Jagadhatri Serial: చెల్లెలికి క్షమాపణ చెప్పిన ధాత్రి.. తన వంటతో అందరికీ హడలెత్తించిన నిషిక! 

Jagadhatri Serial: చెల్లెలికి క్షమాపణ చెప్పిన ధాత్రి.. తన వంటతో అందరికీ హడలెత్తించిన నిషిక! 

by Harika

Ads

Jagadhatri serial: అందరికీ దగ్గరవమని చెప్తే నువ్వు ఇలా అందరినీ కొట్టి దూరమవుతున్నావు ఇలా అయితే పెత్తనం నీ చేతిలోకి ఎప్పుడు వస్తుంది అని మందలిస్తుంది నిషిక అత్త.

Video Advertisement

రాగిణి: నిన్ను అందరికీ తలలో నాలికలాగా ఉండి అందరి పనులు చేసి పెట్టమంటే ఇలా అందరితో గొడవ పడుతున్నావు ఇలా అయితే నీ చేతికి పెత్తనం ఎప్పుడు వస్తుంది. అందుకే ఇంట్లో అన్ని పనులు చేసి అందరికీ దగ్గర అవ్వు.

నిషి : అన్ని పనులు అంటే నావల్ల కాదు అంటుంది. కనీసం వంట చేసి అందరికీ పెట్టు అని తల్లి చెప్పడంతో అందుకు సరే అంటుంది.

మరోవైపు నిషిని కొట్టినందుకు బాధపడుతుంది ధాత్రి. చెల్లెలికి క్షమాపణ చెప్పాలి అంటుంది.

కేదార్: తను తప్పు చేసింది కాబట్టి కొట్టావు ఇందులో నీ తప్పేముంది.

ధాత్రి : తప్పు ఎవరిదైనా చిన్నప్పటినుంచి నేను తనని పెంచి పెద్ద చేశాను, ఎప్పుడు చేయి చేసుకోలేదు. తనని కొట్టినందుకు అందరికంటే నాకు ఎక్కువ బాధగా ఉంది అని చెప్పి భర్త చెప్తున్నా వినకుండా నిషి దగ్గరికి వెళ్లి సారీ చెప్తుంది.

 

నిషి: నన్ను కొట్టి సారీ చెప్తే తీరిపోతుందా నేను నిన్ను కొట్టి సారీ చెప్తాను నువ్వు ఒప్పుకుంటావా అంటుంది.

ధాత్రి: ఒక్క చెంప దెబ్బతో నీ కోపం చల్లారుతుంది అంటే నేను కొట్టించుకోవటానికి సిద్ధం, చిన్నప్పటినుంచి ఎన్నోసార్లు నీతో కొట్టించుకున్నాను కదా ఇప్పుడు కొట్టించుకోలేనా అంటుంది.

ధాత్రిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది నిషి. అది చూసిన కౌషికి ఆమెని కోప్పడుతుంది.

కౌషికి :  మీరు అసలు మనుషులేనా, నిన్ను కొట్టింది కాబట్టి నువ్వు తనని కొడుతున్నావు మరి నువ్వు కీర్తిని కొట్టావు నన్ను నిన్ను కొట్టమంటావా అని అడుగుతుంది.

ఆ మాటలకి ఒక్కసారిగా షాక్ అవుతారు నిషి, ఆమె తల్లి, అత్త. గొడవ పెద్దదవుతుంది వదిలేయమంటుంది ద్ధాత్రి.

కౌషికి : ఈ గొడవ ఇక్కడితో నేను మర్చిపోతున్నాను నువ్వు కూడా మర్చిపో ఇంకెప్పుడు ఇంట్లో గొడవలు జరగకూడదు వెళ్లి వంట పని చూడండి.

తల్లి మాటలు గుర్తుకు వచ్చి నేను వంట చేస్తాను అంటుంది నిషిక. అక్కడ ఉన్న వాళ్ళందరూ నువ్వు వంట చేయటం ఏంటి అని షాక్ అవుతారు. వైజయంతి కూడా అలాగే అనడంతో ఆమెని పక్కకి తీసుకు వెళుతుంది.

నిషి : ఇన్నాళ్లు పనికి భయపడే వంట చేయలేదు అందుకే పెత్తనం నా చేతికి రావడం లేదు. నేను వంట చేస్తాను బాగోకపోయినా బాగుంది అని చెప్పండి చాలు అని అత్తకు చెప్పి వంట ప్రారంభిస్తుంది.

 

ఆ తర్వాత అందరూ భోజనాల టేబుల్ దగ్గర కూర్చుంటారు.

నిషి : అందరూ భోజనానికి రెడీయే కదా.

బూచి: అదేదో యుద్ధానికి సిద్ధమా అన్నట్టు అడుగుతుంది అనుకుంటాడు.

వైజయంతి : ఇన్నాళ్లు నా కోడలికి వంటలు రావని ఎవరో అన్నారు కదా చూడండి ఇప్పుడు ఎన్ని వంటలు చేసిందో అంటుంది.

ఆ వంటని ముందుగా కాచి తింటుంది ఆమె ఎక్స్ప్రెషన్ చూసి అందరికీ ఆ భోజనం బాగోలేదు అని అర్థమవుతుంది.

బూచి: మామూలుగా అయితే కాచి ఎలా ఉన్నా తినేస్తుంది దానికి కూడా నచ్చలేదంటే నేను భోజనం చేసే ధైర్యం చేయను అని టాబ్లెట్ వేసుకోవాలి అని నేపంతో అక్కడినుంచి వెళ్ళిపోబోతాడు.

అలాగే భోజనం చేసిన ప్రతి ఒక్కరూ భోజనం నచ్చక, బాగోలేదని చెప్పలేక ఏదో ఒక వంకతో అక్కడినుంచి వెళ్ళిపోబోతుంటే అప్పుడే కౌషికి అక్కడికి వస్తుంది.

కౌషికి : అందరం కలిసి భోజనం చేస్తాం కదా వచ్చి కూర్చోండి అనడంతో ఏమీ అనలేక అందరు టేబుల్ దగ్గర కూర్చుంటారు.

అప్పుడు కీర్తి భోజనం నోట్లో పెట్టుకుని బాగోలేదు అని చెప్తుంది. ముందు నేర్చుకొని తర్వాత వంట చేయాలి అని నిషి తో అంటుంది. ఇప్పుడు వంట చేసే టైం లేదు కాబట్టి అందరం రెస్టారెంట్ కి వెళ్లి భోజనం చేద్దాము  అంటుంది.

నిషి: నేను ఇంత కష్టపడి వంట చేస్తే భోజనం చేయకుండా వెళ్ళిపోతే ఎలా అని అందర్నీ భోజనం చేయమంటుంది.

ధాత్రి : నేను నీకు వంట మెల్లిగా నేర్పిస్తాను ఇప్పుడు మాత్రం అందరూ ఆకలితో ఉన్నారు వెళ్ళనివ్వు అంటుంది.


End of Article

You may also like