బిగ్ బాస్ తెలుగు-6 లో “గీతూ” ఎలిమినేషన్ ఎపిసోడ్ కి వచ్చిన టీఆర్పీ ఎంతో తెలుసా ..?

బిగ్ బాస్ తెలుగు-6 లో “గీతూ” ఎలిమినేషన్ ఎపిసోడ్ కి వచ్చిన టీఆర్పీ ఎంతో తెలుసా ..?

by Anudeep

Ads

బిగ్ బాస్ సీజన్-6 తెలుగు నుంచి గలాట గీతు ఎలిమినేట్ అయ్యింది. ఫస్ట్ వారం నుంచి తన అత్యుత్సాహంతో బిగ్‌బాస్ హౌస్‌లో అందరి చూపు తన వైపు తిప్పుకున్న ఈ చిత్తూరు అమ్మాయి.. అనూహ్య రీతిలో ఎలిమినేట్ అయ్యింది.కానీ.. గత రెండు వారాల నుంచి ఆమె హద్దులు దాటి చివరికి మూల్యం చెల్లించుకుంది.

Video Advertisement

వాస్తవానికి బిగ్‌బాస్ హౌస్ నుంచి గలాట గీతు ఇంత తొందరగా ఎలిమినేట్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. గత 8 వారాలు ఆమెకి వచ్చిన ఓట్లతో ఫస్ట్‌లోనే నామినేషన్ నుంచి సేవ్ అవుతూ వచ్చింది. దాంతో ఆమె కూడా స్వతహాగా తనపై అంచనాలు పెంచేసుకుంది. నేను టాప్-5లో ఉండమేంటి? బిగ్‌బాస్ విన్నర్ అంటూ పోజులు కొట్టింది.ఈ క్రమంలో నాగార్జునకి కౌంటర్లు వేయడంతో పాటు బిగ్‌బాస్ ఆదేశాల్ని పట్టించుకోని స్థాయికి ఆమె అహంకారం చేరిపోయింది. గలాట గీతు కారణంగా మిగిలిన హౌస్‌మెట్స్ గేమ్ కూడా పాడైంది. దాంతో విసిగెత్తిపోయిన ప్రేక్షకులు గలాట గీతుని సాగనంపేశారు.

huge TRP for ggeethu eliminatio episode..
ఎలిమినేషన్ తర్వాత గలాట గీతు చాలా ఎమోషనల్ అయిపోయింది. నేను బిగ్‌బాస్ హౌస్‌ని వీడి వెళ్లలేను అంటూ శోకాలు పెట్టింది. దాంతో నాగార్జున ఆమెని చాలాసేపు కన్విన్స్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ గీతు మాత్రం అలానే ఏడుస్తూ స్టేజ్‌పై ఉండిపోయింది. చివరికి బిగ్‌బాస్ టీమ్ వచ్చి ఆమెని స్టేజ్ నుంచి తీసుకెళ్లాల్సి వచ్చింది.

huge TRP for ggeethu eliminatio episode..

ఇదిలా ఉంటే గడిచిన సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ పెద్ద సక్సెస్ కాదనే చెప్పాలి..కానీ గత కొద్ది రోజుల నుండి టాస్కులు ఆసక్తికరంగా ఉండడం తో టీఆర్పీ రేటింగ్స్ పెరుగుతూ వచ్చింది. సీజన్ 6 ప్రారంభం ఎపిసోడ్ కి కేవలం 7 టీఆర్ఫీ రేటింగ్స్ మాత్రమే వచ్చాయి కానీ మొన్న గీతూ ఎలిమినేట్ అయినా ఎపిసోడ్ కి అయితే ఏకంగా 14 టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చినట్టు సమాచారం..ఈ సీజన్ లో ప్రసారమైన అన్ని ఎపిసోడ్స్ కంటే డబుల్ మార్జిన్ అన్నమాట.

huge TRP for ggeethu eliminatio episode..
గీతూ హౌస్ లో ఉన్నవారిలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవ్వడం తో పాటు..ఆమె ఎలిమినేట్ అవుతున్న సమయం లో ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు వెక్కి వెక్కిమరీ ఏడవడం అందరి హృదయాల్ని కలిచివేసింది. బిగ్ బాస్ హిస్టరీ లో ఏ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యినప్పుడు కూడా ప్రేక్షకులు ఇంతలా బాధపడలేదు..ఏ కంటెస్టెంట్ కూడా గుండెలు బాదుకుంటూ గీతూ లాగ ఏడవలేదు కూడా..అందుకే ఆ ఎపిసోడ్ కి ఆ స్థాయి టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయి అంటున్నారు విశ్లేషకులు.


End of Article

You may also like