Home serials MALLI SERIAL: “భావన లాస్య” మల్లిగా ఎలా మారింది.? ఆమె వయసు ఎంతో తెలుసా.?

MALLI SERIAL: “భావన లాస్య” మల్లిగా ఎలా మారింది.? ఆమె వయసు ఎంతో తెలుసా.?

by Mohana Priya

ఇప్పుడు వస్తున్న సీరియల్స్ లో చాలా మంది హీరోయిన్స్ ఉంటున్నారు. కానీ వాళ్ళలో చాలా మంది వేరే భాషల ఇండస్ట్రీలకు చెందినవారు. చాలా మంది కన్నడ హీరోయిన్లు ఉంటున్నారు. ఇంకా కొంత మంది తమిళ్ హీరోయిన్లు, మలయాళం హీరోయిన్లు ఉంటున్నారు. వారికి తెలుగులో డబ్బింగ్ చెప్పించి సీరియల్స్ లో నటించేలా చూస్తున్నారు.

తెలుగు హీరోయిన్లకి అవకాశాలు ఎందుకు ఎక్కువగా రావు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఇంత మంది వేరే భాషల హీరోయిన్ల మధ్యలో ఇప్పుడు ఒక తెలుగు హీరోయిన్ కూడా వెలుగుతున్నారు.

malli serial heroine bhavana lasya

ఆమె మల్లి సీరియల్ హీరోయిన్ భావనా లాస్య. స్టార్ మా లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ మంచి రేటింగ్స్ తో దూసుకుపోతోంది.  ఊరిలో చదువుకోవాలి అని కలలు కన్న ఒక అమ్మాయి, అనుకోకుండా సిటీకి రావడం, ఆ తర్వాత ఆ అమ్మాయి ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనే అంశం చుట్టూ ఈ సీరియల్ నడుస్తుంది. అయితే ఈ సీరియల్ లో టైటిల్ పాత్ర పోషిస్తున్నారు భావనా లాస్య. భావన బెంగాల్ లో పుట్టినా కూడా వైజాగ్ లో పెరిగారు. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. భావనకి కెనడాలో ఎంబీఏ పూర్తి చేసి ఉద్యోగం చేయాలి అనే కల ఉండేది. అనుకోకుండా మల్లి సీరియల్ అవకాశం వచ్చింది.

malli serial heroine bhavana lasya

సోషల్ మీడియాలో తను పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి స్టార్ మా బృందం భావనని సంప్రదించారు.  తర్వాత వాళ్లు కాల్ కూడా చేశారు. ఇదంతా నిజం కాదు అని అనుకున్నారు భావన. కానీ ఒకసారి ఫోన్ చేసి “సీరియల్ చేస్తావా?” అని అడిగారు. ప్రతిసారి “పరీక్షలు ఉన్నాయి” అని ఏదో ఒక కారణం చెప్పి భావన తప్పించుకునేవారట. కానీ “ఒకసారి వెళ్లి చూద్దాం అనుకొని ఈశ్వర్ సర్ ని కలిశారు” అని, అప్పుడు తనకి ఈ సీరియల్ అన్నపూర్ణ స్టూడియోస్ వారు నిర్మిస్తున్న సీరియల్ అని తెలిసింది అని అన్నారు.

malli serial heroine bhavana lasya

దాంతో భావనకి నమ్మకం వచ్చి సీరియల్ లో నటించడానికి అంగీకరించారు. ఈ విషయాన్ని వాళ్ళ ఇంట్లో చెప్తే భావన తల్లి ప్రోత్సహించారు. భావన తనకి యాక్టింగ్ రాదు ఏమో అని భయపడుతున్నా కూడా, “ఒకసారి చేస్తేనే కదా తెలుస్తుంది” అని భావన తల్లి ధైర్యం చెప్పారు. అలా సీరియల్స్ లోకి అడుగు పెట్టారు. భావన వయసు కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. ఇంత చిన్న వయసులోనే ఇంత గుర్తింపు సంపాదించుకున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Bhavana Lasya (@__lasya.__)

ALSO READ : 14 ఏళ్ల తర్వాత మళ్లీ నాగార్జున తో జతకడుతున్న హీరోయిన్… ఎవరో తెలుసా?

You may also like