Ads
రోహిత్ శర్మ ప్రస్తుతం ఇండియన్ టీంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరు. ఇండియన్ టీంలో రోహిత్ శర్మ టాలెంటెడ్ ఓపెనర్. ప్రస్తుతం ఇండియన్ టీం వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ కృషి చేస్తున్నారు. అంతే కాదు.. ధనవంతులైన భారత క్రికెటర్ల జాబితాలో కూడా రోహిత్ శర్మ ఉన్నారు.
Video Advertisement
రోహిత్ శర్మ వద్ద ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయన్న సంగతి అందరికి తెలిసిందే. అవే కాదు.. ఎంతో ఖరీదైన వస్తువులను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నారు. అవేంటో ఓ లుక్ వేద్దాం.
#1 హబ్లోట్ క్లాసిక్- 5 లక్షలు:
రోహిత్ హుబ్లోట్ యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. అందువలన రోహిత్ శర్మ వద్ద హుబ్లోట్ బ్రాండ్ వారి వాచ్ లు చాలానే ఉన్నాయి. హబ్లోట్ క్లాసిక్ వాచ్ ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నారు. దీని ఖరీదు ఎంతో తెలుసా..? అక్షరాలా ఐదు లక్షల రూపాయలు.
#2 హబ్లోట్ క్లాసిక్ బ్లూ- 6 లక్షలు:
రోహిత్ శర్మ ఆరు లక్షల విలువైన హబ్లోట్ క్లాసిక్ బ్లూ ని కూడా సొంతం చేసుకున్నారు. ఇది క్రోనోగ్రాఫ్ టైటానియం ఎడిషన్. మాజీ ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ బ్రాండ్‌తో సంబంధం కలిగి ఉన్న తరువాత రోహిత్ శర్మ ప్రపంచ ప్రఖ్యాత కెప్టెన్ గా నిలిచారు.
#3 మారుతి విటారా బ్రెజ్జా- 10 లక్షలు
అందరు అబ్బాయిల లాగానే రోహిత్ కి కూడా కార్లు అంటే విపరీతమైన క్రేజ్. 10 లక్షల రూపాయల విలువైన మారుతీ విటారా బ్రెజ్జా ను కూడా రోహిత్ సొంతం చేసుకున్నారు. మారుతి విటారా బ్రెజ్జా చాలా సౌకర్యవంతమైన మరియు విశాలమైన ఎస్‌యూవీలలో ఒకటి. ఇది సుజుకి విటారా యొక్క తరహాలో డిజైన్ చేయబడింది.
#4 స్కోడా లారా- 20 లక్షలు:
రోహిత్ శర్మ ఫుల్ షాట్ ఆడడాన్ని ఎంత ప్రేమిస్తాడో.. కార్లను అంతకంటే ఎక్కువ గా ప్రేమిస్తాడు. రోహిత్ శర్మ కార్ల జాబితానే సెపరేటు. అన్ని కార్లను కలెక్ట్ చేసుకున్నాడు. ఇరవై లక్షల రూపాయలు ఖరీదు చేసే స్కోడా లారా ను కూడా రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు.
#5 హుబ్లోట్ ఫెరారీ యునికో మ్యాజిక్ గోల్డ్- 27.8 లక్షలు:
రోహిత్ శర్మ వద్ద ఉన్న అత్యంత ఖరీదైన వాటిలో హుబ్లోట్ ఫెరారీ యునికో మ్యాజిక్ గోల్డ్ వాచ్ ఒకటి. దీని ఖరీదు 27.8 లక్షలు. 2018 లో రోహిత్ తన పుట్టిన రోజు సందర్భం గా దీన్ని సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్ మ్యాచ్‌లో సీఎస్‌కేను ఓడించిన తర్వాతే ఇది సొంతమైంది. ఈ వాచ్ కార్బన్ కాంపోజిట్ మరియు టైటానియం వెర్షన్‌లో కూడా లభిస్తుంది. అయితే.. కింగ్ గోల్డ్ ఎడిషన్ మాత్రం చాలా అరుదు గా దొరుకుతుంది.
#6 BMW 350I- 80 లక్షలు:
ఈ మోడల్ ధర 80 లక్షల రూపాయలు. బిఎమ్‌డబ్ల్యూ 3 సిరీస్ ఆగస్టు 2019 లో భారతదేశంలో ప్రారంభించబడింది. ఇది రోహిత్ వద్ద ఉన్న రెండవ BMW. రోహిత్ వద్ద ఉన్న కార్ల ఖరీదు కనీసం ఐదు కోట్ల వరకు ఉండొచ్చు.
#7 మెర్సిడెస్ జిఎల్ఎస్ 350 డి- 95 లక్షలు:
రోహిత్ శర్మకు మెర్సిడెస్ జిఎల్ఎస్ 350 డి ఉంది. దీని ధర 95 లక్షల రూపాయలు. ఇది 11.5 కిలోమీటర్ల సర్టిఫైడ్ మైలేజీతో తిరిగి వస్తుంది. ఈ 350 డి వేరియంట్‌లో 255 బిహెచ్‌పి @ 3400 ఆర్‌పిఎమ్ మరియు 620 ఎన్‌ఎమ్ @ 1600 ఆర్‌పిఎమ్ గరిష్ట శక్తి మరియు మాక్స్ టార్క్ ఉన్నాయి.
#8 BMW M5- 1.33 కోట్లు:
దీని ధర 1.33 కోట్ల రూపాయలు. రోహిత్ వద్ద ఉన్న ఈ BMW M5 కి చాలా ప్రత్యేకత ఉంది. ఇది ఎం ట్విన్‌పవర్ టర్బో, రోడ్ రోస్టింగ్ ఇంజన్ సెట్ మరియు ఎనిమిది సిలిండర్ల ఇంజిన్‌తో నిండి ఉంది. ఇది తన డ్రీం కార్ అని రోహిత్ కెరీర్ తొలినాళ్లలో ఓ ఇంటర్వ్యూ లో తెలిపాడు.
#9 ఖండాల హాలిడే హోమ్ – 5 కోట్లు:
ఎ-గ్రేడ్ హాలిడే హోమ్ కోసం 5 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ఓ నివేదిక తెలుపుతోంది. రోహిత్ శర్మ సంతోషంగా ఖండాలాకు వచ్చి తన కుటుంబ సభ్యులతో కలిసి తన హాలిడే ను ఈ ఇంట్లో గడుపుతాడు. ఎవరైనా ఇంతకంటే ఇంకేమి కోరుకుంటారు.
#10 వర్లి అపార్ట్మెంట్- 30 కోట్లు:
ఇది క్రికెటర్ యాజమాన్యంలోని అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంట్లలో ఒకటి. ఈ అపార్ట్మెంట్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి.చెఫ్ ఆన్ డిమాండ్, బిజినెస్ ఏరియా, స్విమ్మింగ్ పూల్, జిమ్, యోగా రూమ్, కిడ్స్ రూమ్, ఇంకా పెద్ద వారికి కూడా వేరు వేరు గదులు ఉన్నాయి.
End of Article