కపిల్ దేవ్ కు ఆ స్టార్ హీరోయిన్ తో లవ్ స్టోరీ ఉందని తెలుసా..? వీరికి ఎందుకు బ్రేక్ అప్ అయ్యిందంటే..?

కపిల్ దేవ్ కు ఆ స్టార్ హీరోయిన్ తో లవ్ స్టోరీ ఉందని తెలుసా..? వీరికి ఎందుకు బ్రేక్ అప్ అయ్యిందంటే..?

by Anudeep

Ads

క్రికెట్, సినిమా.. ఈ రెండిటికి భారత్ లో అత్యంత సముచిత స్థానం ఉంది. ఈ రెండు రంగాల్లోని సెలెబ్రిటీల సంగతి ఇక ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ రంగంలో అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెటర్ కపిల్ దేవ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Video Advertisement

అయితే.. కపిల్ దేవ్ కు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సారికతో లవ్ స్టోరీ ఉందన్న సంగతి తెలిసిందే. సారిక కమల్ హాసన్ మాజీ భార్య అన్న సంగతి తెలిసిందే. కానీ, వీరిద్దరూ పెళ్లి చేసుకోక ముందే సారిక, కపిల్ దేవ్ లు సన్నిహితంగా ఉండేవారు.

kapil dev 1

వారిద్దరిమధ్య ప్రేమ నడుస్తోందని, వారిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న అప్పట్లోనే మీడియా కోడై కూసింది. వీరిద్దరూ మొట్టమొదటి సారి కలుసుకున్నప్పుడే చాలా సేపు మాట్లాడుకున్నారు. వీరిద్దరూ సన్నిహితంగా మెలగడం చూసిన మీడియా వీరి గురించి చాలా గాసిప్ లు రాసేది. హిందూస్థాన్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, ఆ రోజుల్లో, ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నందున కపిల్ సారికను పంజాబ్‌లోని తన తల్లిదండ్రులను కలవడానికి తీసుకెళ్లాడని పేర్కొంది.

kapil dev

అయితే, ఆ తరువాత వీరిద్దరూ తమ బంధానికి ముగింపు పలికారు. దీనికి కారణం కపిల్ దేవ్ కి సారిక కి మధ్య మనస్పర్థలు రావడం కాదు. సారిక కంటే ముందే కపిల్ దేవ్ కు రోమి భాటియా తో పరిచయం ఉంది. అయితే.. సారిక గురించిన వార్తలు న్యూస్ పేపర్స్ లో వస్తుండడంతో రోమి మనసు నొచ్చుకుని కపిల్ దేవ్ కి దూరంగా ఉన్నారు. రోమి దూరం అవ్వడం వల్లే కపిల్ దేవ్ సారికకి దగ్గరయ్యారని చెబుతుంటారు. ఆ తరువాత రోమితో మనస్పర్థలు సర్దుమణగడంతో తిరిగి కపిల్ దేవ్ రోమితో తన బంధాన్ని కొనసాగించారని చెబుతుంటారు.


End of Article

You may also like