క్రికెట్ వదిలేసి పెళ్లి చేసుకో.? మ్యాచ్ ఓడిపోయాక గర్ల్ ఫ్రెండ్ తో డిన్నర్ చేయడంతో “రాహుల్” పై ట్రోల్ల్స్.!

టీ20 వరల్డ్ కప్-2022 సెమీస్‌లో ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఘోర ఓటమిని భారత్ క్రికెట్ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈసారి కప్ ఖాయమనుకుంటే.. సెమీస్‌లో అత్యంత చెత్తగా ఆడి పరువు తీసుకున్నారంటూ ఆటగాళ్లపై మండిపడుతున్నారు. ముఖ్యంగా టోర్నమెంట్‌ మొదలైనప్పటి నుంచి కేఎల్‌ రాహుల్‌ని ట్రోల్‌ చేయని వాళ్లు లేరంటే అతిశయోక్తి కాదేమో..

టీ20 వరల్డ్‌ కప్‌ 2022 టోర్నమెంట్‌ ప్రారంభం నుంచి కేఎల్‌ రాహుల్‌ అతి పేలవ ప్రదర్శనతో అందరినీ నిరాశ పరిచిన విషయం తెలిసిందే. అసలు కేఎల్‌ రాహుల్‌కి ఎందుకు అవకాశం కల్పిస్తున్నారంటూ బీసీసీఐ, రాహుల్‌ ద్రవిడ్‌ లాంటివారిని ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరోసారి నెట్టింట రాహుల్‌పై విమర్శలు వినిపిస్తున్నాయి.

టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ తన గర్ల్‌ఫ్రెండ్‌ అథియా షెట్టితో కలిసి ఉన్న ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి. అథియా షెట్టి ఈ కీలక టోర్నీ సమయంలో రాహుల్‌ వెంట ఉండి, మద్దతు ఇచ్చేందుకు ఆస్ట్రేలియా టూర్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. తాజాగా విరాట్ కోహ్లీ, టీమ్ ఇండియా కోచ్ రాహుల్ ద్రవిడ్‌లతో కలిసి కేఎల్ రాహుల్, అథియా షెట్టి జంట ఓ రెస్టారెంట్‌లో భోజనం చేస్తుండగా క్లిక్ మనిపించిన ఫొటోలో బయటకొచ్చాయి.

సెమీస్ కి ముందు అడిలైడ్‌లోని బ్రిటిష్ రాజ్ రెస్టారెంట్‌లో భారత క్రికెట్ జట్టు డిన్నర్ చేస్తుండగా ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కినట్లు తెలుస్తోంది. విరాట్ ఫ్యాన్ పేజీ షేర్ నుంచి షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గేమ్‌ సంగతి పక్కన పెట్టి ఇంక పెళ్లి చేసుకుని సెటిల్‌ అయిపో అంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. ఏదేమైనా కేఎల్‌ రాహుల్‌ తన ఆటతీరు మార్చుకోకపోతే జట్టులో కొనసాగడం కష్టమనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మరో వైపు వచ్చే ఏడాది జనవరి, లేదా ఫిబ్రవరిలో ఈ జంట.. మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కానున్నట్లు తెలుస్తోంది. కానీ రాహుల్ తో పాటు ఇతర టీం ప్లేయర్స్ కూడా ఉన్నారు కదా.? రాహుల్ ని ఇలా టార్గెట్ చేసి ట్రోల్ చేయడం కరెక్ట్ అంటారా.? ఇండియా ఓటమికి అతనొక్కడే కారణమా.? మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలపండి.