సెమి ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాజయం పాలైన టీమ్ ఇండియా వరల్డ్ కప్ రేస్ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్ అడుగు పెడుతుందని అభిమానులు ఆశించినా అది నిజం కాలేదు. మరోసారి పొట్టి టైటిల్ గెలిచే సువర్ణవకాశాన్ని చేజేతులారా చేజార్చుకుంది. పేలవ బౌలింగ్‌తో ఇంగ్లండ్ ముందు తలొంచాక తప్పలేదు.

Video Advertisement

టైటిల్ తెస్తుందనుకున్న భారత్.. ఉట్టి చేతులతోనే స్వదేశానికి తిరుగు పయనమవ్వడం భారత అభిమానులను కలిచివేసింది. అయితే మ్యాచ్ తర్వాత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

indian players who are going to retire after the loss
ప్రపంచ కప్లో టీం ఇండియా ఓటమి నేపథ్యం లో పలువురు సీనియర్ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి అని గవాస్కర్ తెలిపాడు. అలాగే రోహిత్ స్థానం లో అల్ రౌండర్ హార్దిక్ పాండ్య టీం ఇండియా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

indian players who are going to retire after the loss

“ఐపీయల్ లో గుజరాత్ టైటాన్స్ సారధిగా తొలి ప్రయత్నం లోనే విజేతగా నిలిపిన పాండ్య.. తప్పకుండా నెక్స్ట్ కెప్టెన్ అవుతాడు. జట్టులో 35 ఏళ్ళు దాటిన ఆటగాళ్లు రిటైర్మెంట్ యోచనలో ఉన్నారు. త్వరలోనే ఈ నిర్ణయాలు వెలువడే అవకాశాలున్నాయి.” అని గవాస్కర్ తెలిపాడు.

indian players who are going to retire after the loss
ఈ నేపథ్యం లో రిటైర్మెంట్ ప్రకటించే ఆటగాళ్లలో ప్రముఖంగా ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, దినేష్ కార్తిక్ పేర్లు వినిపిస్తున్నాయి. మరో వైపు రిటైర్మెంట్ వార్తల నేపథ్యం లో కెప్టెన్ రోహిత్ శర్మ, కింగ్ కోహ్లీ అభిమానులు కలవర పడుతున్నారు. జట్టులో ఉన్న వారిలో రోహిత్‌, అశ్విన్‌, కార్తీక్‌, కోహ్లీ, షమీ, భువీలు 30 ఏళ్ల వయసు దాటారు.