నిమ్మకాయలకే పిల్లలు పుట్టేస్తారట.. గర్భవతులం అంటూ హాస్పిటల్ కి వెళ్లిన మహిళలు.. అసలు విషయం తెలిసేసరికి..?

నిమ్మకాయలకే పిల్లలు పుట్టేస్తారట.. గర్భవతులం అంటూ హాస్పిటల్ కి వెళ్లిన మహిళలు.. అసలు విషయం తెలిసేసరికి..?

by Anudeep

Ads

మూఢ నమ్మకాలకు ఎంత కాలం గడిచినా కాలం చెల్లట్లేదు. సాంకేంతిక పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా దొంగబాబాలు చెప్పే సిద్ధాంతాలను ప్రజలు గుడ్డిగా నమ్మేస్తున్నారు. ఇటీవల కర్నూల్ జిల్లాలే ఇలాంటి సంఘటనే ఒకటి చోటు చేసుకుంది. గర్భవతులం అయ్యాం అంటూ కొందరు మహిళలు వైద్యులను సంప్రదించారు.

Video Advertisement

దీనితో, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు వివరాల్లోకి వెళితే.. కర్నూల్ జిల్లాకు చెందిన ఓ స్వామిజి మంత్రించిన నిమ్మకాయలు ఇచ్చి పిల్లలు పుడతారు అని చెప్తూ ప్రజలని మోసం చేస్తున్నాడు.

fake swamiji 2

కొత్తపల్లి మండలంలోని సింగరాజుపల్లికి చెందిన హరి అనే ఓ వ్యక్తి స్వామిజిగా అవతారం ఎత్తాడు. పిల్లలు లేని వారికి.. సంతానం కలిగించేలా చేస్తాను అంటూ మాయ మాటలు చెప్పాడు. మంత్రించిన నిమ్మకాయలు ఇస్తున్నానని.. మీకు పిల్లలు పుడతారు అని మహిళలను నమ్మించాడు. ముడుపుల రూపంలో డబ్బులు గుంజాడు. ఏకంగా గుడి కూడా కట్టించేసాడు.

fake swamiji 1

తాను నరసింహ స్వామి అవతారమని చెప్తూ.. వారం వారం దేవుడు తనతో మాట్లాడుతాడు అని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన కొందరు మహిళలు సంతానం కోసం ఆయన్ని పూజించారు. భారీగా ముడుపులు సమర్పించారు. వారికి మంత్రించిన నిమ్మకాయలు ఇచ్చి సంతానం కలుగుతుందని చెప్పాడు. వారు తాము గర్భవతులం అయ్యాము అని నమ్మి, కొత్తపల్లె ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లారు. తమకు ప్రభుత్వం ఇచ్చే గర్భవతి కార్డు ఇవ్వాలని కోరారు.

fake swamiji

దీనితో వైద్యులకు అనుమానం వచ్చింది. మీ గ్రామంలో ఆశావర్కర్లను సంప్రదించి స్కానింగ్ చేయించుకుని గర్భ నిర్ధారణ చేయించుకోవాలని ఆ వైద్యుడు సూచించారు. దీనితో ఆ మహిళలు ఆగ్రహించారు. తాము గర్భవతులమని స్వామిజి హరి చెప్పాడని, వైద్యం, మందులు వాడొద్దని స్వామిజి చెప్పాడని, తమకు గర్భవతి కార్డు మాత్రం ఇవ్వాలని వారు కోరారు. దీనితో వైద్యులు ఈ విషయమై పోలీసు, రెవెన్యూ, ఎంపీడీవోలను సంప్రదించారు. దీనితో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

fake swamiji 3

పోలీసులు ఆ సింగరాజుపల్లికి వెళ్లేసరికి స్వామిజి హరి అక్కడ లేరు. దీనితో మాయ మాటలు చెప్పే బాబాలను నమ్మొద్దని హితవు పలికారు. గతంలో ఈ స్వామిజి నందికొట్కూరులోని పగిడాల మండలం సంకిరేణి పల్లె లో కూడా ఇలానే చేస్తే.. అక్కడి ప్రజలు తరిమికొట్టారని, ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటె వైద్యులను సంప్రదించాలని లేకుంటే అనారోగ్యం పాలవుతారని హితవు చెప్పారు.


End of Article

You may also like