడియో చేసాడు. నాన్‌ ఫంజిబుల్‌ టోకెన్‌ న్యూస్ పై ఈ విద్యార్థి కన్ను పడింది. ఎన్‌ఎఫ్‌టీలకు అకౌంట్ ఓపెన్ చేసాడు. ట్వీట్లు, పాటలు, ఫొటోలు, వీడియోలు వంటివి కొనడానికి, అమ్మడానికి దానిని వాడతారు.

సుల్తాన్ తన సెల్ఫీలను ‘ఘొజాలి ఎవిరీడే’ పేరుతో జనవరి 10వ తేదీన 933సెల్ఫీ లను అమ్మకానికి పెట్టాడు.  ఒక్కో సెల్ఫీ ధర మూడు డాలర్లు. ఇంకేముంది కొద్ది సేపట్లో ఇవి అమ్ముడైపోయాయి. జనవరి 21వ తేదీకి 500 మందికి పైగా వీటిని కొనుగోలు చేయడం జరిగింది. ఇలా ఈ విద్యార్థి 384 ఎథెర్‌ కాయిన్స్‌ ను సంపాదించాడు. అంటే వీటి విలువ రూ.7.5 కోట్లు.


End of Article

You may also like