నెలసరి సమయంలో లేడీ అథ్లెట్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారో తెలుసా..? వారి ఓర్పు తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

నెలసరి సమయంలో లేడీ అథ్లెట్స్ ఎలా మేనేజ్ చేసుకుంటారో తెలుసా..? వారి ఓర్పు తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు..!

by Anudeep

Ads

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకెళ్తున్నారు. ఆడవారు కేవలం వంటింటికే పరిమితం అయిపోరనీ.. వారికి అవకాశం ఇస్తే తప్పకుండ తమ ప్రతిభని నిరూపించుకుని చూపిస్తారని ఇప్పటికే పలు రంగాల్లో మహిళలు నిరూపించి చూపించారు. ఇక క్రీడారంగం సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మిగిలిన రంగాలతో పోలిస్తే.. క్రీడారంగంలో అమ్మాయిలకి కొంచం శారీరక శ్రమ ఎక్కువగానే ఉంటుంది.

Video Advertisement

ఇక నెలసరి వచ్చినప్పుడు అమ్మాయిల ఇబ్బందులు ఎలా ఉంటాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ పరిస్థితిలో క్రీడారంగంలో అమ్మాయిలకు మరిన్ని ఇబ్బందులు ఎదురవుతుంటాయి.

athlets 2

అడుగు తీసి అడుగు వేయడమే కష్టం అయిన పరిస్థితిలో ఆటల్లో పోరాడి సత్తా చాటాల్సిన అవసరం అథ్లెట్స్ కు ఉంటుంది. మరి అలాంటి పరిస్థితిల్లో వారు ఎలా మేనేజ్ చేసుకుంటారో అని చాలా మందికి సందేహం ఉంటుంది. అదెలానో ఇప్పుడు చూద్దాం. నిజానికి పోటీ జరుగుతున్నప్పుడు ఏ అథ్లెట్ కి అయినా నెలసరి వస్తే.. నేను అబ్బాయిని అయినా బాగుండు అని అనుకోకుండా ఉండలేరు. ఆ సమయంలో నొప్పి అంత తీవ్రంగా ఉంటుంది. దానిని వారు ఎలా ఎదుర్కొంటారో ఇప్పుడు చూద్దాం.

athlets 4

నిజానికి వారికి పీరియడ్స్ వచ్చినా ఆటని కొనసాగించాల్సి ఉంటుంది. అందుకోసం ఆటని వాయిదా వేయడం అంటూ జరగదు. సాధారణంగా ఇంట్లో అమ్మకి, పెళ్ళైతే భర్తకి తప్ప పీరియడ్స్ గురించి మరొకరికి చెప్పడానికి ఆడవారు ఇష్టపడరు. అయితే అథ్లెట్స్ కి మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచుతారు. పెయిన్ కిల్లర్స్, హాట్ వాటర్ బాగ్స్, ఫిజియోథెరపీ, కాంట్రాసెప్టివ్స్ వంటి వాటిని అందుబాటులో ఉంచుకుంటారు. అథ్లెట్స్ కూడా పీరియడ్ ట్రాకింగ్ అప్లికేషన్స్ తో తమ పీరియడ్స్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకుని మేనేజ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

athlets 3

నిజానికి మ్యాచ్ షెడ్యూల్స్ కు, పీరియడ్స్ కి ఎలాంటి సంబంధం ఉండదు. పీరియడ్స్ వచ్చినా మ్యాచ్ షెడ్యూల్స్ లో మార్పు చేయడానికి సాధ్యం కాదు. అందుకే లేడీ అథ్లెట్స్ ఆ నొప్పిని ఓర్చుకుంటూనే మ్యాచ్ పై కాన్సంట్రేట్ చేయడానికి ప్రయత్నిస్తారు. భారత దేశంలో అయితే.. మహిళా హాకీ జట్టుకు కచ్చితంగా పీరియడ్ స్టేటస్ ను అప్ డేట్ చేయాలి అన్న నియమం ఉంటుంది. ప్రస్తుతం ఇతర ఆటలకి కూడా ఈ నియమాన్ని వర్తించాలని చూస్తున్నారు. నెలసరి సమయాల్లో శారీరక నొప్పులతో పాటు, మానసిక ఒత్తిడి, అలజడి, మూడ్ స్వింగ్స్ వంటివి ఉంటాయి. ఇటువంటి వాటిని ఎదుర్కోవడం కోసం నిపుణులు వారికి యోగ, ధ్యానం వంటి వాటిని అలవాటు చేస్తుంటారు.


End of Article

You may also like