Ads
ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్ 16వ సీజన్ గ్రాండ్ గా ముగిసింది. ఐపీఎల్ 2023 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌లో మ్యాచ్ లో చెన్నై జట్టు 5 వికెట్ల తేడాతో గుజరాత్ జట్టు పై విజయం సాధించింది.
Video Advertisement
డెవాన్ కాన్వే 25 బాల్స్ లో 47 రన్స్ చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో కెప్టెన్ ధోనీ అత్యధిక ఐపీఎల్ టైటిళ్లను సాధించిన ప్లేయర్స్ లో రోహిత్ శర్మను సమం చేశాడు. ఇక ఇతర జట్లు మరియు ప్లేయర్స్ ప్రత్యేక అవార్డులను పొందారు. అయితే ఎవరెవరికి ఏ అవార్డు వచ్చిందో ఇప్పుడు చూద్దాం..
ఐపీఎల్ ప్రైజ్‌మనీ మొత్తం:
రూ. 46 కోట్ల, 50 లక్షలు
- విజేతగా నిలిచిన జట్టుకి : రూ. 20 కోట్లు(చెన్నై సూపర్ కింగ్స్)
- రన్నరప్ గా నిలిచిన జట్టుకు: రూ. 13 కోట్లు(గుజరాత్ టైటాన్స్)
- మూడో స్థానంలో ఉన్న జట్టుకి : రూ. 7 కోట్లు (ముంబై ఇండియన్స్)
- నాలుగో స్థానంలో ఉన్న జట్టుకి : రూ. 6 కోట్ల 50 లక్షలు (లక్నో సూపర్ జెయింట్స్)
ఆరెంజ్ క్యాప్ (అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్) :
శుబ్‌మన్ గిల్ (17 మ్యాచ్‌లు: 890 పరుగులు) సెంచరీలు: 3, హాఫ్ సెంచరీలు: 4
ఐపీఎల్ టోర్నీలో ఆరెంజ్ క్యాప్ సాధించిన తక్కువ వయస్కుడిగా శుబ్‌మన్ గిల్ (23 ఏళ్ల 263 రోజులు) రికార్డ్ సృష్టించాడు.
ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు
పర్పుల్ క్యాప్ (అత్యధిక వికెట్లు తీసిన బౌలర్) :
మొహమ్మద్ షమీ (17 మ్యాచ్‌లు: 28 వికెట్లు)
ప్రైజ్‌మనీ: రూ. 15 లక్షలు
ఇతర అవార్డులు, ప్రైజ్‌మనీ:
మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు)
సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్: గ్లెన్ మాక్స్‌వెల్ (ఆర్సీబీ- రూ. 10 లక్షలు)
గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు)
లాంగెస్ట్ సిక్స్ ఆఫ్ ది సీజన్ : ఫాఫ్ డుప్లెసిస్ (రూ. 10 లక్షలు)
క్యాచ్ ఆఫ్ ది సీజన్: రషీద్ ఖాన్ (రూ. 10 లక్షలు)
సీజన్‌లో అత్యధిక ఫోర్లు: శుబ్‌మన్ గిల్ (రూ. 10 లక్షలు)
ఫెయిర్ ప్లే అవార్డు: ఢిల్లీ క్యాపిటల్స్
ఉత్తమ పిచ్, గ్రౌండ్ ఆఫ్ ది సీజన్: వాంఖడే స్టేడియం, ఈడెన్ గార్డెన్స్ (రూ. 50 లక్షలు)
Also Read: పైసా వసూల్ పెర్ఫార్మెన్స్ అంటే వీళ్లదే … IPL 2023 లో తీసుకున్న డబ్బులకు న్యాయం చేసిన 3 ప్లేయర్స్.!
End of Article