ASIA CUP 2022: “పాక్” తో సూపర్ – 4 లో ఓడిపోయినా…”ఆసియా కప్” ఫైనల్స్ కి “భారత్” చేరాలంటే ఎలా.?

ASIA CUP 2022: “పాక్” తో సూపర్ – 4 లో ఓడిపోయినా…”ఆసియా కప్” ఫైనల్స్ కి “భారత్” చేరాలంటే ఎలా.?

by Anudeep

Ads

ఆసియా కప్ 2022 లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. లీగ్ దశలో వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి సూపర్ 4 కు చేరిన రోహిత్ సేన దాయాదుల చేతిలో ఖంగు తింది. ఆదివారం జరిగిన మ్యాచ్ లో 5 వికెట్ల తేడా తో పాకిస్తాన్ భారత్ పై విజయం సాధించింది.
కాగా పాక్ చేతిలో ఓటమి తర్వాత భారత్ ఫైనల్స్ కు చేరగలదా..?? భారత్ కు ఉన్న అవకాశాలేంటి..? దీనికి పాక్ సహకారం అవసరమా..?? అదెలాగో చూద్దాం..

Video Advertisement


సూపర్ 4 లో ఇప్పటికే శ్రీలంక, పాకిస్థాన్ ఒక్కో విజయం తర్వాత పాయింట్ల పట్టికలో టాప్ 2 లో నిలిచాయి. తర్వాతి భారత్, ఆఫ్గానిస్తాన్ మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. సూపర్ 4 లోని నాలుగు జట్లూ మిగిలిన మూడు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడనున్నాయి. ఓవరాల్ గా శుక్రవారంతో ఈ మ్యాచ్ లు ముగియనున్నాయి. అప్పటికి పాయింట్ల పట్టికలో టాప్ 2 లో ఉన్న రెండు జట్లు ఫైనల్స్ ఆడతాయి. సెప్టెంబర్ 11 ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరుగనుంది.

how indian tem enters into asia cup finals
భారత్ ఫైనల్స్ కు చేరాలంటే..??

# పాక్ చేతిలో ఓడిపోయిన భారత్ తర్వాత రెండు మ్యాచ్ లు శ్రీలంక యాహూ మంగళ వారం , ఆఫ్గానిస్తాన్ తో గురువారం ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్ లలో ఇండియా విజయం సాధిస్తే ఆఫ్గానిస్తాన్ ఫైనల్ రేస్ నుంచి తప్పుకుంటుంది.

how indian tem enters into asia cup finals
# పాక్ తన రెండు మ్యాచ్ లను శ్రీలంక, ఆఫ్గానిస్తాన్ తో ఆడుతుంది. ఈ రెండిటిలో పాక్ విజయం సాధిస్తే శ్రీలంక కూడా ఇంటి బాట పడుతుంది. అదే జరిగితే భారత్ ఫైనల్స్ ఆడేందుకు మార్గం సుగమం అవుతుంది.
# ఒకవేళ పాకిస్థాన్, శ్రీలంక జట్లు రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచి ఫైనల్ రేసులో నిలిస్తే? అప్పుడు నెట్‌ రన్‌రేట్ కీలకం కానుంది. కాబట్టి భారత్ తాను ఆడబోయే రెండు మ్యాచ్‌ లలో భారీ తేడాతో గెలవడం ముఖ్యం.


End of Article

You may also like