Ads
ఐపీఎల్ 17వ సీజన్ రేపు మొదలవుతుంది. ఎంతో ఘనంగా ఈ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ సీజన్ లో జరిగే మొదటి మ్యాచ్ ఆడడం ఇది తొమ్మిదవ సారి. గత సంవత్సరం కూడా ఐపీఎల్ మొదలైనప్పుడు మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడింది. ఈసారి డెసిషన్ రివ్యూ సిస్టం (DRS) కి బదులు స్మార్ట్ రిప్లై సిస్టం (SRS) ఉపయోగించాలి అని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఎంపైరింగ్ నిర్ణయాల్లో లోపాలు జరుగుతున్నాయి. వాటిని సరిదిద్ది, రివ్యూ సిస్టంని మరింత ట్రాన్స్పరెంట్ చేయడానికి మాత్రమే బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకుంది.
Video Advertisement
స్మార్ట్ రిప్లై సిస్టం ద్వారా ఫలితాలు మరింత వేగంగా వస్తుంది. అంతే కాకుండా, ఇందులో వచ్చే ఫలితాలు డెసిషన్ రివ్యూ సిస్టంతో పోలిస్తే ఇంకా కచ్చితంగా ఉంటాయి. దాంతో థర్డ్ ఎంపైర్ తన నిర్ణయాన్ని వెంటనే ప్రకటిస్తారు. డెసిషన్ రివ్యూ సిస్టంలో కొంత గందరగోళం ఉంటుంది. ఈసారి అది ఉండదు. స్మార్ట్ రిప్లై సిస్టంలో కూడా ఫీల్డ్ ఎంపైర్, థర్డ్ అంపైర్ కి నివేదిస్తారు. కానీ టీవీ డైరెక్టర్ ఇచ్చే ఇన్‌పుట్ గురించి థర్డ్ ఎంపైర్ వేచి చూడాల్సిన అవసరం ఈసారి ఉండదు. ఇందుకు కారణం హాక్-ఐ పరికరం. దీని ద్వారా వారే అప్పటికి అప్పుడు తీర్పుని ప్రకటించే అవకాశం ఉంటుంది. మ్యాచ్ లో ఇద్దరు హాక్-ఐ ఆపరేటర్లు ఉంటారు. టీవీ ఎంపైర్ వారి నుండి ఇన్‌పుట్‌లను తీసుకుంటారు.
Smart Review System for faster and more accurate reviews was a much needed technology intervention.
It's good to see @BCCI implementing this tech in #IPL2024 https://t.co/B3TE69egzB
— RiotsuAaGaya (@The_Nation_Hood) March 19, 2024
ఆపరేటర్లు, అంపైర్ ఒకటే గదిలో కలిసి పనిచేస్తారు. ఈ ఆపరేటర్ల పని హాక్-ఐ 8 హై స్పీడ్ కెమెరాలతో తీసిన ఫోటోలని అంపైర్ కి ఇవ్వడం. ఐపీఎల్ మ్యాచ్ మొత్తంలో 8 హాక్-ఐ కెమెరాలు ఉంటాయి. వికెట్ స్క్వేర్ తర్వాత 4 కెమెరాలు, బౌండరీ దగ్గర 4 కెమెరాలు ఉంటాయి. స్టంపింగ్, రన్ అవుట్, ఓవర్ త్రో, క్యాచ్ కి సంబంధించిన విషయాలు ఇందులో మరింత స్పష్టంగా చూసే అవకాశం ఉంది. ఎందుకంటే వీటికి సంబంధించిన ఫోటోలని ఈ కెమెరాలు సేకరిస్తాయి. ఈ కెమెరాలు ఒక్క సెకండ్ కి 300 ఫ్రేమ్స్ వేగంతో ఫోటోలు తీస్తాయి. సాధారణంగా అయితే థర్డ్ అంపైర్ కి, హాక్-ఐ ఆపరేటర్లకి మధ్యలో టీవీ డైరెక్టర్లు ఉంటారు.
కానీ ఈసారి అలా ఉండదు. స్మార్ట్ రిప్లై సిస్టం ద్వారా థర్డ్ ఎంపైర్ డిఫరెంట్ యాంగిల్స్ నుండి చూసే అవకాశం ఉంటుంది. హాక్-ఐ ఆపరేటర్లు స్ప్లిట్ స్క్రీన్ టెక్నాలజీ ఉపయోగిస్తారు. ఒకవేళ ఫీల్డర్ బౌండరీ లైన్ లో క్యాచ్ పడితే, కాలి భాగం వీడియోని, పాదంలో బౌండరీ లైన్ కి టచ్ అయిన భాగం ఏది అని స్ప్లిట్ స్క్రీన్స్ ద్వారా, కేవలం ఏ విషయం మీద అయితే స్పష్టత కావాలో, అది మాత్రమే చూసే అవకాశం ఉంది. అంతకుముందు టీవీ ఎంపైర్ కి ఇలాంటి సౌలభ్యాలు లేవు. దాంతో ఈసారి రిజల్ట్ డిక్లేర్ చేయడం అనేది మరింత సులువు అవుతుంది. ఒకవేళ ఈసారి స్మార్ట్ రిప్లై సిస్టం అనేది సఫలం అయితే, ముందు ముందు కూడా వచ్చే ఐపీఎల్ సీజన్స్ లో ఇదే ఉపయోగించే అవకాశం కూడా ఉంది. కానీ ఈసారి ఇది ఎలా పని చేస్తుంది అనేది వేచి చూడాల్సిందే.
The new system for #IPL2024 will have the TV umpire and Hawk-Eye operators in the same room, with more split screens, better frame rates and a less rigid process
▶️ https://t.co/vfiy8PbRn2 pic.twitter.com/F1T9trWBmV
— ESPNcricinfo (@ESPNcricinfo) March 19, 2024
ALSO READ : IPL 2024:రేపటి నుండే ఐపీఎల్ స్టార్ట్…CSK వైస్ RCB ఓపెనింగ్ మ్యాచ్ లో సందడి చేయబోయే 4 సెలబ్రిటీస్ వీరే.
End of Article