Ads
2023 వన్డే ప్రపంచ కప్ లో టీమిండియా అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తుంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్ లలో ఎనిమిది నెగ్గి టేబుల్లో మొదటి ప్లేస్ లో నిలబడింది. తన చివరి లీగ్ మ్యాచ్ నవంబర్ 12న నెదర్లాండ్స్ తో ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ గెలవడం భారత్ కి నల్లేరు మీద నడకే కానీ ఆ తర్వాత అసలు గండం పొంచి ఉంది.
Video Advertisement
2015 వన్డే ప్రపంచ కప్ నుంచి కూడా టీమిండియాను సెమీస్ గండం వెంటాడుతుంది. వన్డే టి20 ప్రపంచ కప్ లలో టీమిండియాకు సెమిస్ సమస్య వెంటాడుతూనే ఉంది. 2015 ప్రపంచ కప్పులో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడింది. ఇక 2019లో అయితే న్యూజిలాండ్ చేతిలో ఓడింది.
2016 టి20 ప్రపంచ కప్పులో భాగంగా జరిగిన సెమీస్ లో వెస్టిండీస్ చేతిలో ఓడింది.ఇక 2022 టి20 ప్రపంచ కప్ లో అయితే ఇంగ్లాండ్ చేతిలో ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది.ఇదే విషయం ఇప్పుడు భారత అభిమానులను కలవరపెడుతుంది.వన్డే ప్రపంచ కప్ ను భారత సొంతం చేసుకోవాలంటే సెమీస్ గండాన్ని దాటాల్సి ఉంది. లీగ్ స్టేజిలో వరుసపెట్టిన నెగ్గిన కూడా సెమీస్ లేదా ఫైనల్ లో ఓడితే కష్టాన్ని మొత్తం బూడిదలో పోసినట్లు అవుతుంది అని భావిస్తున్నారు.
గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని సెమీస్ లో టీమిండియా అదరగొట్టాల్సి ఉంది లేదంటే మాత్రం మరోసారి భారత అభిమానులకు నిరాశ తప్పదు. ముఖ్యంగా ఒత్తిడిలో చిత్తయ్యే లక్షణం నుండి టీమిండియా బయట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.టీమిండియా సెమిస్ లో నెగ్గి ఫైనల్ కు చేరి కప్పు కొట్టాలని 150 కోట్ల భారత అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందరి కలను నిజం చేసే విధంగా రోహిత్ సేన సమాయత్తం కావాలని ఆకాంక్షిస్తున్నారు. టీమంతా అద్భుత ప్రదర్శనలో రాణిస్తూ ఫామ్ లో ఉంది కాబట్టి… కప్పు కొట్టడం పెద్ద కష్టతరం ఏమి కాదు. కాకపోతే లీగ్ దశలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని సెమిస్ లోను ఫైనల్స్ లోనూ టీం కొనసాగించాల్సి ఉంటుంది.
Also Read:ఇదేందయ్యా ఇది…ఇలా కూడా అవుట్ అవుతారా.? బాంగ్లాదేశ్ వాళ్ళు ఇలా పగపట్టేసారు ఏంటి.
End of Article