Home Bigg Boss 6 telugu బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ సారి ఒకరు కాదు ఇద్దరు..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

బిగ్ బాస్ తెలుగు-6 లో ఈ సారి ఒకరు కాదు ఇద్దరు..! కానీ ట్విస్ట్ ఏంటంటే..?

by Anudeep

సరికొత్త టాస్కులు.. మధ్యలో ఊహించని సంఘటనలు.. వారం చివర్లో ఎమోషనల్ ఎలిమినేషన్లు.. ఇలా ఎన్నో రకాలుగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఈ నేపథ్యంలో తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్‌ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

 

గతంలో కంటే బిగ్ బాస్ ఆరో సీజన్‌లో నామినేషన్స్ టాస్కులో ఎన్నో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే గత సోమవారం జరిగిన తొమ్మిదో నామినేషన్స్ టాస్కు కూడా రచ్చ రచ్చగానే సాగింది. ఇక, ఈ వారంలో ఇనాయా సుల్తానా, బాలాదిత్య, ఆది రెడ్డి, గీతూ రాయల్, కీర్తి భట్, శ్రీ సత్య, రేవంత్, జబర్ధస్త్ ఫైమా, మెరీనా అబ్రహం, రోహిత్‌ సాహ్నీలు ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు.

is there is double elimination in biggboss telugu season 6

తొమ్మిదో వారానికి సంబంధించిన ఓటింగ్ సోమవారం రాత్రి నుంచే అనూహ్యంగా సాగుతోంది. కానీ, మొదటి స్థానంలో మాత్రం టైటిల్ ఫేవరెట్ రేవంత్‌ అత్యధిక ఓటింగ్‌తో టాప్‌ ప్లేస్‌లో ఉన్నాడని తెలిసింది. ఈ వారం చాలా ట్విస్టులతో సాగిన ఓటింగ్‌తో కంటెస్టెంట్ల స్థానాల్లో మార్పులు కనిపించాయి.

is there is double elimination in biggboss telugu season 6

అయితే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. దీని ప్రకారం ఆది రెడ్డి, ఇనాయ సుల్తానా ఎలిమినతె అవుతారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తూ వీరిద్దరిలో ఒకరిని సీక్రెట్ రూమ్ లో ఉంచుతారని కూడా తెలుస్తోంది. ఒకరైనా.. లేక ఇద్దరినీ సీక్రెట్ రూమ్ లో ఉంచుతారా అన్నది కూడా సస్పెన్సు గానే ఉంది. దీనిలో నిజమెంతుందో తెలియాలంటే వీకెండ్ వరకు ఆగాల్సిందే..

You may also like