“గీతూ” కావాలనే ఇలా చేస్తోందా..? గేమ్ స్ట్రాటజీ ఇదేనా..?

“గీతూ” కావాలనే ఇలా చేస్తోందా..? గేమ్ స్ట్రాటజీ ఇదేనా..?

by Anudeep

Ads

టిక్ టాక్ లో కోట్స్ చెప్తూ.. యు ట్యూబ్ లో బిగ్ బాస్ రివ్యూ లు ఇస్తూ ఫేమస్ అయ్యింది గీతూ రాయల్. ఈ పాపులారిటీ ద్వారా ఈ టీవీ జబర్దస్త్ లో అవకాశం సంపాదించుకుంది. అలాగే ప్రస్తుతం మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టింది.

Video Advertisement

బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన మొదటి రోజు నుంచే గీతూ తన గేమ్ ను స్టార్ట్ చేసింది. నెల్లూరు, చిత్తూరు కలబోసిన స్లాంగ్ లో మాట్లాడుతూ రెచ్చిపోతోంది. హౌస్ మేట్స్ కి చుక్కలు చూపిస్తోంది.ఫస్ట్ డే వాష్ రూమ్ లో జుట్టు గురించి గొడవ చేసిన గీతూ, నెక్ట్స్ డే ఇనయా సుల్తానాను టార్గెట్ చేసింది.

is this the game strategy of geethu royal?
ట్రాష్ టీమ్ నుంచి బాలాదిత్యతో స్వాప్ అయ్యి నేరుగా క్లాస్ టీమ్ కి వచ్చిన గీతూ హౌస్ మేట్స్ తో పనులు చేయించుకుంటూ రెచ్చిపోతుంది. ఇనాయ సుల్తానా తో మరీ ఎక్కువ పనులు చేయించుకుంది. దువ్వెన తీసుకురమ్మని, నిమ్మరసం తెమ్మని పనులు చెప్పింది.

is this the game strategy of geethu royal?
పాటలు పాడు అంటూ యినయా కు ఆర్డర్ వేసింది. కానీ ఇనయా సుల్తానా నువ్వు పాడమంటే పాడటానికి నేను ఇక్కడికి రాలేదు అంటూ గట్టిగా సమాధానం చెప్పింది. ఇంట్లో పనులు చెప్తే చేస్తా కానీ, ఇలాంటివి నేను చేయను అని కౌంటర్ఇచ్చింది. ఇద్దరిదీ టామ్ అండ్ జెర్రీ వార్ లాగా హౌస్ లో చాలాసేపు నడిచింది. దీంతో హౌస్ లో అందరూ గీతూ చేష్టలని ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు.


అయితే, బిగ్ బాస్ చూస్తున్న ప్రేక్షకులు మాత్రం గీతూ కొద్దిగా అతి చేస్తోందని, గేమ్ ఆడటం బాగానే ఉన్నా, మాట్లాడే మాటలు బాలేదని అంటున్నారు. కొద్దిగా నోరు అదుపులో ఉంటే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు. అయితే, మరికొంతమంది బిగ్ బాస్ కి కంటెంట్ ఇవ్వాలంటే గీతులాగానే బిహేవ్ చేయాలని చెప్తున్నారు. గీతూ లాంటి అమ్మాయి ఉంటేనే ఎంటర్ టైన్మెంట్ ఉంటుందని, ఓపెన్ అయి గేమ్ బాగా ఆడుతోందని ఎప్రిషియేట్ చేస్తున్నారు. ఇంతకీ గీతూ కంటెంట్ ఇస్తోందా లేదా గొడవలు పడటమే స్ట్రాటజీ ప్లే చేస్తోందా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


End of Article

You may also like