కూరగాయలు బేరమాడే వారు ఈ అమ్మాయి మాటలు ఒకసారి వినండి…నిజమే కదా అనిపిస్తుంది.!

కూరగాయలు బేరమాడే వారు ఈ అమ్మాయి మాటలు ఒకసారి వినండి…నిజమే కదా అనిపిస్తుంది.!

by Anudeep

Ads

రైతు లేకుండా బతకలేం అని అందరికి తెలుసు.. కానీ రైతు బతకడానికి వీసమెత్తు సాయం చేయడానికి ఎవరూ ముందురారు. రైతే దేశానికి వెన్నెముక అని కీర్తిస్తారు.

Video Advertisement

కానీ, ఆ రైతు వెన్ను విరుగుతున్నా..వెన్నుతట్టి సపోర్ట్ చేసే వారు ఎవరు ఉండరు. రైతులపై ప్రేమంతా వాట్సాప్ స్టేటస్ లకే పరిమితమైంది.

farmers 3

రైతు కష్టాన్ని గుర్తించి.. వారిని గౌరవించాలి అంటూ కొందరు ఈ వీడియో ను చేసారు. “పంచాయితీ” పేజీ వారు ఈ వీడియో ను సోషల్ మీడియా లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. కూరగాయల అమ్మే వ్యక్తుల దగ్గర సాధారణం గా వినియోగదారులు ఎలా బేరం ఆడుతుంటారో చూపించారు. ఇతర ఆడంబరాలు కోసం వేలకు వేలు ఖర్చుపెట్టే మనం రైతుల దగ్గర కూరలు కొనాలంటే పది రూపాయలకైనా వెనకాడతాం..

farmers 4

రైతుల గురించి ఎందరో ఎన్నో రకాల నీతి సూక్తులు చెబుతుంటారు. సినిమాల్లో కూడా వారిని ఆకాశానికెత్తేస్తారు. కానీ నిజ జీవితం లో వారు భూమి మీద బతకడానికి ఇన్ని నూకల్ని అయినా మిగల్చరు. వారికి ప్రేమాభిమానాలను పంచకపోయినా పర్లేదు.. వారి కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం ఇవ్వాలి.. అది వారి హక్కుగా మనం గుర్తించాలి.

farmers 1

హోటల్స్ లో వారు కూడా రోడ్ సైడ్ నే కూరలు కొనుక్కొస్తారు. వాటిని వండి పెట్టినందుకే వందల రూపాయలు చెల్లిస్తే.. మరి పండించిన వారికి ఎంత చెల్లించాలి..? ఓ హోటల్ లో నాలుగైదు రకాల పచ్చి వెజిటల్స్ ను కట్ చేసి ఇచ్చి.. సలాడ్ అని పేరు పెట్టి ఇచ్చేస్తారు.. దానికి మూడొందల బిల్ వేసినా మారు మాట్లాడకుండా చెల్లించే మనం కేజీ టమాటా ఇరవై రూపాయలు అంటే మాత్రం బేరమాడాలనుకుంటాం.. ఇలాంటి వారు ఉన్నంత వరకు రైతుల పరిస్థితి ఇలానే ఉంటుంది అని ఈ వీడియో ద్వారా చక్క గా వివరించారు. ఆ వీడియో ను మీరు కూడా ఇక్కడ చూసేయండి.

Watch Video:


End of Article

You may also like