ఈ ప్రైవేట్ హాస్పిటల్ లో క్యాష్ కౌంటరే ఉండదు.. అన్నీ ఉచితమే.. హైదరాబాద్ లోనే ఎక్కడ ఉందో తెలుసా..?

ఈ ప్రైవేట్ హాస్పిటల్ లో క్యాష్ కౌంటరే ఉండదు.. అన్నీ ఉచితమే.. హైదరాబాద్ లోనే ఎక్కడ ఉందో తెలుసా..?

by Anudeep

Ads

సాధారణంగా ఏ సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ లో అయినా డాక్టర్ ని కలవాలి అంటే కచ్చితంగా కన్సల్టేషన్ ఫీజ్ చెల్లించాలి. అంతే కాదు.. వాళ్ళు అడిగిన టెస్ట్ లకి వేరే బిల్స్ ఉంటాయి. ఇక మందుల సంగతి సరే సరి. ప్రైవేట్ ఆసుపత్రిలో ఇవన్నీ చాలా సాధారణం అయిపోయాయి.

Video Advertisement

కానీ.. హైదరాబాద్ లో ఉన్న ఈ ప్రైవేట్ ఆసుపత్రి మాత్రం పూర్తిగా డిఫరెంట్. ఇక్కడ డాక్టర్ కి చూపించుకోవాలంటే ముందుగా క్యాష్ కట్టాల్సిన అవసరం ఉండదు. ఆ మాటకి వస్తే.. అసలు క్యాష్ కౌంటర్ అనేదే ఈ హాస్పిటల్ లో ఉండదు.

shadan 3

ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఈ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ చేస్తారు. ఈ హాస్పిటల్ పేరు షాదాన్ హాస్పిటల్. కులమత భేదం లేకుండా.. వైద్యం, మందులు, టెస్ట్ లు ఇలా అన్ని ఈ హాస్పిటల్ లో ఉచితంగానే అందిస్తారు. హిమాయత్ సాగర్ రోడ్డులో ఈ హాస్పిటల్ ఉంది. “డాక్టర్ విజారత్ రసూల్ ఖాన్ ఫ్రీ మెగా క్యాంపు” పేరిట ఇక్కడ ఉచితంగా వైద్యం అందిస్తారు. చుట్టుపక్కల శివారు ప్రాంతాల్లోని ప్రజలు ఇక్కడకి వచ్చి వైద్యం చేయించుకుంటారు. ఇందుకోసం పలు రూట్లలో ఆసుపత్రి వారే రవాణా సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసారు.

shadan 2

కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు, పంటి సమస్యలు, ఆర్థోపెడిక్ సమస్యలు ఇలా అన్ని సమస్యలకు పరిష్కారం అందిస్తారు. ఉచితంగానే అధునాతన వైద్యం అందిస్తూ అందరి ప్రశంసలను పొందుతున్నారు. చికిత్స కోసం వచ్చిన వారికి భోజన సదుపాయాలు, రవాణా సదుపాయాలు కూడా అందిస్తున్నారు. గైనిక్ సర్జరీలు, చెవి, ముక్కు, గొంతు . ఆర్ధోపెడిక్ సర్జరీలను కూడా ఉచితంగానే అందిస్తున్నారు. CT స్కాన్, MRI , 2 D ఎకో వంటి వైద్య పరీక్షలు కూడా ఇక్కడ ఉచితంగా చేస్తారు. ఇక్కడ రోజుకు 30 నుంచి 40 సర్జరీల వరకు చేస్తుంటారు.

shadan 1

రోజు 300 లకు పైగా ఇన్ పేషెంట్లు చేరుతున్నారు. రోజుకు కనీసం 12 వందల మంది రోగులు ఉచితంగా చికిత్స చేయించుకుంటున్నారు. షాదాన్ సొసైటీ ఆధ్వర్యంలోనే ఎన్నో ఏళ్లుగా ఈ ఆసుపత్రిని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరుకు హెల్త్ క్యాంప్స్ లో 7500 ల మంది రోగుల వరకు చికిత్సను అందించారు. చిన్న చిన్న రోగాలకు కూడా ముక్కుపిండి లక్షల రూపాయలు వసూలు చేస్తున్న హాస్పిటల్స్ ఉన్న ఈ రోజుల్లో.. ఇలా పేదల కోసమే అన్నిటిని ఉచితంగా అందించగలగడం నిజంగా స్ఫూర్తినిచ్చే విషయం.


End of Article

You may also like