అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కంటే ఎక్కువ జీతం తీసుకునే ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..?

అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ కంటే ఎక్కువ జీతం తీసుకునే ఆ క్రికెటర్ ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

విరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పుట్టుకొస్తుంది. నేషనల్ లెవెల్ లోనే కాదు.. ఇంటర్నేషనల్ లెవెల్ లో కూడా విరాట్ కోహ్లీ కి బాగా అభిమానులు ఉన్నారు. క్రికెట్ నేపధ్యం లో ఎక్కువ జీతం తీసుకునేదెవరు అన్న ప్రశ్నకు కూడా టక్కున చెప్పే ఆన్సర్ విరాట్. కానీ.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ శాలరీ తీసుకునే వ్యక్తి ఉన్నారన్న విషయం మీకు తెలుసా..?

Video Advertisement

virat kohli

ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వేతనం పొందుతున్న కెప్టెన్ జోరూట్. జోరుట్ ఇంగ్లండ్ కి టెస్ట్ కెప్టెన్. ఈయన ఏడాదికి రూ.8 కోట్ల 97 లక్షల వేతనాన్ని అందుకుంటున్నారు. ఆయన తరువాత ఎక్కువ మొత్తాన్ని తీసుకుంటోంది విరాట్ కోహ్లీ. రూ. 7 కోట్ల వార్షిక వేతనాన్ని అందుకుంటూ విరాట్ రెండవ స్థానం లో ఉన్నారు. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో కోహ్లీ కి ఏ+ గ్రేడ్‌ ఉంది. బీసీసీఐ బోర్డు అత్యంత ధనిక క్రికెట్ బోర్డు. మరి బీసీసీఐ ప్లేయర్ ఇలా సెకండ్ ప్లేస్ లో ఉంటారని ఎవరూ అనుకోరు. ఇది పక్కన పెట్టి.. యాడ్స్, ఐపీఎల్ తో వచ్చే వేతనం ఇవన్నీ కలుపుకుంటే.. క్రికెట్ కోహ్లీ కి దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేరు.


End of Article

You may also like