“కృష్ణ ముకుంద మురారి” సీరియల్ లో కొత్త ట్విస్ట్..! అసలు ఏం జరుగుతోంది..?

“కృష్ణ ముకుంద మురారి” సీరియల్ లో కొత్త ట్విస్ట్..! అసలు ఏం జరుగుతోంది..?

by Mounika Singaluri

Ads

కృష్ణ ముకుంద మురారి సీరియల్ ప్రజెంట్ ఎపిసోడ్ లో మురారి కి నిద్రలో తన గతానికి సంబంధించిన ఒక విషయం గుర్తొస్తుంది. కృష్ణను తాను ఎంతగా ప్రేమించింది కృష్ణ తనకు ఐ లవ్ యు చెప్పిన సంగతి గుర్తొస్తాయి. కృష్ణ గురించిన ఆలోచనలను ఆమెను పేరును గట్టిగా పిలుస్తూ ఉలిక్కిపడి నిద్ర నుంచి లేస్తాడు.

Video Advertisement

ఆ పిలుపు విని ముకుంద కంగారుగా అతని బెడ్ రూమ్ లోకి వస్తుంది. మురారికి గతం గుర్తొచ్చిందని కంగారు పడుతుంది. మరోవైపు నిద్రలో తాను ఎవరి పేరు పలకరించాను గుర్తు రాక మురారి సంఘర్షణకి లోను అవుతాడు. తన పేరే పిలిచావని మురారిని నమ్మిస్తుంది ముకుందా.

ఇదివరకు బృందావనంలో ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉన్న ఇంటిని నువ్వే నరకంగా మార్చావని ముకుందపై రేవతి ఫైర్ అవుతుంది. మురారి జీవితాన్ని సర్వనాశనం చేశావని కోప్పడుతుంది. వెంటనే ముకుందా రివర్స్ ఎటాక్ చేస్తుంది. అన్ని నేనే చేసా, మురారి చనిపోయాడని బాడిని నేను ఇంటికి తెచ్చాను అంటూ తాను వేసిన ప్లాన్ మొత్తం రేవతికి చెప్పేస్తుంది.ఇవన్నీ చేసింది నేనే అని మీరు నమ్ముతున్నారు కానీ నేను కాదు చేసింది కృష్ణ. మీ కోడలు చేయలేదని నిరూపించిన తర్వాత నేను మీతో మాట్లాడతానని వెళ్ళిపోతుంది.

కృష్ణని ఇంట్లో నుంచి భవాని పెద్దమ్మ పంపించేస్తుందని మురారి అనుమాన పడతాడు. ఆమె ఇంటికి దూరమైతే తాను బతకగలనా అనుకుంటాడు. అప్పుడే భవాని అక్కడికి వస్తుంది. నీకు గతం గురించి చెప్పొద్దు అనుకున్న కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూసి చెప్పడం తప్ప లేదని మురారితో అంటుంది భవాని. మురారికి పెళ్లైన విషయాన్ని దాచేస్తుంది భవాని. నువ్వు ముకుందా ప్రేమలో ఉన్నావని అబద్ధం ఆడుతుంది. ముక్కుందా నువ్వు ప్రేమించుకున్నారని అంటుంది. కానీ భవాని మాటలను మురారి నమ్మడు.

నువ్వు వేణి మాయలో పడ్డావు, అందుకే మమ్మల్ని మర్చిపోయావు. నీకు ద్రోహం చేసిన వారిని మాటలు నమ్ముతున్నావని మురారి కి క్లాస్ పీకుతుంది భవాని. నువ్వే సర్వస్వని నమ్మి నీకు గతం గుర్తు రావాలని నీకోసం ఆశగా ఎదురు చూస్తున్న ముకుంద పరిస్థితి ఏమిటని నిలదీస్తుంది. నా ఆరోగ్యం బాగుపడాలంటే కృష్ణను కలవడం మానేయమని మురారి కి సలహా ఇస్తుంది.భవాని ఎంత చెప్పినా తన మాటలు మురారి నమ్మడు.తమ పెళ్లి ఫోటో చూస్తూ కృష్ణ ఎమోషనల్ అవుతుంది. మురారి కి గతం గుర్తొస్తూనే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయని అనుకుంటుంది. అనుకోకుండా అక్కడికి ఎంట్రీ ఇచ్చిన ముకుంద కృష్ణ చేతిలో ఉన్న ఫోటో లాక్కుంటుంది.

ఆ ఫోటో చూస్తే కృష్ణ మురారిల బంధం బయటపడే అవకాశం ఉంది కనుక ముకుంద కంగారు పడుతుంది. ఫోటో కాల్చడానికి ప్రయత్నిస్తుంది. కొంచెం కాలిన తర్వాత ఫోటో లాక్కుంటుంది కృష్ణ. నువ్వు ఫోటోలు మాత్రమే కాల్చగలవు కానీ నా మనసులో ఉన్న ముద్రని ఎవరూ చెరపలేరు అంటుంది. మురారి మనసులో తాను మాత్రమే ఉన్నానని చెబుతుంది. తనక గతానికి సంబంధించి ఇంట్లో ఏమైనా ఆధారాలు దొరుకుతాయా అని ఇల్లు మొత్తం వెతుకుతాడు మురారి. కృష్ణ మురారి ఫోటోలు ఒకటి కూడా కనిపించకుండా అన్నీ మాయం చేస్తుంది ముకుందా.

Also Read:ఆర్జీవి కలల రాణి ఇంత పద్ధతిగా మారిపోయింది ఏంటి..? ఎవరో గుర్తు పట్టారా.?


End of Article

You may also like