ఐపీఎల్ 16 వ సీజన్ లో భాగంగా మ్యాచ్ లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతోంది. ఈ మ్యాచ్ లు అసలైన క్రికెట్‌ మజాను ఫ్యాన్స్ అందిస్తున్నాయి. స్టేడియంలో కరకెట్ ను చూసే ఆడియెన్స్ కన్నా టీవీలు, మొబైల్స్‌లో చూసే వారి సంఖ్య ఎక్కువ.

Video Advertisement

ఆడియెన్స్ కు మంచి అనుభూతిని ఇవ్వడం కోసం ప్ర‌సార మ‌ధ్య‌మాలు సాంకేతిక‌త‌ను వాడుతున్నారు. ఇక ఐపీఎల్ లోనూ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. అవి కూడా హైటెక్ గ్యాడ్జెట్స్. మరి ఐపీఎల్‌లో ఉపయోగించే ఆ గ్యాడ్జెట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం..
1. కూకబుర్ర బాల్:

స్మార్ట్ బాల్ అనేది ప్రపంచంలోనే తొలి మైక్రోచిప్డ్ క్రికెట్ బాల్. ఈ బాల్ ను ప్రముఖ క్రికెట్ బాల్ తయారు చేసే  కూకబుర్రా, టెక్ పయనీర్ స్పోర్ట్ కోర్ సహకారంతో రూపొందించారు. కూకబుర్ర స్మార్ట్ బాల్ సాధారణ క్రికెట్ బాల్  రూపాన్ని, చలనాన్ని కలిగి ఉంటుంది. ఈ బాల్ లో మైక్రోచిప్ ఉంటుంది. దీని సహాయంతో  సమయం బాల్ స్పీడ్ రొటేషన్, కొట్టిన తరువాత ఎంత ఎత్తుకి వెళ్ళిందనే తెలుస్తుంది. దీని వల్ల మ్యాచ్ లో నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది.  2 . ఎల్‌ఈడీ స్టంప్స్‌, బెయిల్స్‌:

నార్మల్ ఉడెన్ స్టాంప్స్ కాదు. వీటిలో హైటెక్ సెన్సర్స్, బ్యాటరీస్, కెమెరా ఉంటుంది. రనౌట్లు, స్టంపింగ్‌ లాంటి సందర్భాలలో అంపైర్లకు ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి. బాల్ వికెట్లను తాకగానే ఎల్‌ఈడీ లైట్లు వెలుగుతాయి. ఇక బెయిల్స్‌ కిందపడినా సులువుగా తెలుస్తుంది. రనౌట్లు, స్టంపింగ్‌ డిసిషన్స్ లో  ఎల్‌ఈడీ స్టంప్స్‌ కచ్చితత్వాన్ని కనపరుస్తాయి. ఆడియెన్స్ కి కూడా కొత్త అనుభూతిని కలిగిస్తోంది. ఐపీఎల్‌ లో ఉపయోగించే ఎల్‌ఈడీ స్టంప్‌లు మరియు బెయిల్‌లు చాలా ఖరీదైనవి. ఎల్‌ఈడీ స్టంప్‌లు మరియు జింగ్ బెయిల్‌ల సెట్ ధర సుమారు 32 లక్షలు.
3. స్పైడర్‌ కెమెరాలు:

ఇవి గ్రౌండ్ కొంత ఎత్తులో తిరుగుతూ మ్యాచ్ ను చిత్రీకరిస్తుంటాయి. ఈకెమెరాలు కేబుళ్ల సహాయంతో అటు ఇటు తిరుగుతుంటాయి. స్టేడియం పై నుండి కూడా దృశ్యాలను చిత్రీకరిస్తుంటాయి. అయితే ఇవి మైదానంలోనే తిరుగుతుండటం వల్ల ఒక్కోసారి బాల్ కెమెరాకి గాని, దాని తీగలకు తాకడం వల్ల దిశను మార్చుకుంటాయి. అందువల్ల స్పైడర్‌క్యామ్‌కు బాల్ తాకితే, దానిని డెడ్‌ బాల్‌గా అంపైర్‌ ప్రకటిస్తాడు.
4. హాట్ స్పాట్: 
ఒక థర్మల్ కెమెరా, రెండు ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలను ఉపయోగిస్తుంది. మైదానం యొక్క ప్రతి చివర ఒకటి ఉంటుంది. ప్యాడ్‌ పై ఉన్న బంతి, బ్యాట్‌ పై బంతి, నేల పై బంతి లేదా గ్లోవ్‌ పై బంతి పడినపుడు ఏర్పడే వేడిని ఈ కెమెరాలు గుర్తించి, కొలుస్తాయి. దీని ద్వారా బంతి వాటికి తాకిందా లేదా అనేదాన్ని గుర్తిస్తారు. ఒక్క కెమెరా ధర రూ 2 కోట్లని సమాచారం. 5. బగ్గీక్యామ్‌ – రోబోటిక్ కెమెరా :

ఈ రోబోటిక్ కెమెరా టెన్నిస్‌ నుండి  తీసుకున్నారు. ప్రతి ఒక్క ప్లేయర్ కదలికలను చిత్రీకరిస్తాయి. గతంలో అథ్లెట్ల కోసం ఈ కెమెరాలను వాడేవారు. ప్లేయర్స్ తో పాటే ఇవి పరుగెత్తుతూ వారి కదలికలను చిత్రీకరిస్తాయి. గ్రౌండ్ లో బౌండరీ లైన్‌ వద్ద రోబోటిక్ కెమెరాలు తిరుగుతూ ప్లేయర్స్ ప్రతీ మూమెంట్‌ను రికార్డు చేస్తాయి.

Also Read: “యశస్వి జైస్వాల్” లాగానే… IPL తో జీవితాలనే మార్చుకున్న 6 మంది ప్లేయర్స్..!