టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినా.. సమయస్ఫూర్తితో అందరి ప్రాణాలు కాపాడింది.. ఈ అమ్మాయి స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అంటారు..!

టెర్రరిస్ట్ లు ఎటాక్ చేసినా.. సమయస్ఫూర్తితో అందరి ప్రాణాలు కాపాడింది.. ఈ అమ్మాయి స్టోరీ వింటే హ్యాట్సాఫ్ అంటారు..!

by Megha Varna

Ads

శ్రీకాకుళం కి చెందిన అమ్మాయి టెర్రర్ ఎటాక్ నుండి తప్పించుకుంది. అలాగే తాను తప్పించుకోవడం మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని కూడా కాపాడింది. అయితే మరి ఇంతకీ ఆ అమ్మాయి అసలు ఎలా టెర్రరిస్టుల చేతిలో పడింది..? ఎలా బయటపడింది అనే దాని గురించి చూద్దాం.

Video Advertisement

శ్రీకాకుళంలో ఈ కుటుంబం ఉంటున్నారు. వీళ్లది ఆర్మీ ఫ్యామిలీ. సత్యనారాయణ, పద్మావతి కుమార్తె హిమ ప్రియ. నాలుగేళ్ల క్రితం సత్యనారాయణ జమ్మూ అండ్ కాశ్మీర్ లోని ఉదంపూర్ లో ఆర్మీ డ్యూటీ చేసేవారు. అప్పుడు వాళ్ళు జమ్ములో హెడ్ క్వార్ట్రర్స్ లో కుటుంబంతో ఉండేవాళ్ళు. నాలుగేళ్ల క్రితం హిమ ప్రియకి ఎనిమిదేళ్లు. ఆర్మీ రెసిడెన్షియల్ హెడ్ క్వార్టర్స్ లోకి టెర్రరిస్టులు వచ్చి ఎటాక్ చేయడం మొదలుపెట్టారు.

అయితే హేమ ప్రియ తల్లి హిమ ప్రియని మరియు మరో ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని లోపలికి వెళ్లి తలుపు గడియ వేసుకున్నారు. టెర్రరిస్టులు లోపలికి రావడానికి ప్రయత్నించినా హిమ ప్రియ మరియు పద్మావతి మూడు గంటల పాటు టెర్రరిస్టులు రాకుండా తలుపు దగ్గరే ఉండి అడ్డుకున్నారు. ఇంక టెర్రరిస్టులు విసిగిపోయి వీళ్ల మీదకు హ్యాండ్ గ్రెనడా ఎక్స్ప్లోషన్ ని పేల్చేశారు. దీనితో తల్లి పద్మావతి గాయాలతో పడిపోయారు.

హిమ ప్రియ కి కూడా గాయాలు అయ్యాయి. అయితే హిమ ప్రియ మాత్రం తల్లి పడిపోయినా ఒక్కర్తే టెర్రరిస్టులు రాకుండా అడ్డుకుంది. అయితే ఇంక కుదరదు అని చెప్పి టెర్రరిస్టులతో ఆమె మాట్లాడింది. ఒక గంట నుంచి రెండు గంటల పాటు వాళ్ళతో మాట్లాడింది. వాళ్ళని ఎలా అయినా ఒప్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. ఆఖరికి టెర్రరిస్టులు ఆమె మాటలు విన్నారు. తల్లిని మరియు ఆ పిల్లల్ని సురక్షితంగా బయటకి తీసుకు వెళ్ళింది. ఆర్మీ కి సమాచారాన్ని అందించింది.

తన తండ్రి డ్యూటీలో ఉండటంతో ఇతర ఆర్మీ ఆఫీసర్లు వచ్చి ఆస్పత్రికి జాగ్రత్తగా తీసుకువెళ్లారు. ఎనిమిదేళ్ళ వయసులో ఈమె టెర్రర్ ఎటాక్ నుండి బయటపడడం.. తాను మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళని కూడా సురక్షితంగా ఉంచింది. అలా సేవ్ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి రాష్ట్రీయ బాలల పురస్కారాన్ని సోమవారం జరిగిన వర్చ్యువల్ మీటింగ్ లో ఆమెకు ఇచ్చారు. ఆమెకి అవార్డు, సర్టిఫికేట్ తో పాటు లక్ష రూపాయలు శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇచ్చారు. హిమ ప్రియ తన తండ్రి తనకు ఆదర్శం అని చెప్పింది.


End of Article

You may also like