సచిన్ తో పాటే క్రికెట్ లోకి అడుగు పెట్టిన ఈ క్రికెటర్ ఎవరో తెలుసా.? ఆటపై అసహ్యం పెంచుకొని..భార్యతో.?

సచిన్ తో పాటే క్రికెట్ లోకి అడుగు పెట్టిన ఈ క్రికెటర్ ఎవరో తెలుసా.? ఆటపై అసహ్యం పెంచుకొని..భార్యతో.?

by Anudeep

Ads

క్రికెట్ అంటే ఇండియాలో ఒక ఆట మాత్రమే కాదు అది ఒక ఎమోషన్. వందకోట్ల భారతీయులను ఏకతాటిపైకి తెచ్చే శక్తి క్రికెట్ కు ఉంది. ఇండియా.. ఇండియా.. అనే నినాదాలతో స్టేడియంలో అభిమానులు చొక్కాలు చించుకొంటారు. మన దేశంలో క్రికెట్ ఇష్టపడని వారు చాలా అరుదు. చిన్న పిల్లాడి నుంచి పండు ముసలి వరకు అందరూ క్రికెట్ ప్రేమికులే. కానీ ఒక అంతర్జాతీయ స్థాయి క్రికెట్ ఆటగాడు అయ్యుండి, ఆటను అససహ్యించుకున్నాడు అంటే మీరు నమ్మగలరా!? ఆ ఆటగాడు ఎవరు, ఏంటీ అనే వివరాల్లోకి వెళ్తే..

Video Advertisement

టీం ఇండియాలో బౌలర్లకు కొదవలేదు. నాటి కపిల్ దేవ్ నుంచి నేటి బుమ్రా వరకు అనేక మంది జట్టుకు తమ సేవలందించారు. 1970 నుంచి నేటి వరకు ఎంతో మంది ఫాస్ట్ బౌలర్లు వచ్చారు వెళ్లారు. కానీ కొంతమంది ఎంత వేగంగా వచ్చారో అంతే వేగంగా వెను దిరిగారు. ఆ కోవకే చెందిన వాడే.. టీమిండియా మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ సలీల్‌ అంకోలా.

సలీల్‌ అంకోలా.. ముంబై నుంచి వచ్చిన టాప్‌ పేస్‌ బౌలర్‌. భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అరంగేట్రం చేసిన 1989వ సంవత్సరంలోనే సలీల్‌ అంకోలా కూడా అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరపున ఒక టెస్టు, 20 వన్డేలు మాత్రమే ఆడిన సలీల్‌ అంకోలా 1997లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.

ఇటీవల క్రిక్‌బజ్‌ (Cricbuzz) కు ఇచ్చిన ఇంటర్య్వూలో సలీల్‌ అంకోలా క్రికెట్‌పై అసహ్యం ఎలా ఏర్పడిందో వివరించాడు. ”1989లోనే దిగ్గజం సచిన్‌ తో పాటే అరంగేట్రం చేసినప్పటికి పెద్దగా అవకాశాలు రాలేదు. కారణం నా బౌలింగ్‌ నచ్చకనో మరేంటో తెలియదు. నాకు వచ్చిన అవకాశాలను కూడా సరిగా ఉపయోగించుకోలేకపోయాను.

ఆ తర్వాత ఎనిమిదేళ్లలో ఎన్నోసార్లు జట్టులోకి రావడం, వెళ్లడం జరిగింది. టీమిండియాలో చోటు దక్కకపోతే.. టీమిండియా-ఏ కి ఎంపికయ్యేవాడిని. ఎక్కడికి వెళ్లినా నా పని మాత్రం ఒకటే. మైదానంలో కంటే డ్రింక్స్‌ బాయ్‌గానే ఎక్కువగా సేవలందించాను. ఒక దశలో క్రికెట్‌పై విపరీతమైన అసూయ పుట్టుకొచ్చింది. అందుకే వెంటనే క్రికెట్‌కు రిటైర్మెంట్‌కు ప్రకటించాను.

2001 తర్వాత పూర్తిగా క్రికెట్‌కు దూరమయ్యాను. అప్పట్లో మ్యాచ్‌లను టెలికాస్ట్‌ చేసిన సోనీ చానెల్‌ నుంచి కామెంటేటర్‌గా విధులు నిర్వర్తించాలంటూ నాకు జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. దానిని నేను తిరస్కరించాను. కానీ ఎందుకు చేశానో తెలియదు. ఇప్పుడు అది తలుచుకుంటే బాధేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

మరోవైపు అంకోలా వ్యక్తిగత జీవితం కూడా అంత సాఫీగా ఏం సాగలేదు. 2010లో మొదటి భార్యతో విడాకుల అనంతరం సలీల్‌ అంకోలా తాగుడుకు బానిసయ్యాడు. ఎవరిని గుర్తు పట్టలేనంతగా తాగుతుండే వాడు. అతని ప్రవర్తనతో విసిగిపోయిన రెండో భార్య సలీల్‌ను రీహాబిలిటేషన్‌ సెంటర్‌కు పంపించింది. దాదాపు 10 ఏళ్ల పాటు రీహాబిలిటేషన్‌లో ఉన్న సలీల్‌ అంకోలా మాములు మనిషిగా తిరిగొచ్చాడు. నూతన జీవితం ప్రారంభించాలనుకున్నాడు.  ఏ క్రికెట్‌పై అయితే అసూయపడ్డాడో దానిలోనే అడుగుపెట్టాడు. గతేడాది ముంబై క్రికెట్‌కు చీఫ్‌ సెలెక్టర్‌గా ఎంపికయ్యి సేవలందిస్తున్నాడు.


End of Article

You may also like