Ads
నిన్నటి ఎపిసోడ్ లో సౌందర్య ని తలపై కొట్టి హైదరాబాద్ కి పార్సెల్ చేసి పంపిస్తుంది మోనిత. డోర్ దగ్గరున్న రక్తపు మరకలను చూసి ఎం జరిగింది అని కార్తీక్ అడగ్గా.. ఎదో చెప్పి కవర్ చేస్తుంది మొన్నిత. మరో వైపు వాళ్ళ నాన్నమ్మ వస్తే సారీ చెప్పి వెళ్ళిపోదాం అని ఏమి తినకుండా ఎదురు చూస్తుంటుంది శౌర్య.. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం..
Video Advertisement
సౌర్య ముందు ఇడ్లీ, వడ ఉంటాయి. కానీ తినకుండా సౌందర్య కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. ‘ఏదో ఒకటైనా తినమ్మా.. ఏడవద్దు’ అంటూ నచ్చజెబుతుంది. మనసులో.. ‘ఈ గండా ఎక్కడికిపోయాడో.. త్వరగా వస్తే.. ఆవిడ(సౌందర్య) రాకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోయేవాళ్లం కదా’ అనుకుంటూ ఉంటుంది చంద్రమ్మ. ఇంతలో ఇంద్రుడు రావడం చూసిన చంద్రమ్మ ఇంద్రుడికి ఎదురు వెళ్తుంది. సౌర్యకు కనిపించకుండా పక్కకు తీసుకుని వెళ్తుంది. ఇంద్రుడు వచ్చిన విషయం కూడా సౌర్యకు తెలియదు. ‘జ్వాలమ్మ ఇప్పుడు మనతో రాను అంటోంది గండా.. ఆవిడ వచ్చాక ఆవిడకు క్షమాపణలు చెప్పి.. తిరిగి బయలుదేరదాం’ అంటుంది చంద్రమ్మ.
‘సరే నువ్వు ముందు వెళ్లు నేను కాసేపు ఆగి వస్తాను’ అంటాడు ఇంద్రుడు. సరే అని చంద్రమ్మ వెళ్తుంది. వెంటనే సౌర్య.. ‘పిన్నీ నాన్నమ్మ వచ్చిందా?’ అంటుంది. ‘వస్తుదమ్మా.. కాసేపట్లో వచ్చేస్తుంది’ అంటూ సర్దిచెబుతుంది చంద్రమ్మ. ఇంతలో ఇంద్రుడు రావడం రావడమే.. ‘చంద్రమ్మా రెడీ అవ్వలేదా? లేట్ అవుతుంది వెళ్దాం పదా.. ఏంటి జ్వాలమ్మా నువ్వు ఇంకా తినలేదా’ అంటాడు కూల్‌గా.
బాబాయ్.. నాన్నమ్మ వచ్చాక వెళ్దాం’ అంటుంది సౌర్య. మీ నాన్నమ్మ రాదు’ అంటాడు ఇంద్రుడు. సౌర్య షాక్ అవుతుంది. ‘అదేంటి బాబాయ్ రాకపోవడం ఏంటీ?’ అంటుంది కంగారుగా. ‘వస్తుంది బాబాయ్.. మా నాన్నమ్మ మాటంటే మాటే.. తను వచ్చాక సారీ చెప్పి.. ఇప్పుడు రాను కానీ సంక్రాంతికి వస్తాను అని చెబుతాను అంటుంది. ‘నాన్నమ్మ ఇప్పుడు రాను అని నాతో చెప్పిందమ్మా.. గతంలో మీ తాతయ్య వస్తే నీ మీద ఒట్టు పెట్టుకుని పంచించేశావ్ కదా.. ఇప్పుడు కూడా అలానే చేస్తావేమోనని తను భయపడింది. అందుకే నాతో.. తనకు నచ్చినప్పుడే పంపించండి అని చెప్పి వెళ్లిపోయింది’ అంటాడు ఇంద్రుడు.
తన ఇంట్లో కూర్చొని జరిగింది మొత్తం తలుచుకుని ఆలోచిస్తుంటుంది సౌందర్య. ఆనందరావు బాధగా పక్కన కూర్చుని ఉంటాడు. నన్ను తలపై కొట్టి స్పృహ కోల్పోయేలా చేసి హైదరాబాద్ శివారులో వదిలిపెట్టింది అంటే అది మామూలు ఆడది కాదు శౌర్య అన్న మాటలను బట్టి చూస్తే నిజంగానే కార్తీక్ దీప ఆ ఊర్లో ఉన్నారని నాకు అనిపిస్తోంది అంటుంది సౌందర్య. కార్తీక్,దీప లు బతికే ఉన్నారేమో కార్తీక్ మోనిత దగ్గర ఉండటం వల్ల నా తల పగలగొట్టిందేమో అంటూ ఆలోచనలో పడుతుంది సౌందర్య.
నన్ను చూసి కూడా మోనిత కంగారుపడింది అంటాడు ఆనందరావు. కేవలం కార్తీక్ కోసం మాత్రమే అలా ప్రవర్తిస్తుంది. గతం లో కూడా కార్తిక్ కోసం ఒకరిని చంపి జైలుకి వెళ్లి వచ్చింది. అందుకే కార్తిక్ ఆమె దగ్గరే ఉన్నాడని నా అనుమానం కూడా అంటదు ఆనంద రావు.
మరోవైపు మోనిత దేవుడికి దండం పెట్టుకుంటూ..అన్నీ అర్థమవుతున్నాయి కానీ కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చిందా లేదా అన్న విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాను ఈ ఒక్క విషయంలో క్లారిటీ ఇవ్వు అని అనుకుంటుంది..ఇంతలో దుర్గ వచ్చి మోనిత పక్కనే నిల్చుని దండం పెట్టుకుంటూ నాకు కూడా ఒక క్లారిటీ కావాలి స్వామి.. కార్తీక్ సార్ దీపమ్మ ఇంట్లో ఉండగా తాళం పగుల కొట్టావ్…కానీ బయటకు వచ్చిచూస్తే బయట రక్తంబొట్లు ఉన్నాయి తలుపులు పగులకొడితే రక్తం రాదు కదా..అంటే నువ్వు ఎవరి నెత్తో పగులకొట్టావ్ అని అడిగితే మోనిత తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది.
తర్వాత మోనిత ఏదో ఒకటి చేసి కార్తీక్ ను ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి లేదంటే సౌందర్య ఆంటీ వస్తే నాపనై పోతుందని అనుకుంటుంది. అప్పుడే ఎంట్రీ ఇచ్చిన శివ…ఆవిడను హైదరాబాద్ తీసుకెళ్లే వరకు నేను టెన్షన్ తో చచ్చిపోయాను మేడం అని అంటాడు. ఇంతకీ ఆవిడ ఎవరో చెప్పండి లేదంటే టెన్షన్ తో చచ్చి పోయేట్టున్నాను అని అడుగుతాడు. దీంతో మోనిత లక్ష రూపాయలు ఇచ్చి మరోసారి సౌందర్య టాపిక్ ఎత్తొద్దంటుంది.
అదే సమయానికి అక్కడికొచ్చిన ఎందుకు అతనికి అంత డబ్బు ఇస్తున్నావ్ అని అడుగుతాడు. కార్తీక్ ను డైవర్ట్ చేయాలనే ఆలోచనతో అసలు నీ అనుమానం ఏంటి..ఆ వంటలక్కని చంపేయమని ఇస్తున్నా అని చెబుతుంది. కార్తీక్ షాక్ అవుతాడు. దాంతో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
End of Article