పెళ్లి అనేది ఎవరికైనా ప్రత్యేకమే.. అయితే.. ఈ నూరేళ్ళ బంధం లోకి అడుగుపెట్టే ముందు.. ప్రతి ఒక్కరు తమతో జీవితాన్ని పంచుకోబోయే భాగస్వామి పై ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. వారి ఇష్టాలకు తగిన వారితోనే బంధాన్ని పంచుకోవడానికి ఇష్టపడుతారు. ఒకప్పుడు రెండో పెళ్లంటే చాలా మంది ఆలోచించే వారు కానీ.. ఇప్పుడు మనసుకు నచ్చిన తరువాత రెండో పెళ్లి అన్న విషయం గురించి ఎవరు అంతగా ఆలోచించడం లేదు. ఇంతకీ ఆ లిస్ట్ పై ఓ లుక్ వేయండి.

#1 శిఖర్ ధావన్- అయేషా

1 sikhar ayesha
ఇటీవలే శిఖర్ ధావన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. తనకంటే వయసులో పదేళ్లు పెద్దదైన అయేషా ముఖర్జీని శిఖర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెకు ఇద్దరు కూతుర్లు కూడా ఉన్నారు. ఆమె గురించి పూర్తి గా తెలుసుకున్న శిఖర్ ధావన్ ఆమెను ప్రేమించి పెళ్లాడాడు. అయేషా హర్భజన్ సింగ్ కు ఫ్రెండ్. ఆమె ను ఫేస్ బుక్ లో చూసిన శిఖర్ ఆమె గురించి తెలుసుకుని పెళ్లి చేసుకున్నాడు.

#2 మురళి విజయ్ – నిఖితా

2 murali vijay nikhitha
ఈయన లవ్ స్టోరీ రూటే సెపరేటు.. విలన్ టైపు లవ్ స్టోరీ. మురళి విజయ్, దినేష్ కార్తీక్ లు మంచి స్నేహితులు. తరచూ దినేష్ ఇంటికి వస్తూ.. వెళ్తూ ఉండే మురళి విజయ్ దినేష్ భార్య నికిత తో అక్రమ సంబంధం ఏర్పరుచుకున్నారు. అయితే..ఈ సంగతి తెలుసుకున్న దినేష్ నిఖితా కు విడాకులు ఇచ్చేసాడు. ఆ తరువాత నిఖిత, మురళి విజయ్ లు పెళ్లి చేసుకున్నారు.

#3 మహ్మద్ షమీ- హసీనా:

3 shami hasina
వీరి స్టోరీ కొంచం డిఫరెంట్.. మహ్మద్ షమీ ను పెళ్లి చేసుకునేటప్పటికే హసీనా కు పెళ్లి అయింది. వీరిద్దరూ 2014 లోనే పెళ్లి చేసుకున్నారు. అప్పటికీ హసీనా కు పెళ్లి అయినా ఆ విషయం షమీ కి చెప్పలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ గొడవల కారణం గానే వీరిద్దరూ ప్రస్తుతం దూరం గా ఉంటున్నారు. హసీనా మొదటి భర్త కూరల వ్యాపారం చేసేవారట. అతని తో ఆమెకు ఒక కుమార్తె కూడా ఉందట.

#4 అనిల్ కుంబ్లే-చేతన:

4 anil kumble chetana
అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా పేరు పొందిన అనిల్ కుంబ్లే కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. ఆయన 1999 లో అప్పటికే పెళ్లి అయ్యి ఓ కూతురు కూడా ఉన్న చేతనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. అప్పటికే చేతనా తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఇద్దరు కూతుర్లు, ఓ కొడుకు ఉన్నారు.

#5 వెంకటేష్ ప్రసాద్:

5 venkateswara prasad jayanthi
ఈయన మాజీ ఇండియన్ క్రికెటర్. వెంకటేష్ ప్రసాద్ కూడా 1997 లో జయంతి ని రెండో పెళ్లి చేసుకున్నారు. అప్పటికే జయంతి భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరి గా ఉంటోంది. ఆమెను అనిల్ కుంబ్లే నే వెంకటేష్ ప్రసాద్ కు పరిచయం చేశారట. వీరి పరిచయం ప్రేమ గా మారి.. ప్రస్తుతం 24 ఏళ్ల వివాహ బంధం తో హ్యాపీ గా ఉన్నారు.