గుప్పెడంత మనసు నుండి ఇంక రిషిని తప్పించేశారా.? కొత్త క్యారెక్టర్ ఎవరు?

గుప్పెడంత మనసు నుండి ఇంక రిషిని తప్పించేశారా.? కొత్త క్యారెక్టర్ ఎవరు?

by Mohana Priya

Ads

స్టార్ మాలో ప్రసారం అయ్యే గుప్పెడంత మనసు సీరియల్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. అయితే సీరియల్ ఈ మధ్య ట్రాక్ మారింది. అప్పటి లాగా నడవట్లేదు. అందులోనూ ముఖ్యంగా జగతి మేడం పాత్రని తీసేశాక సీరియల్ డల్ గా అయిపోయింది.

Video Advertisement

ఇప్పుడు హీరో రిషి పాత్ర కూడా కనిపించట్లేదు. ప్రేమ కథగా స్టార్ట్ అయిన సీరియల్, ఇప్పుడు ఎటో వెళ్తోంది. రిషి పాత్ర అప్పుడప్పుడు కనిపిస్తున్నా కూడా అది పాత ఫుటేజ్ అని అర్థం అవుతోంది. సోమవారం ఎపిసోడ్ లో అయితే రిషి మళ్ళీ కిడ్నాప్ అయ్యాడు అని చూపించారు.

దాంతో అసలు రిషి పాత్ర ఉంటుందా? ఉండదా? అనే ఒక అనుమానం నెలకొంది. ఒక కొత్త పాత్ర కూడా వస్తాడు. కొంత మంది అతనే రిషి పాత్రలో నటిస్తాడు అని కూడా అంటున్నారు. అయితే ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం, రిషి పాత్ర పోషిస్తున్న ముఖేష్ గౌడ చాలా రోజుల నుండి షూటింగ్ కి రావట్లేదు. ప్రొడక్షన్ హౌస్ కి, ముఖేష్ కి ఏవో గొడవలు ఉన్నాయి అని సమాచారం. ఈ కారణంగానే ముఖేష్ షూటింగ్ కి రావట్లేదు. అందుకే రిషి పాత్రని పెద్దగా చూపించట్లేదు.

దాంతో సీరియల్ నడిపించడానికి ఏవేవో ట్రాక్స్ యాడ్ చేస్తున్నారు. కానీ ఏ ఒక్కటి కూడా ఆసక్తికరంగా అనిపించట్లేదు. ఈ కారణంగా రేటింగ్ కూడా పడిపోతుంది. రిషి వస్తాడు. రిషి వస్తాడు. అని చెప్తూ ఉంటారులే కానీ, వచ్చినట్టు మాత్రం కనిపించడు. షూటింగ్ కి ముఖేష్ గౌడ రాకపోవడంతో అతని కొత్త ఫుటేజ్ తీసుకునే అవకాశం కూడా వీళ్ళకి దొరకట్లేదు. దాంతో ఉన్న పాత్రలతో సీరియల్ నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే చాలా రోజుల నుండి ముఖేష్ గౌడ, రిషి అనే పాత్రలో ప్రేక్షకులకు చాలా దగ్గర అయ్యారు.

ఇప్పుడు అతని ప్లేస్ లో ఇంకొకళ్ళు వస్తారు అంటే జనాలు అంగీకరించడం కూడా కష్టం ఏమో. మరి ఇప్పుడు సీరియల్ బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే సీరియల్ కిడ్నాప్ అనే ట్రాక్ మీద నడిపిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలి అంటే సాగదీస్తున్నారు. అందుకే వీలైనంత త్వరగా సీరియల్ వాళ్ళు ఏదో ఒక నిర్ణయం తీసుకొని, ఆ పాత్రని రీప్లేస్ చేయడం, లేదా ముఖేష్ గౌడ తో ఉన్న గొడవలు పరిష్కరించుకోవడం వంటిది చేస్తే సీరియల్ రేటింగ్ మళ్ళీ పెరుగుతుంది.

ALSO READ : 22 ఏళ్ల తర్వాత మళ్ళీ నాగార్జునతో కలిసి నటించిన ఈ సపోర్టింగ్ ఆర్టిస్ట్ ఎవరో గుర్తుపట్టారా.? ఇంతకముందు ఏ సినిమాలో అంటే.?


End of Article

You may also like