Ads
ఐపీఎల్ 2023 ఫైనల్ లో గుజరాత్ పై అద్భుతమైన విజయాన్ని అందుకుని ఐదో సారి కప్పు అందుకుంది చెన్నై సూపర్ కింగ్స్. 16వ ఐపీఎల్ లో 5 వికెట్ల తేడాతో గెలుపొంది చెన్నై తన సత్తాను మరోసారి చాటింది. అయితే ప్రస్తుతం చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వయసు 41 ఏళ్ళు.
Video Advertisement
అయితే ఐదోసారి కప్పును ఎగరేసుకుపోయిన చెన్నై టీం లో చాలా మంది సీనియర్ ప్లేయర్స్ ఉన్నారు. దీంతో వీరిపై డాడీస్ ఆర్మీ అనే పేర్లు కూడా వచ్చాయి. కానీ వాటన్నిటిని పట్టించుకోకుండా విజేతలుగా నిలిచారు. అయితే ధోని ఎంత గొప్ప కెప్టెన్ అన్న విషయం మనకి తెల్సిందే.. ఆయన తన జట్టును నడిపించే తీరు.. వారిని ప్రోత్సహించే తీరుతో ఆతని మలుపు తిప్పగలరు.
అయితే ఈ ఐపీయల్ సీజన్ లో ధోని తన బ్యాట్ తో మెరుపులు మెరిపించలేదు కానీ.. టీ20 అనేది యువ ప్లేయర్ల ఆట కావచ్చు. అయితే, ఇక్కడ సీనియర్ కెప్టెన్ ఉంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి. కెప్టెన్ నుంచి స్ఫూర్తి పొందడం, బృంద స్ఫూర్తితో ముందుకు వెళ్లడం లాంటివి ఇక్కడ మనకు కనిపిస్తాయి. సగటు ప్రతిభను కనబరిచే టీమ్‌లను కూడా ప్లేయర్లను గౌరవిస్తూ, సరైన సందేశాలను ఇస్తూ మంచి కెప్టెన్లు విజయాల దిశగా నడిపించగలరు.
సీఎస్కేకు ధోనీ తొలి టైటిల్ తెచ్చిపెట్టినప్పుడు ఆయన వయసు 28 ఏళ్లు. 35 ఏళ్ల తర్వాత కూడా ధోనీ తన జట్టుకు మూడు టైటిల్స్ తెచ్చిపెట్టారు. 41 ఏళ్ళ వయసులో మరోసారి టైటిల్ ని ఖాతాలో వేసుకున్నారు.
ధోని లాగే 15 ఏళ్ల కిందట ‘ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)’ మొదటి సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకు 38 ఏళ్ల షేన్ వార్న్ నేతృత్వం వహించి విజయం దిశగా నడిపించారు. దేశ జాతీయ జట్టుకు కెప్టెన్సీ చేయని అతిగొప్ప ప్లేయర్‌గా ఆయన్ను వర్ణించారు.
షేన్ వార్న్ వ్యూహకర్తగా, మార్గదర్శిగా ఆయన జట్టును నడిపించారు. కానీ, ఆస్ట్రేలియా ఎన్నడూ ఆయన్ను కెప్టెన్సీ మెటీరియల్‌గా చూడలేదు. కానీ, ఐపీఎల్ ఆయనకు అవకాశం ఇచ్చింది. ఆ నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకున్నారు. అలాగే ఐపియల్ రెండో సీజన్ లో 38 ఏళ్ల ఆడమ్ గిల్‌క్రిస్ట్ ఈ కప్పును డెక్కన్ చార్జర్స్‌కు తెచ్చిపెట్టారు. అటు వార్న్, ఇటు ధోనీ.. ఇద్దరూ సమయానికి తగినట్లుగా నడుచుకునే కెప్టెన్లు. ప్లేయర్లలో వీరు స్ఫూర్తి నింపుతారు. అవసరమైతే మందలిస్తారు కూడా.
వేగంగా మారుతున్న గేమ్‌ను అన్ని కోణాల్లోనూ చూడగలిగే సీనియర్ ప్లేయర్లకు ఐపీఎల్ లాంటి జట్ల సారథ్య బాధ్యతలను అప్పగించడం చాలా మంచి పని అని విశ్లేషకుల అభిప్రాయం. తాజాగా ధోని రిటైర్మెంట్ గురించి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. “ఐపీఎల్ 2023 సీజన్లో మొత్తం కలిపి ధోనీ ఆడిన బంతులు ఓ 40-50 ఉండొచ్చు. కాబట్టి.. ధోనీ ఇప్పుడు కేవలం కెప్టెన్సీ కోసం ఆడుతున్నాడు. రాబోవు సీజన్లలో ధోనీని చెన్నై టీమ్ మెంటార్ లేదా కోచ్ లేదా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా చూసే అవకాశం ఉంది’’ అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.
Also read: IPL నుండి ధోని రిటైర్ అవ్వకుండా… BCCI తీసుకొచ్చిన కొత్త నియమం ఏంటో తెలుసా..?
End of Article