తెలంగాణ ప్రజా సమస్యలకి వేదికగా నిలిచిన “బట్టి పాదయాత్ర”

తెలంగాణ ప్రజా సమస్యలకి వేదికగా నిలిచిన “బట్టి పాదయాత్ర”

by Jyosthna Devi

Ads

తెలంగాణను కాంగ్రెస్ మేనియా కమ్మేసింది. కాంగ్రెస్ శ్రేణులు రాష్ట్రం నలుమూలల నుంచి జనగర్జన సభకు హోరెత్తుతున్నారు. ఇప్పటికే సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేసారు. కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ రానుండ‌డంతో రాష్ట్రంలోని అన్ని దార్లు ఖ‌మ్మం న‌గ‌రం వైపే ప‌రుగులు తీస్తున్నాయి. అగ్ర‌నేత రాహుల్ గాంధీనే భ‌ట్టి విక్ర‌మార్క పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర ముగింపు స‌భకు హాజ‌రవుతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. సుమారు ఐదారు ల‌క్ష‌ల‌ మందితో జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌నే ల‌క్ష్యంతో అన్ని సిద్ధం చేశారు. ఈ సభలో పార్టీలో చేరికలు, భట్టికి రాహల్ గాంధీ సన్మానంతో పాటుగా ప్రజలకు కాంగ్రెస్ తరపున స్పష్టమైన హామీలు ప్రకటించనున్నారు.

Video Advertisement

Telangana Congress Unit Trouble Intensifies; 13 Leaders Resign From Party Posts

భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ఇప్ప‌టికే రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 నియోజ‌క‌వ‌ర్గాల మీదుగా 1360 కిలోమీట‌ర్లు పూర్తి చేసుకుంది. భ‌ట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రెస్ పార్టీలో కొత్త జోష్ కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో కేసీఆర్ ఏకచ్ఛత్రాధిపత్య రాజకీయాలకు భ‌ట్టి విక్ర‌మార్క భరత వాక్యం పలికాడని రాజ‌కీయ వ‌ర్గాల్లో ఇప్ప‌టికే బ‌లంగా వినిపిస్తోంది. కాంగ్రెస్ ఎక్కడుందీ అన్న నోటి నుంచే హస్తం పార్టీనే ఇంకా బలంగా ఉందనిపించాడు. కారులో ఉక్కపోతకు గురవుతున్న నేతలకు, భవిష్యత్ లేక, అవకాశాలు రాని ఇతర పార్టీ నాయకులు కాంగ్రెస్ ను ఒక బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలిపాడు. దీంతో కాంగ్రెస్ లో చేరేందుకు నాయకులంతా ఆసక్తి చూపుతున్నారు. కేసీఆర్ మీద వ్యతిరేకత లేదన్న నోళ్లే ఇప్పడు పీపుల్స్ మార్చ్ పాదయాత్ర తరువాత కేసీఆర్ కు ఇంక కష్టమే అనిపించడంలో భట్టి విక్ర‌మార్క తిరుగులేని విధంగా స‌క్సెస్ అయ్యాడు.

Chhattisgarh gears up for Congress's 85th plenary session. What's on platter? - India Today

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ కు ముందు – వెనుక అనేలా మార్చేశారు. మొత్తం రాష్ట్ర రాజకీయ యంత్రాంగమంతా తన చుట్టూ తిరిగేలా చేసుకోవడంలో భట్టి తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఇంత వరకూ ఎవరూ పలకరించని నిరుపేద వర్గాలను భట్టి విక్రమార్క నేరుగా కలవడం విశేషం. పీపుల్స్ మార్చ్ పాద‌యాత్ర‌తో సీఎల్పీ నేత భ‌ట్టి విక్ర‌మార్క లేటెస్ట్ ట్రెండింగ్ గా నిలిచారు. పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ఎన్నో సంచలనాలకు..మరెన్నో ప్రజాసమస్యను గుర్తించ‌డానికి వేదికగా నిలిచింది. ఇప్పటి వరకూ ఎవరూ క‌న్నెత్తి చూడ‌డానికి కూడా సాహసించని ప్రాంతాల్లో ప్రయాణిస్తూ, స్వ‌తంత్ర తెలంగాణ రాజ‌కీయాల‌కు ఒక చుక్కానిలా మారాడు. ఆదిలాబాద్ జిల్లా మొద‌లుకుని రాష్ట్ర‌వ్యాప్తంగా భట్టి పాద‌యాత్ర‌తో కాంగ్రేస్ మేనియా మొద‌లైంది. తాజాగా ఖ‌మ్మం న‌గ‌రంలో త‌ల‌పెట్టిన జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌తో భట్టి విక్ర‌మార్క నామ‌స్మ‌రణం హోరెత్తుతున్నది.

 

ఏఐసీసీ అగ్ర‌నేత రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌వుతున్న జ‌న‌గ‌ర్జ‌న స‌భ‌ కోసం ఖ‌మ్మం న‌గ‌రం అందంగా ముస్తాబైంది. ఖ‌మ్మం న‌గ‌రంలో అడుగ‌డుగునా మూడు రంగుల జండాలే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. ఎటు చూసినా కాంగ్రెస్ ఫ్లెక్సీలతో సుంద‌రంగా మారింది. ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన‌ కాంగ్రెస్ జెండాలు, హోర్డింగ్ ల‌తో అలంకరించారు. ప‌ట్ట‌ణంలో ప్ర‌ధాన ర‌హదారులు, చౌర‌స్తాలు, కూడ‌ళ్లు, విద్యుత్ స్థంభాల‌ను కూడా కాంగ్రెస్ పార్టీ జెండాలు, ఫ్లెక్సీల‌తో అత్యంత సుంద‌రంగా అలంక‌రించారు. ప‌ట్ట‌ణంలో దాదాపు 45 అడుగుల కటౌట్స్, 20×20 అడుగుల స‌ర్కిల్ హోర్డింగ్ లు, భారీ క‌టౌట్ లు, పెద్ద‌పెద్ద బెలూన్స్ ఎగ‌రేశారు. రాహుల్ కు యూత్ కాంగ్రెస్ భారీ ద్విచక్ర వాహన ర్యాలీతో స్వాగతం పలకనుంది. ఈ సభ వైపే ఇప్పుడు యావత్ తెలంగాణ ఆసక్తిగా చూస్తోంది.


End of Article

You may also like