బుల్లితెర సీరియల్స్ లో కృష్ణ ముకుందా మురారి సీరియల్ కి మంచి ఆదరణ ఉంది. ఇందులో హీరో హీరోయిన న్ ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. అయితే ఇటీవల ఇందులో హీరోని మార్చేశారు.
స్టార్ మా లో అత్యధిక రేటింగ్ సాధించే టాప్ త్రీ సీరియల్స్ లో కృష్ణ ముకుంద మురారి ఉంటుంది.

Video Advertisement

సాయంత్రం 8:30 అయిందంటే చాలు ప్రేక్షకులు టీవీకి అతుక్కుపోతుంటారు ఈ సీరియల్ కోసం. అలాంటిది సీరియల్లో పెద్ద మార్పే చేసి కొత్త హీరోని ఎందుకు తీసుకొచ్చారు? అసలు దాని వెనక కారణం ఏమిటి? ఇంతకీ కొత్త హీరో ఎవరు?

ఇప్పటివరకు ఈ సీరియల్ లో హీరోగా చేసిన అతని పేరు గగన్ చిన్నప్ప. ఈ హీరో కన్నడ కి చెందినవాడు. మోడల్ గా కూడా మంచి పేరు ఉంది. అయితే గగన్ ను తప్పించిన మధుసూదన్ ను కొత్త హీరోగా తీసుకువచ్చారు. ఇలా చేయడానికి గల రీజన్ గగన్ అగ్రిమెంట్ పూర్తయిపోయిందని తెలిసింది. అగ్రిమెంట్ పూర్తయిన కూడా కొనసాగించే అవకాశం ఉన్నా, అలా ఎందుకు చేయడం లేదని ఆడియన్స్ ప్రశ్నిస్తున్నారు. అయితే గగన్ ఎక్కువ ప్రేమ్యూనరేషన్ డిమాండ్ చేశాడా లేక టీమ్ లో ఏమన్న ఇబ్బందులు వచ్చాయి అనేది తెలియాల్సి ఉంది.

ఇక కొత్తగా హీరోగా వచ్చిన నటుడు మధుసూదన్ ఆడియన్స్ కి కొత్త ఏం కాదు. కథలో రాజకుమారి, చెల్లెలికాపురం లాంటి హిట్ సీరియల్స్ లో నటించాడు. అయితే ఇప్పుడు మురారి పాత్రలో ఇతను ఎలా యాక్ట్ చేస్తారో చూడాలి.అయితే ఇలా ఒకరు చేసిన పాత్రలో మరొకని ఊహించుకోవడం ఆడియన్స్ కి అంత ఈజీ కాదు. పైగా కృష్ణతో గగన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడు మధుసూదన్ ఆడియన్స్ కి రిక్వెస్ట్ చేస్తూ ఒక వీడియో కూడా విడుదల చేశాడు. కృష్ణ ముకుందా మురారి ద్వారా మీ ముందుకు రాబోతున్నాను ముందులాగే నన్ను ఆదరించండి అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.

 

Also Read: OG సినిమాలో ఇంకో హీరోనా… ఎవరతను?