ఆ వాట్సాప్ మెసేజ్ ను ఫార్వార్డ్ చేయడమే…అతని ప్రాణం తీసింది.! తూర్పుగోదావరిలో షాకింగ్ సంఘటన.!

ఆ వాట్సాప్ మెసేజ్ ను ఫార్వార్డ్ చేయడమే…అతని ప్రాణం తీసింది.! తూర్పుగోదావరిలో షాకింగ్ సంఘటన.!

by Mohana Priya

Ads

తూర్పుగోదావరి జిల్లా అమలాపురం లో జరిగిన ఒక ఘటన చర్చలకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే 10 టీవీ కథనం ప్రకారం నారాయణపేట కు చెందిన గుత్తుల శ్రీనివాస్ ఆక్వా కంపెనీ లో పని చేస్తారు.  శ్రీనివాస్ సెల్ ఫోన్ కి కోళ్లకి కూడా సోకిన కరోనా మహమ్మారి అనే వాట్సాప్ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ ని శ్రీనివాస్ వేరే వారికి ఫార్వర్డ్ చేశారు.

Video Advertisement

దీనిపై కంప్లైంట్ అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం శ్రీనివాస్ కి ఫోన్ చేసి విచారించారు. శ్రీనివాస్ తనకి ఏమీ తెలియదు అని చెప్పినా కూడా పోలీసులు వినలేదు. దాంతో శ్రీనివాస్ ఆందోళనకు గురయ్యారు. తీవ్ర ఆందోళనకు గురవ్వడంతో చెమటలు పట్టి పడిపోయారు శ్రీనివాస్.

ట్రీట్మెంట్ కోసం మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా ఎవరు చేర్చుకోలేదు. చివరికి అమలాపురంలోని కిమ్స్ లో చేర్పించారు. కానీ గంట వ్యవధిలో శ్రీనివాస్ మరణించారు అని ఆయన భార్య వెంకట పద్మ తెలిపారు.ఇది చాలా పెద్ద కేసు అవుతుంది అని బెదిరిస్తూ శ్రీనివాస్ ఫోన్ ని స్థానికులు తీసుకెళ్లారు. తర్వాత కొంచెం సేపటికి దాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేశారు అని పద్మ చెప్పారు.

హైదరాబాద్ లోని సైబర్ క్రైమ్ సిఐ రాజేష్, ఎస్ఐ రంజిత్ కుమార్ తన భర్తని మానసికంగా హింసించారు అని అన్నారు. పోలీసుల వేధింపులు కారణంగా శ్రీనివాస్ చనిపోయినట్టు పద్మ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  వీరికి 9 ఏళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు.


End of Article

You may also like